Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Natyam: నాట్యం నుంచి మరో సాంగ్ రిలీజ్ చేసిన బాలకృష్ణ.. ఆకట్టుకుంటున్న నమఃశివాయ వీడియో..

ప్రముఖ నాట్యకారిణి సంధ్యారాజు నాట్యం సినిమాతో వెండితెరపైకి ఎంట్రీ ఇస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా పూర్తిగా క్లాసికల్ డ్యాన్స్‌

Natyam: నాట్యం నుంచి మరో సాంగ్ రిలీజ్ చేసిన బాలకృష్ణ.. ఆకట్టుకుంటున్న నమఃశివాయ వీడియో..
Natyam Song
Follow us
Rajitha Chanti

|

Updated on: Aug 06, 2021 | 12:16 PM

ప్రముఖ నాట్యకారిణి సంధ్యారాజు నాట్యం సినిమాతో వెండితెరపైకి ఎంట్రీ ఇస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా పూర్తిగా క్లాసికల్ డ్యాన్స్‌ నేపథ్యంతో రూపొందుతుంది. సాఫ్ట్‌వేర్ దిగ్గజం సత్యం కంప్యూటర్స్‌ ఫౌండర్, ప్రముఖ పారిశ్రామికవేత్త రామలింగరాజు కోడలు సంధ్యారాజు. ఆమె నటించిన నాట్యం మూవీకి సంబంధించి ఇవాళ.. శివపార్వతి వీడియో సాంగ్ హీరో నందమూరి బాలక్రిష్ణ విడుదల చేశారు. ఈ పాటను పూర్తిగా లేపాక్షి ఆలయంలో చిత్రీకరించారు. బ్లాక్ మేజిక్ పాకెట్ కెమెరా సాయంతో షూట్ చేశారు డైరెక్టర్ కమ్ సినిమాటోగ్రాఫర్ రేవంత్ కోరుకొండ. ఈ పాటకు తానే స్యయంగా కొరియోగ్రఫీ చేశారు సంధ్యారాజు. ఏడాది పాటు శ్రమించి కమల్‌ కామరాజ్‌కి కూచిపూడి డ్యాన్స్‌లో పర్‌ఫెక్షన్ తీసుకొచ్చారు సంధ్యరాజు.

12వ శతాబ్దం నాటి అత్యంత శక్తివంతమైన అర్ధ నారీశ్వర స్తోత్రం లేపాక్షి ఆలయ ప్రాంగణంలో భక్తుల సమక్షంలో ఈ పాటను చిత్రీకరించారు సంధ్యారాజు. రొటీన్‌గా వాడే సినిమా లైట్స్‌ ఏవీ ఇక్కడ ఉపయోగించలేదు. కాలభైరవ, లలిత్ కావ్య పాడిన ఈ పాట.. నాట్యం సినిమాకు స్పెషల్ ఎసెట్ కానుంది.

మార్చి నెలలో 40 డిగ్రీల ఎండ వేడిమి మధ్య…  ఆరురోజుల పాటు జరిగిన ఈ పాటను షూట్ చేశారు. సంధ్యారాజు, కమల్‌ కామరాజ్ ఇద్దరికీ అరికాళ్ల నుంచి రక్తం వచ్చినా షూటింగ్ కొనసాగించినట్టు చెప్పారు మేకర్స్. దాదాపు 100 మంది జూనియర్ ఆర్టిస్టులు కూడా ఈ పాట షూట్‌లో పార్టిసిపేట్ చేశారు. సంధ్యారాజుతో పాటు ఈ సినిమాలో కమల్‌కామరాజ్, రోహిత్ బెపాల్, ఆదిత్య మీనన్, శుభలేఖ సుధాకర్, భానుప్రియ కీలక పాత్రల్లో నటించారు. శ్రావణ్ భరద్వాజ్ మ్యూజిక్ అందించగా.. నాట్యం సినిమాకు దర్శకత్వంతో పాటు కథ, ఎడిటింగ్, కెమెరా బాధ్యతల్ని రేవంత్ కోరుకొండ నిర్వహిస్తున్నారు. నిష్రింకళ ఫిలిమ్స్ బేనర్‌పై నిర్మిస్తున్న నాట్యం సినిమాకు వెంకట్రామరాజా, రామరాజులతో పాటు తాను కూడా నిర్మాతగా వ్యవహిస్తున్నారు సంధ్యారాజు.

సాంగ్..

Also Read: Khushbu: మీరు నమ్మలేనంతగా సన్నబడ్డ ఖుష్బూ.. సోషల్ మీడియాలో వైరల్‌గా మారిన ఫొటో…

ఈ చిన్నారి ఇప్పుడు కుర్రకారును మ్యూజిక్‏తో కట్టిపడేస్తాడు.. సాంగ్ చేసాడంటే హిట్టు పడాల్సిందే.. ఎవరో గుర్తుపట్టండి..