Bihar: 26 ఏళ్ల న్యాయపోరాటం తర్వాత ఎట్టకేలకు నిర్దోషిగా తీర్పు ఇచ్చిన కోర్టు.. పట్టరాని ఆనందంతో కోర్టులోనే..

ఏళ్లకి ఏళ్లుగా న్యాయ పోరాటం చేస్తున్న ఓ వ్యక్తికి కోర్టు అనుకూలంగా తీర్పు ఇచ్చింది. దీంతో పట్టరాని ఆనందంతో సదరు వ్యక్తి కోర్టులోనే అక్కడికక్కడే మృతి చెందాడు. వివరాల్లోకెళ్తే..

Bihar: 26 ఏళ్ల న్యాయపోరాటం తర్వాత ఎట్టకేలకు నిర్దోషిగా తీర్పు ఇచ్చిన కోర్టు.. పట్టరాని ఆనందంతో కోర్టులోనే..
Bihar man died with heart attack
Follow us

|

Updated on: Oct 21, 2022 | 11:31 AM

ఏళ్లకి ఏళ్లుగా న్యాయ పోరాటం చేస్తున్న ఓ వ్యక్తికి కోర్టు అనుకూలంగా తీర్పు ఇచ్చింది. దీంతో పట్టరాని ఆనందంతో సదరు వ్యక్తి కోర్టులోనే అక్కడికక్కడే మృతి చెందాడు. వివరాల్లోకెళ్తే.. బెల్‌హర్‌ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఝుంకా గ్రామానికి చెందిన నాగోసింగ్‌ (76)తోపాటు మరో నలుగురిపై 1996లో పంటను తగులబెట్టిన ఆరోపణలపై కేసు నమోదైంది. వీరంతా కొంతకాలం విచారణ ఖైదీలుగా జైలులో ఉన్నారు. ఆ తర్వాత బెయిల్‌పై బయటకు వచ్చారు. ఈ కేసును బుధవారం విచారించిన న్యాయమూర్తి తీర్పు వెలువరించారు. తీర్పు నాగో సింగ్‌కు, ఇతర నిందితులకు అనుకూలంగా రావడంతో వారంతా నిర్దోషులుగా ప్రకటించారు. తీర్పు విన్న నాగోసింగ్‌ ఆనందాన్ని పట్టలేక కోర్టులోనే కుప్పకూలాడు. కుటుంబ సభ్యులు హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. అప్పటికే నాగోసింగ్‌ గుండెపోటుతో మరణించినట్టు వైద్యులు ధ్రువీకరించారు.

నాగో సింగ్‌ తాను ఎప్పుడూ నిర్దోషినని చెబుతూ ఉండేవాడు. దీనిని నిరూపించుకోవడానికి 26 ఏళ్లుగా పోరాడుతున్నాడు. చివరికి కోర్టు అనుకూలంగా తీర్పు ఇచ్చినా మనిషి దక్కలేదని కుటుంబ సభ్యులు కన్నీటిపర్యాంత మయ్యారు. నిజానికి ఈ కేసులో సరైన ఆధారాలు లేకపోవడంతో కోర్టు వీరందరినీ నిర్దోషులుగా ప్రకటించింది. సుదీర్ఘ కాలం తర్వాత నిర్దోషిగా తీర్పు వెలువడం ఇదేం మొదటి సారి కాదు.

ఇవి కూడా చదవండి

బక్సర్ జిల్లాకు చెందిన మున్నా సింగ్‌ అనే వ్యక్తి 1979 నుంచి 43 ఏళ్ల పాటు న్యాయం కోసం పోరాడాడు. అక్టోబర్ 11న నిర్దోషిగా ప్రకటించడంతో జైలు నుంచి విడుదలయ్యాడు. బక్సర్ జిల్లాలోని మురార్ పోలీస్ స్టేషన్‌లోని చౌగై గ్రామానికి చెందిన వ్యాపారవేత్తపై దాడి, కాల్పులు, హత్యాయత్నానికి పాల్పడిన నేరంగ కింద సదరు వ్యక్తికిని పోలీసులు అరెస్టు చేశారు.  ఈ కేసులో అరెస్టు అయినప్పుడు మున్నా సింగ్‌ వయసు కేవలం 10 ఏళ్లు మాత్రమే.