AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Bank Accounts:బ్యాంక్ ఎకౌంట్ హోల్డర్ మరణిస్తే.. ఆ ఎకౌంట్‌లో సొమ్ము ఏమవుతుంది? వారసులు ఏం చేయాలి?

బ్యాంక్ అకౌంట్ కలిగిన వ్యక్తి మరణిస్తే, అతని డబ్బును ఎవరు పొందుతారనే విషయంపై మీరు ఎప్పుడైనా ఆలోచించారా?

Bank Accounts:బ్యాంక్ ఎకౌంట్ హోల్డర్ మరణిస్తే.. ఆ ఎకౌంట్‌లో సొమ్ము ఏమవుతుంది? వారసులు ఏం చేయాలి?
Bank Accounts
KVD Varma
|

Updated on: Aug 06, 2021 | 5:32 PM

Share

Bank Accounts: బ్యాంక్ అకౌంట్ కలిగిన వ్యక్తి మరణిస్తే, అతని డబ్బును ఎవరు పొందుతారనే విషయంపై మీరు ఎప్పుడైనా ఆలోచించారా? లేదా మరణించిన వ్యక్తి వారసులుగా మీరు ఆ డబ్బును ఎలా పొందగలరు? ఈ విషయం గురించి మీకు తెలుసా? కరోనా సమయంలో, చాలామంది అలాంటి అనేక సమస్యలను ఎదుర్కొన్నారు. ఇంకా ఎదుర్కుంటున్నారు.  అలాగే, మీరు బ్యాంకులో డిపాజిట్ చేస్తే, వ్యక్తిగత పేరుతో చెక్కును ఎప్పటికీ ఇవ్వకూడదని మీకు తెలుసా? ఈ విషయాల గురించి వివరంగా తెలుసుకుందాం. దీనిని సరిగ్గా అర్ధం చేసుకోవడానికి గతంలో జరిగిన కొన్ని కేసులను ఆధారంగా చేసుకుని మీకు ఇక్కడ వివరిస్తున్నాం.

కేసు -1- ఖాతాదారుడి మరణాన్ని బ్యాంక్ మేనేజర్ సద్వినియోగం చేసుకున్నాడు

ఈ కేసు హెచ్ఎస్బీసీ  బ్యాంక్ ఆఫ్ ముంబైలో వెలుగులోకి వచ్చింది. ఇక్కడ ఒక ఖాతాదారుడు మరణించాడు. అకౌంట్‌లోని లావాదేవీ చాలాకాలం ఆగిపోయాయి. ఈ సందర్భాన్ని ఆ బ్యాంక్ మేనేజర్ సద్వినియోగం చేసుకున్నాడు. ఆ ఎకౌంట్చా నుంచి  చాలా రోజులుగా  లావాదేవీ జరగలేదని గమనించాడు. దీంతో  అతను ఖాతా నుండి 75 లక్షల రూపాయలను తన బంధువుల పేరుకు బదిలీ చేసాడు. చాలా కాలం తర్వాత, ఖాతాదారుని కుమార్తె తన తండ్రి డబ్బును తన ఖాతాకు బదిలీ చేయమని బ్యాంకుకు విజ్ఞప్తి చేసింది.  దీనిని పరిష్కరించడానికి  బ్యాంక్‌కు  ఒక సంవత్సరం పట్టింది.

అకౌంట్ హోల్డర్ మరణించిన తర్వాత 6 సంవత్సరాలు ఖాతా కొనసాగింది

మరో కేసులో దాని ఫిర్యాదు ఉన్నత అధికారులకు అందిన తరువాత దర్యాప్తు చేశారు.  ఆ శాఖలోని అనేక ఖాతాల నుంచి డబ్బు బదిలీ అయినట్లు దర్యాప్తులో తేలింది. 2015 లో యజమాని మరణించిన ఖాతా ఒకటి వెలుగులోకి వచ్చింది. ఆయన మరణించిన తర్వాత 6 సంవత్సరాల పాటు ఖాతా నిర్వహించడం జరిగింది.  ఖాతా నుండి రూ. 21 లక్షలు అదృశ్యమయ్యాయి. ఈ డబ్బుని బదిలీ చేయడానికి, బ్యాంక్ మేనేజర్ స్వయంగా ఒక కొత్త KYC (నో యువర్ కస్టమర్) ఫారమ్‌ను నింపి, దానిలోని మొబైల్ నంబర్‌ను మార్చారు. ఈ విషయంపై పోలీసులకు ఫిర్యాదు చేశారు.

కేసు -2- ఫిక్స్డ్ డిపాజిట్ స్కామ్-

కోటక్ మహీంద్రా బ్యాంకులో ఫిక్స్డ్ డిపాజిట్ కేసు తెరపైకి వచ్చింది. ముంబై బ్రాంచ్‌లో, దాని బ్రాంచ్ మేనేజర్ ఫిక్స్‌డ్ డిపాజిట్ల (FD) పై అధిక వడ్డీని చెల్లించి 22 మంది నుండి రూ. 8.64 కోట్లను డిపాజిట్ చేశారు. బ్రాంచ్ మేనేజర్ ఈ డబ్బు మొత్తాన్ని వేరే పేరుతో చెక్కు తీసుకొని మరొక ఖాతాలో జమ చేసి డబ్బును బదిలీ చేసాడు. డూప్లికేట్ బ్యాంక్ రశీదు కూడా వినియోగదారులకు ఇచ్చాడు ఆ మేనేజర్.

వ్యక్తిగత పేరుపై చెక్ ఇవ్వవద్దు

వాస్తవానికి, డిపాజిట్ లేదా ప్రైవేట్ పేరుతో FD కోసం ఏ బ్యాంకులోనూ చెక్కు జారీ చేయడం జరగదు. మీరు FD చేసినప్పుడు లేదా బ్యాంకులో డబ్బు డిపాజిట్ చేసినప్పుడు, అది బ్యాంక్ పేరులో ఉండేలా చూసుకోండి. ఉదాహరణకు మీరు ABCD బ్యాంకులో FD చేయబోతున్నారని అనుకుందాం లేదా మీరు మీ రుణాన్ని తిరిగి చెల్లించబోతున్నారని అనుకుందాం, అప్పుడు మీరు ABCD పేరుతో మాత్రమే చెక్కును జారీ చేయాలి. ఏ బ్యాంకు కూడా వ్యక్తిగత పేరుతో లేదా ఏ కంపెనీ పేరిట చెక్కును స్వీకరించదు. బ్యాంకులు చెక్కు తీసుకున్నప్పుడల్లా, బ్యాంకు పేరు మీద మాత్రమే తీసుకుంటాయి.

వినియోగదారులు జాగ్రత్తగా ఉంటే, డబ్బు పోదు..

ఈ సందర్భంలో, వినియోగదారులు కోటక్ మహీంద్రా బ్యాంక్ పేరుతో చెక్కును ఇచ్చి ఉంటే, అవకతవకల కేసు ఉండేది కాదు. చెక్ ఇచ్చేటప్పుడు, దానిపై తేదీ తప్పనిసరిగా రాయాలని గుర్తుంచుకోండి. ఏదైనా చెక్కు మూడు నెలల పాటు మాత్రమే ఉండేలా ఇది ప్రయోజనం కలిగి ఉంటుంది. మీరు తేదీని నమోదు చేసినట్లయితే, 3 నెలల తర్వాత ఆ చెక్ వల్ల ఉపయోగం ఉండదు.

వీలునామా చక్కని పరిష్కారం.. 

బ్యాంక్ ఎకౌంట్ల విషయంలో లేదా ఆస్తి విషయాలలో ఒకటి కంటే ఎక్కువ చట్టపరమైన వారసులు ఉన్నప్పుడు, ఇబ్బందులు తెలెత్తుతాయి.  ఎందుకంటే మీరు డబ్బు లేదా ఆస్తి పొందడానికి కోర్టుకు వెళ్లాలి. న్యాయవాది ఫీజు కూడా చెల్లించాలి. అలాంటి సందర్భాలలో ఖాతాదారుల వీలునామా పరిష్కార మార్గం. మరణించిన ఖాతాదారు వీలునామా రాసి ఉంటే సమస్య ఉండదు. వీలునామాలో వారసులకు ఏ రకంగా వాటా ఇవ్వాలని రాస్తే ఆరకంగా అది వారికి అందుతుంది.  అది ఆస్తి అయినా బ్యాంక్ ఎకౌంట్ అయినా వీలునామా ఉంటె.. దానిని చనిపోయిన వ్యక్తి కోరికగా భావిస్తారు. అందువల్ల వారు ఎలా రాస్తే అలా పరిష్కారం అవుతుంది.

వీలునామా రాయకపోతే ఏమవుతుందంటే..

చాలా తక్కువ మంది వీలునామా చేసినప్పటికీ. ధనవంతుడైన వ్యాపారవేత్త ముఖేష్ అంబానీ కూడా దీనికి ఉదాహరణ. రిలయన్స్ ఇండస్ట్రీస్ యజమాని ధీరూభాయ్ అంబానీ మరణించినప్పుడు, ఆ సమయంలో అలాంటి వీలునామా చేయలేదు. ఆస్తులు, కంపెనీల విభజనపై ఇద్దరు సోదరుల మధ్య గొడవ జరగడానికి ఇదే కారణం. ముఖేష్ అంబానీ తన కొడుకులు,  కుమార్తె లకు అలాంటి పరిస్థితి రాకూడదనుకుంటున్నారు. అందుకే వారు ఇప్పుడు కుటుంబ మండలిని ఏర్పాటు చేస్తున్నారు. ఇందులో ముగ్గురు కుమారులు అలాగే కొంతమంది బయటి సభ్యులు ఉండవచ్చు.

ఇక ఎవరైనా మరణించినపుడు.. అతని వారసులు విషయాన్ని బ్యాంక్ కు తెలియపర్చాల్సి ఉంటుంది  తరువాత ఈ ఖాతా నుండి డబ్బు బదిలీ చేయడానికి అన్ని ఫార్మాలిటీలను పూర్తి చేయండి. ఈ సమాచారాన్ని బ్యాంకు ఉన్నతాధికారులకు తెలియజేయడానికి ప్రయత్నించండి.

Also Read: Food Delivery: ఇకపై స్విగ్గీ ఫుడ్ డెలివరీకి ఎలక్ట్రిక్ వాహనాలు..రిలయన్స్ బీపీ మొబిలిటీతో ఒప్పందం!

EV Expo2021: ప్రారంభమైన ఎలక్ట్రానిక్ వెహికల్స్ ఎక్స్‌పో..మనదేశ ఉత్పత్తులే ఎక్కువ!