AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Bigg Boss Telugu 5: భారీ రెమ్యునరేషన్‌‌‌‌తో ‘బిగ్ బాస్’5లోకి ఎంటర్ అవ్వనున్న జబర్దస్త్ స్టార్ కమెడియన్..?

ప్రస్తుతం ఫిలిం సర్కిల్స్ లో హాట్ టాపిక్ ఏదైనా ఉంది అంటే అది బిగ్ బాస్ రియాలిటీ షో గురించే. ఇప్పటికే విజయవంతంగా నాలుగు సీజన్స్..

Bigg Boss Telugu 5: భారీ రెమ్యునరేషన్‌‌‌‌తో 'బిగ్ బాస్'5లోకి ఎంటర్ అవ్వనున్న జబర్దస్త్ స్టార్ కమెడియన్..?
Rajeev Rayala
|

Updated on: Aug 06, 2021 | 5:38 PM

Share

Bigg Boss Telugu 5: ప్రస్తుతం ఫిలిం సర్కిల్స్‌‌‌లో హాట్ టాపిక్ ఏదైనా ఉంది అంటే అది బిగ్ బాస్ రియాలిటీ షో గురించే. ఇప్పటికే విజయవంతంగా నాలుగు సీజన్స్ పూర్తి చేసుకున్న బిగ్ బాస్ ఇప్పుడు సీజన్ 5కోసం సిద్ధంగా ఉంది. త్వరలోనే ఈ గేమ్ షో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ సీజన్‌‌కు కూడా కింగ్ నాగార్జునే హోస్ట్‌‌గా వ్యవహరించనున్నారని తెలుస్తోంది. బుల్లితెరపై భారీ రేటింగ్ దక్కించుకొని రికార్డ్ క్రియేట్ చేసింది ఈ గేమ్ షో. సీజన్ 1 నుంచి ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటూ వస్తుంది. దాంతో ఇప్పుడు సీజన్ 5కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు ప్రేక్షకులు. ఆటలు, పాటలు, గొడవలు, ఏడుపులు, మద్యమద్యలో గ్లామర్‌‌‌షోలతో బిగ్ బాస్ హౌస్ అంతా హంగామాగా ఉంటుంది. అయితే ఇప్పుడు సీజన్ 5లో కంటెస్టెంట్స్ పై ఇప్పుడు ఆసక్తికర చర్చ జరుగుతోంది. ఫస్ట్ ఎపిసోడ్ మొదలయ్యే వరకూ కూడా కంటెస్టెంట్స్ పేర్లు బయటకు రాకుండా ‘స్టార్ మా’ వారు జాగ్రత్తపడతారు. అయితే బిగ్ బాస్5లో పాల్గొనబోయేది వీరే అంటూ కొంతమంది పేర్లు వినిపిస్తున్నాయి.

ఇప్పటికే సోషల్ మీడియాలో కొన్ని పేర్లు చక్కర్లు కొడుతున్నాయి. వాటిలో నవ్యస్వామి-లోబో-ఆర్జే కాజల్-యాంకర్ వర్షిణి-నటి ప్రియా రామన్-నటి ప్రియ-సన్నీ ( కళ్యాణ వైభోగం సీరియల్ ఫేమ్)-జశ్వంత్ పడాల (మోడల్ కమ్ యాక్టర్)-షణ్ముఖ్ జశ్వంత్-ఆట జ్యోతి (ఆట సందీప్ భార్య)-యూట్యూబర్ నిఖిల్-సిరి హన్మంత్-యానీ మాస్టర్‌ పేర్లు బలంగా వినిపిస్తున్నాయి. వీటితోపాటు జబర్దస్ స్టార్ కమెడియన్ సుడిగాలి సుధీర్ పేరు కూడా ఇప్పుడు వినిపిస్తుంది. సుధీర్‌‌‌ను ఇప్పటికే బిగ్ బాస్ నిర్వాహకులు సంప్రదించారని, ఇందుకు అతడికి భారీ రెమ్యునరేషన్ కూడా ఆఫర్ చేశారని టాక్, సుధీర్ కూడా బిగ్ బాస్ హౌస్‌‌‌లోకి ఎంట్రీ ఇవ్వడానికి ఓకే చెప్పాడని అంటున్నారు. మరి ఈవార్తల్లో నిజమెంత అన్నది మరి కొద్దిరోజుల్లో తెలిసిపోతుంది.  మరోవైపు బిగ్ బాస్ సీజన్ 5 కోసం ఏర్పాట్లు ముమ్మరంగా జరుగుతున్నాయి. ఈ క్రమంలోనే ప్రోమో షూటింగ్స్ జరుగుతున్నాయని సమాచారం.

Sudigali Sudheer

Sudigali Sudheer

మరిన్ని ఇక్కడ చదవండి : 

Sonakshi Sinha: కుంచె పట్టిన సోయగం.. తనలోని అద్భుతమైన కళను బయటపెట్టిన అందాల భామ..

Navarasa: ప్రేక్షకులముందుకు ‘నవరస’.. ఒక్కో కథ ఒక్కో భావోద్వేగం.. ఆకట్టుకుంటున్న వెబ్ సిరీస్

Bigg Boss Tamil 5 : మరోసారి బిగ్ బాస్ హోస్ట్‌గా కమల్ హాసన్.. అక్టోబర్ నుంచి ప్రారంభం