AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Dhanush: నో గ్యాప్ అంటున్న స్టార్ హీరో.. బ్యాక్ టూ బ్యాక్ సినిమాలతో రానున్న ధనుష్.. శేఖర్ కమ్ముల మూవీస్టోరీ ఇదేనా..

టాలీవుడ్ సెన్సిబుల్ డైరెక్టర్ శేఖర్ కమ్ముల సినిమాలు చాలా సహజంగా..నిజజీవితానికి చాలా దగ్గరగా ఉంటాయి. సోల్ ఉన్న కథలను ఎంచుకుంటూ..

Dhanush: నో గ్యాప్ అంటున్న స్టార్ హీరో.. బ్యాక్ టూ బ్యాక్ సినిమాలతో రానున్న ధనుష్.. శేఖర్ కమ్ముల మూవీస్టోరీ ఇదేనా..
Danush
Rajeev Rayala
|

Updated on: Aug 06, 2021 | 3:22 PM

Share

Dhanush: టాలీవుడ్ సెన్సిబుల్ డైరెక్టర్ శేఖర్ కమ్ముల సినిమాలు చాలా సహజంగా..నిజజీవితానికి చాలా దగ్గరగా ఉంటాయి. సోల్ ఉన్న కథలను ఎంచుకుంటూ ఆ ఫీల్‌‌‌ను సినిమా అంతా క్యారీ అయ్యేలా చేయడం శేఖర్ కమ్ముల స్టైల్. ఈ ఫార్ములాతోనే ఆయన ఎన్నో అందమైన సినిమాలను తెరకెక్కించారు. శేఖర్ కమ్ముల సినిమాలు టాక్‌‌‌తో సంబంధం లేకుండా ప్రేక్షకులను ఆకట్టుకుంటాయి. ఈ క్రమంలోనే ఆయన లవ్ స్టోరీ అనే అందమైన ప్రేమ కథను తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాలో నాగచైతన్య- సాయిపల్లవి హీరో హీరోయిన్లుగా నటిస్తున్నారు. లవ్ స్టోరీ సినిమా షూటింగ్ కంప్లీట్ చేసుకొని విడుదలకు సిద్ధంగా ఉంది. ఈ నేపథ్యంలోనే తమిళ్ స్టార్ హీరో ధనుష్‌‌‌తో కలిసి ఆయన ఓ సినిమా చేయబోతున్నారు. ఇటీవలే ఈ సినిమాను అఫీషియల్‌‌‌గా అనౌన్స్ చేశారు. ఈ క్రేజీ కాంబినేషన్ మూవీని తెలుగు- తమిళ్ రెండు భాషల్లో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. ఈ సినిమాకోసం ప్రీప్రొడక్షన్ పనులు వేగంగా జరుపుతున్నారు చిత్రయూనిట్. తాజాగా ఈ సినిమా స్టోరీకి సంబంధించిన ఓ వార్త ఫిలిం సర్కిల్స్‌‌‌ను చక్కర్లు కొడుతోంది.

అయితే  ఈ సినిమా మద్రాసు రాజధానిగా ఉన్నసమయంలో తెలుగు-తమిళ్ రాష్ట్రాలకు సంబంధించిన అంశాలతో ఉంటుందని వార్తలు వినిపించాయి. అప్పటి పరిస్థితులను, తమిళ- తెలుగు ప్రజల స్నేహం సహా భావోద్వేగాలను తెరపై  చూపించబోతున్నారని వార్తలు వినిపించాయి. అయితే ఇపుడు పొలిటికల్ బ్యాక్ డ్రాప్‌‌‌లో ఈ సినిమా ఉండనుందని మరో వార్త వినిపిస్తుంది. కంప్లీట్ పొలిటికల్ డ్రామాగా ఈ సినిమా ఉండబోతుందని అంటున్నారు. గతంలో శేఖర్ కమ్ముల తెరకెక్కించిన లీడర్ సినిమా తరహాలో ఈ మూవీ ఉండే అవకాశాలు ఉన్నాయని టాక్. ఈ వార్తల్లో నిజమెంతా అన్నది తెలియదు కానీ.. ప్రచారం మాత్రం గట్టిగా జరుగుతోంది. ఈ సినిమాతోపాటు వెంకీ అట్లూరి దర్శకత్వంలో ఓ సినిమా చేయబోతున్నాడని టాక్ వినిపిస్తోంది. ఈ సినిమా ఎడ్యుకేషన్ మాఫియా చుట్టూ తిరిగే సోషియో పొలిటికల్ డ్రామా అని తెలుస్తోంది. అలాగే ధనుష్ ఓ హాలీవుడ్ మూవీ కూడా చేస్తున్నాడు. వీటితోపాటు మిత్రన్ జవహర్ దర్శకుడిగా సన్ పిక్చర్స్ బ్యానర్‌‌‌లోనూ ధనుష్ ఓ సినిమా చేస్తున్నారు. అలాగే సెల్వరాఘవన్‌‌‌తో కలిసి `నాన్ వరువెన్` కోసం పని చేస్తున్నారు. అలాగే కార్తీక్ నరేన్ దర్శకత్వంలో `డి 43` షూటింగ్ జరుగుతోంది.ఇలా బ్యాక్ టూ బ్యాక్ సినిమాలతో దూసుకువస్తున్నాడు ధనుష్.

మరిన్ని ఇక్కడ చదవండి : 

SR Kalyana Mandapam Review: కల్యాణ మండపం కాసులు కురిపిస్తుందా?

Pori Moni: టాప్ హీరోయిన్ ఇంట్లో సోదాలు.. భారీగా డ్రగ్స్, మద్యం స్వాధీనం..

Maha Samudram: మహా సముద్రం నుంచి ‘హే రంభ’ సాంగ్ రిలీజ్.. మాస్ స్టెప్పులతో అదరగొట్టిన శర్వానంద్..

Follow Us
IND vs WI: ఇండోర్‌లో టీమిండియాదే విక్టరీ.. సిరీస్‌లో ఆధిక్యం..
IND vs WI: ఇండోర్‌లో టీమిండియాదే విక్టరీ.. సిరీస్‌లో ఆధిక్యం..
రాజు మరణిస్తే సేవకులనూ చంపారు.. పురాతన ఈజిప్టులో మారణకాండ?
రాజు మరణిస్తే సేవకులనూ చంపారు.. పురాతన ఈజిప్టులో మారణకాండ?
టీ20 క్రికెట్ హిస్టరీలోనే తొలి టీంగా వెస్టిండీస్ భారీ రికార్డ్..
టీ20 క్రికెట్ హిస్టరీలోనే తొలి టీంగా వెస్టిండీస్ భారీ రికార్డ్..
కరివేపాకుకు నిజంగా అంత శక్తి ఉందా..
కరివేపాకుకు నిజంగా అంత శక్తి ఉందా..
చిన్న సాయం.. పెద్ద మార్పు! స్కూళ్ల నిర్మాణానికి జాకీ చాన్‌ విరాళం
చిన్న సాయం.. పెద్ద మార్పు! స్కూళ్ల నిర్మాణానికి జాకీ చాన్‌ విరాళం
2027 వన్డే ప్రపంచకప్ గెలవాలంటే ఇదే కీలకం.. సెహ్వాగ్ సూచన
2027 వన్డే ప్రపంచకప్ గెలవాలంటే ఇదే కీలకం.. సెహ్వాగ్ సూచన
ఇంట్లో స్నేక్ ప్లాంట్ పెంచుతున్నారా? ఆరోగ్యం, వాస్తు పరంగా కలిగే
ఇంట్లో స్నేక్ ప్లాంట్ పెంచుతున్నారా? ఆరోగ్యం, వాస్తు పరంగా కలిగే
ఈ ఒక్క ముక్కతో కంటిచూపు, పొట్ట సమస్యలు మాయం..
ఈ ఒక్క ముక్కతో కంటిచూపు, పొట్ట సమస్యలు మాయం..
టీమిండియాలో రీఎంట్రీకి షమీ రెడీ.. విమర్శలకు ఇచ్చిపడేశాడుగా..!
టీమిండియాలో రీఎంట్రీకి షమీ రెడీ.. విమర్శలకు ఇచ్చిపడేశాడుగా..!
భారత్‌లో కొత్త గ్యాస్‌ కనెక్షన్లను ఎందుకు నిలిపివేశారు? కారణమిదే!
భారత్‌లో కొత్త గ్యాస్‌ కనెక్షన్లను ఎందుకు నిలిపివేశారు? కారణమిదే!