Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

IIT ఢిల్లీ, IIT బాంబే కానేకాదు.. ‘ఇస్రో సైంటిస్టుల ఫ్యాక్టరీ’గా పేరుగాంచిన ఈ కాలేజీ గురించి మీకు తెలుసా?

దేశ వ్యాప్తంగా ఉన్న ప్రతిష్టాత్మక ఇంజనీరింగ్ కాలేజీల్లో టాప్‌ ఏదంటే.. కళ్లు మూసుకుని ఠపీమనీ IIT ఢిల్లీ, IIT బాంబే అని చెప్పేస్తారు. కానీ వీటికి మించిన కాలేజీ ఒకటి జార్ఖండ్‌లోని రాంచీలో ఉంది. దీనికి 'శాస్త్రవేత్తల కర్మాగారం (factory' of scientists)'గా పేరు. ఎందుకంటే ఇక్కడ చదివిన విద్యార్థులు ఏకంగా భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో)లో సైంటిస్టులైపోతున్నారు. అదే BIT మెస్రా కాలేజీ..

IIT ఢిల్లీ, IIT బాంబే కానేకాదు.. 'ఇస్రో సైంటిస్టుల ఫ్యాక్టరీ'గా పేరుగాంచిన ఈ కాలేజీ గురించి మీకు తెలుసా?
BIT Mesra
Srilakshmi C
|

Updated on: Jul 06, 2025 | 5:43 PM

Share

రాంచి, జులై 6:  జార్ఖండ్.. దేశంలోని వెనుకబడిన రాష్ట్రాలలో ఒకటి. ఇక్కడ విద్యా సౌకర్యాలు, వనరులు అంతంత మాత్రంగా ఉంటాయి. ఇక్కడి బిర్లా ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (BIT) మెస్రా రాంచీలో ఉన్న ఓ ప్రీమియం ఇంజనీరింగ్ అండ్‌ మేనేజ్‌మెంట్ సంస్థ. ఈ విద్యా సంస్థలోని స్పేస్ ఇంజనీరింగ్, రాకెట్రీ విభాగం ఇప్పటి వరకు ఇస్రోకు లెక్కకుమించి సైంటిస్టులను అందించింది. ఇస్రో స్థాపనకు ముందే స్పేస్ ఇంజనీరింగ్, రాకెట్రీ విభాగం BIT మెస్రాలో స్థాపించబడింది.

ఏమిటీ BIT మెస్రా?

ఏరోస్పేస్ ఇంజనీరింగ్, రాకెట్ టెక్నాలజీలో శాస్త్రవేత్తలు, ఇంజనీర్లకు శిక్షణ ఇవ్వడానికి 1964లో BIT మెస్రాలో ఏరోస్పేస్ ఇంజనీరింగ్, రాకెట్రీ విభాగం స్థాపించారు. ఇది స్పేస్ ఇంజనీరింగ్, రాకెట్రీలో M.Tech, PhD కోర్సులను అందిస్తుంది. ఇక్కడి విద్యార్థులు ఏరోడైనమిక్స్‌లో స్పెషలైజేషన్, రాకెట్ ప్రమోషన్‌లో స్పెషలైజేషన్‌తో ఏరోస్పేస్ ఇంజనీరింగ్‌ను అభ్యసించవచ్చు. అంతేకాదు BIT మిస్రాలో మంచి మౌలిక సదుపాయాలు ఉంటాయి. రెండేళ్ల కోర్సుకు రూ.16 లక్షల నుంచి 18 లక్షల రుసుము ఇక్కడ వసూలు చేస్తారు.

ఇక్కడ చదువుకున్న ఇస్రో శాస్త్రవేత్త ఎవరు?

బీఐటీ మెస్రాలోని చాలా మంది విద్యార్థులు ఇస్రోలో ఉద్యోగం పొందారని అసోసియేట్ ప్రొఫెసర్ HOD డాక్టర్ ప్రియాంక్ కుమార్, శ్రీ కుమార్ తెలిపారు. ఇస్రో నియామకాల కోసం BIT మిస్రాను యేటా తప్పక సంప్రదిస్తుంది. ఇస్రో ఆదిత్య ఎల్1 మిషన్ ప్రాజెక్ట్ డైరెక్టర్ నిగర్ షాజీ బీఐటీ మెస్రాలో చదువుకున్న విద్యార్థి. క్రయోజెనిక్ ప్రాజెక్ట్ (ISRO) ఛైర్మన్ EVS నంబూద్రి, పద్మశ్రీ MC దాతన్ (విక్రమ్ సారాభాయ్ స్పేస్ సెంటర్), AK చక్రవర్తి, సిబ్నాథ్ సోమ్ (డిఫెన్స్ రీసెర్చ్ & డెవలప్‌మెంట్ లాబొరేటరీ), డాక్టర్ D. నారాయణ్ (ఏరోనాటికల్ డెవలప్‌మెంట్ ఏజెన్సీలో శాస్త్రవేత్త), RD స్వామి (డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ లాబొరేటరీలో శాస్త్రవేత్త) వీరంతా.. బీఐటీ మెస్రా పూర్వ విద్యార్ధులే కావడం గమనార్హం.

ఇవి కూడా చదవండి

మరిన్ని విద్యా, ఉద్యోగ వార్తల కోసం క్లిక్‌ చేయండి.

హ్యాట్సాఫ్‌! ట్రయథ్లాన్‌లో చరిత్ర సృష్టించిన.. టాలీవుడ్ హీరోయిన్.
హ్యాట్సాఫ్‌! ట్రయథ్లాన్‌లో చరిత్ర సృష్టించిన.. టాలీవుడ్ హీరోయిన్.
నయన్‌పై ధనుష్‌తో పాటు మరో నిర్మాత సీరియస్.. 5 కోట్లకు నోటీస్‌
నయన్‌పై ధనుష్‌తో పాటు మరో నిర్మాత సీరియస్.. 5 కోట్లకు నోటీస్‌
తన సినిమా ప్రివ్యూ చూస్తూ.. కుప్పకూలిన టాలీవుడ్ డైరెక్టర్
తన సినిమా ప్రివ్యూ చూస్తూ.. కుప్పకూలిన టాలీవుడ్ డైరెక్టర్
3 ఏళ్ల నిషేధం తర్వాత మళ్లీ ఫ్రీ ఫైర్ గేమింగ్‌.. ఎప్పటి నుంచి అంటే
3 ఏళ్ల నిషేధం తర్వాత మళ్లీ ఫ్రీ ఫైర్ గేమింగ్‌.. ఎప్పటి నుంచి అంటే
ముందు నుయ్యి.. వెనుక గొయ్యి.. చిక్కుల్లో 29 మంది తారలు..
ముందు నుయ్యి.. వెనుక గొయ్యి.. చిక్కుల్లో 29 మంది తారలు..
చిన్న తప్పుతో.. EDకి అడ్డంగా దొరికిన టాలీవుడ్ స్టార్స్
చిన్న తప్పుతో.. EDకి అడ్డంగా దొరికిన టాలీవుడ్ స్టార్స్
సినిమాల్లో నటించాలనుకునే వారికి సూపర్ డూపర్ ఛాన్స్..
సినిమాల్లో నటించాలనుకునే వారికి సూపర్ డూపర్ ఛాన్స్..
ప్రేమోన్మాది ఘాతుకం.. యువతిని పొడిచి.. రక్తపు మడుగులో తాళి కట్టి
ప్రేమోన్మాది ఘాతుకం.. యువతిని పొడిచి.. రక్తపు మడుగులో తాళి కట్టి
నా పిల్లిని చూసుకోండి.. కోట్లు అందుకోండి.. అబ్బా బంపర్ ఆఫర్ మామా
నా పిల్లిని చూసుకోండి.. కోట్లు అందుకోండి.. అబ్బా బంపర్ ఆఫర్ మామా
ఇది ఇల్లేనా ?? ఇలా కట్టారేంటి ?? ఎవరైనా ఉంటారా దీనిలో
ఇది ఇల్లేనా ?? ఇలా కట్టారేంటి ?? ఎవరైనా ఉంటారా దీనిలో