AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

AP 10th Results: పరీక్షలు నిర్వహించాలని అన్ని ప్రయత్నాలు చేశాం కానీ.. వారి కోరిక మేరకు సీఎం ఈ నిర్ణయం తీసుకున్నారు.

AP 10th Results: కరోనా కారణంగా దేశంలోని అన్ని రాష్ట్రాలు పరీక్షలు రద్దు చేసినట్లే ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం కూడా కీలక నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ఏపీ ప్రభుత్వం చివరి క్షణం వరకు పరీక్షలను నిర్వహించాలనే ఉద్దేశంతోనే ఉన్నా తప్పని పరిస్థితుల్లో...

AP 10th Results: పరీక్షలు నిర్వహించాలని అన్ని ప్రయత్నాలు చేశాం కానీ.. వారి కోరిక మేరకు సీఎం ఈ నిర్ణయం తీసుకున్నారు.
Adimulapu Suresh
Narender Vaitla
|

Updated on: Aug 06, 2021 | 6:03 PM

Share

AP 10th Results: కరోనా కారణంగా దేశంలోని అన్ని రాష్ట్రాలు పరీక్షలు రద్దు చేసినట్లే ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం కూడా కీలక నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ఏపీ ప్రభుత్వం చివరి క్షణం వరకు పరీక్షలను నిర్వహించాలనే ఉద్దేశంతోనే ఉన్నా తప్పని పరిస్థితుల్లో పరీక్షలను రద్దు చేస్తూ నిర్ణయం తీసుకుంది. ఇందులో భాగంగానే శుక్రవారం ఏపీ విద్యా శాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ పదో తరగతి పరీక్షా ఫలితాలను విడుదల చేశారు. ఇంటర్నల్‌గా 50 మార్కుల చొప్పున నిర్వహించిన 3 ఫార్మేటివ్ అసెస్‌మెంట్ల ఆధారంగా ఈ గ్రేడ్లు ప్రకటించారు.

ఫలితాలను విడుదల చేసే క్రమంలో మంత్రి ఆదిమూలపు సురేష్‌ కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో పరీక్షలు నిర్వహించేందుకు అన్ని రకాల ప్రయత్నాలు చేశామని తెలిపిన మంత్రి.. విద్యార్థులు, తల్లిదండ్రుల ఆందోళన మేరకు ముఖ్యమంత్రి జగన్‌ మోహన్‌ రెడ్డి పరీక్షల రద్దుకు నిర్ణయం తీసుకున్నారని చెప్పుకొచ్చారు. ఏ పరిస్థితుల్లో పదో తరగతి పరీక్షలు రద్దు అయ్యాయో అందరికీ తెలుసని వ్యాఖ్యానించారు. రెండో ఏడాది కూడా వరుసగా పరీక్షలు నిర్వహించలేని పరిస్థితి వచ్చిందని మంత్రి ఈ సందర్భంగా గుర్తు చేశారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగాల్లో మెట్రిక్‌ కీలక అర్హతగా ఉంటుందని మంత్రి చెప్పుకొచ్చారు. పరీక్షలు రద్దు అయిన నేపథ్యంలో విద్యార్థుల తల్లిదండ్రులు గ్రేడ్స్‌ కావాలని కోరారని.. వారి అభ్యర్థన మేరకు ప్రభుత్వం హై పవర్‌ కమిటీ ఏర్పాటు చేసిందని తెలిపారు. కమిటీ ఇచ్చిన నివేదికను యథాతథంగా ఆమోదించామన్నారు. విద్యార్థుల ప్రతిభను ప్రామాణికంగా తీసుకుని ఫలితాలు రూపొందించామని చెప్పిన మంత్రి.. విద్యార్థులందరినీ ఉత్తీర్ణులుగా ప్రకటించామన్నారు. ఇక మంత్రి ఒకేసారి రెండు విద్యా సంవత్సరాలకు సంబంధించిన ఫలితాలను విడుదల చేశారు. 2019-20, 2020-21 విద్యా సంవత్సరాలకు సంబంధించిన ఫలితాలను విద్యార్థులకు అందుబాటులోకి తీసుకొచ్చారు. ఇక 2019-2020 విద్యా సంవత్సరానికి 6.37 లక్షల మంది, 2020-2021 ఏడాదికి 6.26 లక్షల మంది ఫలితాలను విడుదల చేశారు.

Also Read: MS Dhoni Twitter Issue : ఫ్యాన్స్‌ ఆగ్రహంతో వెనక్కు తగ్గిన ట్విట్టర్..! టిక్ మార్క్ అప్‌డేట్ చేసిన కంపెనీ..

Bigg Boss Telugu 5: భారీ రెమ్యునరేషన్‌‌‌‌తో ‘బిగ్ బాస్’5లోకి ఎంటర్ అవ్వనున్న జబర్దస్త్ స్టార్ కమెడియన్..?

Bank Accounts:బ్యాంక్ ఎకౌంట్ హోల్డర్ మరణిస్తే.. ఆ ఎకౌంట్‌లో సొమ్ము ఏమవుతుంది? వారసులు ఏం చేయాలి?