AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Sonakshi Sinha: కుంచె పట్టిన సోయగం.. తనలోని అద్భుతమైన కళను బయటపెట్టిన అందాల భామ..

సినిమా తారలకు నటనతోపాటు మరెన్నో అద్భుతమైన టాలెంట్లు కూడా ఉంటాయి. వాటిని టైంను బట్టి బయటకు తీస్తుంటారు.

Sonakshi Sinha: కుంచె పట్టిన సోయగం.. తనలోని అద్భుతమైన కళను బయటపెట్టిన అందాల భామ..
Rajeev Rayala
|

Updated on: Aug 06, 2021 | 5:01 PM

Share

Sonakshi Sinha: సినిమా తారలకు నటనతోపాటు మరెన్నో అద్భుతమైన టాలెంట్లు కూడా ఉంటాయి. వాటిని టైంను బట్టి బయటకు తీస్తుంటారు. కొంతమంది అద్భుతంగా పాటలు పాడుతారు, మరి కొంతమంది హార్స్ రైడింగ్, బైక్ రేసింగ్, మ్యూజిక్ డైరెక్షన్, మూవీ డైరెక్షన్ ఇలా చాలా టాలెంట్లు తమలో ఉన్నాయని సందర్భాన్ని బట్టి బయటకు తీసుకువస్తుంటారు. తాజాగా ఈ బాలీవుడ్ బ్యూటీ కూడా తనలోని దాగి ఉన్న అద్భుతమైన కళను అభిమానులతో పంచుకుంది. ఆ చిన్నది ఎవరోకాదు.. అందాల భామ సోనాక్షి సిన్హా. ఇంతకు ఈ ముద్దుగుమ్మలో ఉన్న మరో టాలెంట్ ఏంటంటే.. పెయింటింగ్. ఇప్పటికే చాలాసార్లు తన పెయింటింగ్స్‌‌‌‌‌ను సోషల్ మీడియా ద్వారా అభిమానులతో పంచుకుంది ఈ బ్యూటీ.

బాలీవుడ్‌‌‌‌లో స్టార్ హీరోయిన్‌‌‌‌గా కంటిన్యూ అవుతున్న సోనాక్షి సిన్హా వరుస ప్రాజెక్ట్స్‌‌‌‌తో బిజీ బిజీగా ఉంది. సినిమా షూటింగ్‌‌‌లకు గ్యాప్ దొరికితే కుంచె పట్టుకొని ఇలా అందమైన రూపాలను ఆవిష్కరిస్తుంది. ఇక లాక్ డౌన్ సమయంలో తన పూర్తి టైంను పెయింటింగ్‌‌‌కే కేటాయించిందట ఈ బ్యూటీ. ‘సినిమాలతోపాటు పెయింటింగ్ కూడా నాలో భాగమే’ అంటుంది ఈ చిన్నది. వినాయకుడి ఫోటోను పెయింట్ చేసిన సోనాక్షి.. వక్రతుండ మహాకాయ అంటూ శ్లోకాన్ని కూడా చదివింది. ఇందుకు సంబదించిన వీడియోను తన సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది సోనాక్షి. ఈ వీడియో చూసిన నెటిజన్లు ఈ అమ్మడి పై ప్రశంసలు కురిపిస్తున్నారు. అలాగే ‘అనాయే’ అనే గణేశుడి అక్రిలిక్ పెయింటింగ్‌‌‌ను సోనాక్షి అమ్మకానికి పెట్టింది. హౌస్ ఆఫ్ క్రియేటివిటీ అనే వెబ్ సైట్ ద్వారా ఈ గణేశుడిని విక్రయించింది. సోనాక్షి అభిమాని ఈ ఆర్ట్‌‌‌ను కొనుగోలు చేసుకున్నాడు.

సోనాక్షి మాట్లాడుతూ..’ నాలో ఉన్న  పెయింటింగ్ టాలెంట్ గురించి నేను పెద్దగా ఎప్పుడూ ఆలోచించలేదు. నచ్చిన పెయింటింగ్ వేస్తూ ఆనందించేదాన్ని అంతే ..  కానీ హౌస్ ఆఫ్ క్రియేటివిటీ నా కళను ప్రపంచంతో పంచుకోవడానికి నాకు సరైన ప్రోత్సాహం, ప్రేరణనిచ్చింది’ అంటూ చెప్పుకొచ్చింది సోనాక్షి. ప్రస్తుతం సోనాక్షి అజయ్ దేవగన్ సరసన “భుజ్: ది ప్రైడ్ ఆఫ్ ఇండియా” అనే సినిమాలో నటిస్తుంది. అలాగే “ఫాలెన్” అనే వెబ్ సిరీస్ లో కూడా యాక్ట్ చేస్తుంది. ఈ వెబ్ సిరీస్ లో సోనాక్షి పోలీస్ ఆఫీసర్గా కనిపించనుంది.

View this post on Instagram

A post shared by Sonakshi Sinha (@aslisona)

View this post on Instagram

A post shared by Sonakshi Sinha (@aslisona)

మరిన్ని ఇక్కడ చదవండి : SR Kalyana Mandapam Review: కల్యాణ మండపం కాసులు కురిపిస్తుందా?

Maha Samudram: మహా సముద్రం నుంచి ‘హే రంభ’ సాంగ్ రిలీజ్.. మాస్ స్టెప్పులతో అదరగొట్టిన శర్వానంద్..

Mahesh Babu: అభిమానులకు మహేష్ విజ్ఞప్తి.. పుట్టిన రోజు బృహత్తర కార్యక్రమం చేపట్టాలని..

వయస్సు పెరిగినా యంగ్‌గా కనిపించాలా?.. హీరోయిన్ ఫిట్‌నెస్ సీక్రెట్
వయస్సు పెరిగినా యంగ్‌గా కనిపించాలా?.. హీరోయిన్ ఫిట్‌నెస్ సీక్రెట్
ఢిల్లీ టీమ్‎కి బై బై..కింగ్ కోహ్లీ సడన్ ఎగ్జిట్ వెనుక నిజం ఇదే
ఢిల్లీ టీమ్‎కి బై బై..కింగ్ కోహ్లీ సడన్ ఎగ్జిట్ వెనుక నిజం ఇదే
Rewind 2025: టాలీవుడ్‌పై బాలీవుడ్ స్టార్ల దండయాత్ర..!
Rewind 2025: టాలీవుడ్‌పై బాలీవుడ్ స్టార్ల దండయాత్ర..!
కేబినెట్‌విస్తరణపై సీఎం రేవంత్ కసరత్తు.. రేసులో ఉన్నది ఎవరు?
కేబినెట్‌విస్తరణపై సీఎం రేవంత్ కసరత్తు.. రేసులో ఉన్నది ఎవరు?
సూర్యపై వేటు, గిల్‌కు నోఛాన్స్.. భారత టీ20 కెప్టెన్‌గా ఎవరంటే?
సూర్యపై వేటు, గిల్‌కు నోఛాన్స్.. భారత టీ20 కెప్టెన్‌గా ఎవరంటే?
గోల్డ్‌ లవర్స్‌కి బ్యాడ్‌ న్యూస్‌! ఆల్‌టైమ్ హైకి చేరుకున్న బంగారం
గోల్డ్‌ లవర్స్‌కి బ్యాడ్‌ న్యూస్‌! ఆల్‌టైమ్ హైకి చేరుకున్న బంగారం
రజినీకాంత్‏తో బ్లాక్ బస్టర్.. సైడ్ క్యారెక్టర్స్ మాత్రమే వచ్చాయి.
రజినీకాంత్‏తో బ్లాక్ బస్టర్.. సైడ్ క్యారెక్టర్స్ మాత్రమే వచ్చాయి.
Re-Entry 2025 కమ్ బ్యాక్ తో ఇండస్ట్రీని షేక్ చేస్తున్న స్టార్స్​!
Re-Entry 2025 కమ్ బ్యాక్ తో ఇండస్ట్రీని షేక్ చేస్తున్న స్టార్స్​!
రియల్​ లైఫ్​ కపుల్​ రీల్​ లైఫ్​లోనూ.. అంచనాలు పెంచేస్తున్నారుగా!
రియల్​ లైఫ్​ కపుల్​ రీల్​ లైఫ్​లోనూ.. అంచనాలు పెంచేస్తున్నారుగా!
ఐకాన్ స్టార్ ఇంట క్రిస్మస్ వెలుగులు.. షేర్ చేసిన స్నేహా రెడ్డి
ఐకాన్ స్టార్ ఇంట క్రిస్మస్ వెలుగులు.. షేర్ చేసిన స్నేహా రెడ్డి