AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Mahesh Babu: అభిమానులకు మహేష్ విజ్ఞప్తి.. పుట్టిన రోజు బృహత్తర కార్యక్రమం చేపట్టాలని..

సూపర్ స్టార్ మహేష్ బాబుకు ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. సూపర్ స్టార్ వారసుడిగా చిన్నతనంలోనే

Mahesh Babu: అభిమానులకు మహేష్ విజ్ఞప్తి.. పుట్టిన రోజు బృహత్తర కార్యక్రమం చేపట్టాలని..
Mahesh Babu
Rajitha Chanti
|

Updated on: Aug 06, 2021 | 1:09 PM

Share

సూపర్ స్టార్ మహేష్ బాబుకు ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. సూపర్ స్టార్ వారసుడిగా చిన్నతనంలోనే వెండితెరపైకి ఎంట్రీ ఇచ్చిన ఆయన.. తన నటనతో తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. ముఖ్యంగా ఇప్పటికీ యూత్ ఎక్కువగా ఇష్టపడే స్టార్ హీరో మహేష్. అందుకే ఆయనను అభిమానులు ముద్దుగా ప్రిన్స్ అని పిలుస్తుంటారు. ఆగస్ట్ 9న మహేష్ పుట్టిన రోజు. దీంతో ఇప్పటికే సూపర్ స్టార్ అభిమానులు హాడావిడి మొదలేట్టేశారు. ఈ క్రమంలోనే తన పుట్టిన రోజున ఫ్యాన్స్ అందరూ ఓ బృహత్తర కార్యం చేపట్టాలని మహేష్ అభిమానులకు విజ్ఞప్తి చేశారు.

ఈ సందర్భంగా తన పుట్టిన రోజు కానుకగా.. ప్రతి ఒక్కరు మూడు మొక్కలు నాటాలని మహేష్ అభిమానులకు ఇన్‏స్టా ద్వారా విజ్ఞప్తి చేశారు. నామీద ఉన్న ప్రేమతో మీరు చేసే పనులన్ని నన్ను ఇంకా ప్రేరేపిస్తున్నాయి. ఈ సంవత్సరం నేను ప్రత్యేకంగా కొరుకుంటున్నాను. #GreenIndiaChallengeకి మద్ధతుగా నా పుట్టిన రోజు నాడు ప్రతి ఒక్కరు మూడు మొక్కలు నాటాలని అందరిని కోరుతున్నాను. మొక్కలు నాటే ఫోటోలను షేర్ చేస్తూ నన్ను ట్యాగ్ చేయండి.. అప్పుడే నేను చూడగలను అంటూ ట్వీట్ చేశారు.

ప్రస్తుతం మహేష్ పరశురామ్ దర్శకత్వంలో సర్కారు వారి పాట సినిమా చేస్తున్నాడు. ఇందులో కిర్తీ సురేష్ హీరోయిన్‏గా నటిస్తుండగా.. మైత్రీ మూవీ మేకర్స్, జీఎంబీ ఎంటర్ టైన్మెంట్స్, 14 రీల్స్ ప్లస్ నిర్మాణ సంస్థలు సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన పోస్టర్స్ సోషల్ మీడియాలో రికార్డ్స్ సృష్టిస్తున్నాయి. అంతేకాదు మహేష్ పుట్టిన రోజు సందర్భంగా ఆగస్ట్ 9న ఈ మూవీ నుంచి మరో బ్లస్టర్ అప్‏డేట్ ఇవ్వనున్నట్లుగా చిత్రయూనిట్ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇదిలా ఉంటే… థమన్ మ్యూజిక్ అందిస్తున్న ఈ సినిమా జనవరి 13న 2022 ప్రేక్షకుల ముందుకు రానుంది.

ట్వీట్..

Also Read: Natyam: నాట్యం నుంచి మరో సాంగ్ రిలీజ్ చేసిన బాలకృష్ణ.. ఆకట్టుకుంటున్న నమఃశివాయ వీడియో..

Khushbu: మీరు నమ్మలేనంతగా సన్నబడ్డ ఖుష్బూ.. సోషల్ మీడియాలో వైరల్‌గా మారిన ఫొటో…

ఈ చిన్నారి ఇప్పుడు కుర్రకారును మ్యూజిక్‏తో కట్టిపడేస్తాడు.. సాంగ్ చేసాడంటే హిట్టు పడాల్సిందే.. ఎవరో గుర్తుపట్టండి..

గోవాకు పిలిచి మరీ నాగ్ వార్నింగ్ ఇచ్చారు
గోవాకు పిలిచి మరీ నాగ్ వార్నింగ్ ఇచ్చారు
ఫోన్లలో వైరస్‌.. OTP అవసరం లేకుండానే మీ ఫోన్లో డబ్బులు మాయం!
ఫోన్లలో వైరస్‌.. OTP అవసరం లేకుండానే మీ ఫోన్లో డబ్బులు మాయం!
ఈ రాష్ట్ర ప్రజలు మద్యం తాగడంలో నంబర్‌ 1.. తెలంగాణ ఏ స్థానంలో..
ఈ రాష్ట్ర ప్రజలు మద్యం తాగడంలో నంబర్‌ 1.. తెలంగాణ ఏ స్థానంలో..
సనత్ జయసూర్య వరల్డ్ రికార్డును బద్దలు కొట్టిన సఫారీ ఓపెనర్
సనత్ జయసూర్య వరల్డ్ రికార్డును బద్దలు కొట్టిన సఫారీ ఓపెనర్
మోదీ పాలనలో అంబేద్కర్ ఆలోచనల ప్రతిధ్వని
మోదీ పాలనలో అంబేద్కర్ ఆలోచనల ప్రతిధ్వని
సైకిల్‌ కంటే నెమ్మదిగా ప్రయాణించే రైలు..! అయినా ఫుల్లు డిమాండ్..
సైకిల్‌ కంటే నెమ్మదిగా ప్రయాణించే రైలు..! అయినా ఫుల్లు డిమాండ్..
పంటి ఎనామిల్‌ను నాశనం చేస్తున్న అలవాటు.. మానకుంటే కష్టమే!
పంటి ఎనామిల్‌ను నాశనం చేస్తున్న అలవాటు.. మానకుంటే కష్టమే!
వైభవ్‎ సూర్యవంశీకి పట్టపగలు చుక్కలు చూపెట్టిన హైదరాబాద్ ప్లేయర్
వైభవ్‎ సూర్యవంశీకి పట్టపగలు చుక్కలు చూపెట్టిన హైదరాబాద్ ప్లేయర్
ఒంట్లో వేడి పుట్టించే సూపర్ డ్రింక్స్.. చలికాలంలో రోజూ తాగితే
ఒంట్లో వేడి పుట్టించే సూపర్ డ్రింక్స్.. చలికాలంలో రోజూ తాగితే
కేవలం వడ్డీతోనే రూ.2లక్షల ఆదాయం.. పోస్టాఫీస్‌లో అదిరే స్కీమ్..
కేవలం వడ్డీతోనే రూ.2లక్షల ఆదాయం.. పోస్టాఫీస్‌లో అదిరే స్కీమ్..