AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Sonu Sood : సోనుసూద్ ట్రావెల్ బిజినెస్..! ఇక వారికి ఎలాంటి సమస్య ఉండదు.. తెలుసుకోండి

Sonu Sood : తన దానగుణంతో ఆపదలో ఉన్న వారిని ఆదుకుంటూ కోట్లాది మంది అభిమానులను సంపాదించుకున్న వ్యక్తి నటుడు సోనూసూద్. కరోనా కాలంలో ఆపదలో ఉన్నాం

Sonu Sood : సోనుసూద్ ట్రావెల్ బిజినెస్..! ఇక వారికి ఎలాంటి సమస్య ఉండదు.. తెలుసుకోండి
Sonu Sood Travel Union
uppula Raju
|

Updated on: Aug 06, 2021 | 5:22 PM

Share

Sonu Sood : తన దానగుణంతో ఆపదలో ఉన్న వారిని ఆదుకుంటూ కోట్లాది మంది అభిమానులను సంపాదించుకున్న వ్యక్తి నటుడు సోనూసూద్. కరోనా కాలంలో ఆపదలో ఉన్నాం ఆదుకోండి అంటూ ఒక్క సందేశం పంపితే చాలు తన టీంని పంపి ప్రజల అవసరాలు తీర్చిన వ్యక్తి. జాతి మొత్తం గర్వించే రీతిలో సేవా కార్యక్రమాల్లో ముందుంటున్న సోనూసూద్ సామాన్యుడి మనసును గెలిచారు. అయితే తాజాగా ఆయన ట్రావెల్ బిజినెస్ ప్రారంభించారు. దీనిపేరు ట్రావెల్ యూనియన్ నెట్‌వర్క్. ఈ వ్యాపారం పర్యాటక రంగంలో పనిచేసే ట్రావెల్ ఏజెంట్‌లు, చిన్న వ్యాపారవేత్తలకు ఉపయోగపడుతుంది. ఈ నెట్‌వర్క్‌ సహాయంతో గ్రామీణ వినియోగదారులకు సహాయం చేయనున్నారు. దిలీప్ కుమార్ మోడీ కంపెనీ స్పైస్ మనీ భాగస్వామ్యంతో ఈ ప్లాట్‌ఫాం ప్రారంభించారు. అంతేకాదు సోనూ సూద్ ట్రావెల్ యూనియన్ డైరెక్టర్ కూడా.

ఎయిర్‌లైన్, రైలు, బస్సు, హోటల్ సహా అన్ని సేవలు అందుబాటులో.. ఈ కంపెనీ గురించి సోనూ సూద్ మాట్లాడుతూ.. లాక్డౌన్ సమయంలో గ్రామీణ భారత ప్రజల సమస్యలను చాలా దగ్గరగా చూశాను. గ్రామీణ ప్రయాణ రంగం ఇప్పటివరకు అసంఘటితంగానే ఉంది. ఈ అంశంపై ఇంకా దృష్టి పెట్టలేదని చెప్పారు. ట్రావెల్ యూనియన్ సహాయంతో తాము ట్రావెల్ ఏజెంట్ల పూర్తి సంఘాన్ని సృష్టిస్తామని పేర్కొన్నారు. చిన్న వ్యాపారవేత్తలు దీని నుంచి ప్రయోజనం పొందుతారన్నారు. ట్రావెల్ ఏజెంట్లు గ్రామీణ భారతదేశంలోని వినియోగదారుల అవసరాలను దృష్టిలో ఉంచుకుని పని చేస్తారని తెలిపారు. విమానయాన సంస్థలు, రైల్వేలు, హోటళ్లు, టోకు వ్యాపారులు, అగ్రిగేటర్లతో సహా అనేక రంగాల్లో ట్రావెల్ యూనియన్ సేవలు అందుబాటులో ఉంటాయని వివరించారు.

ఈ ప్లాట్‌ఫాం సరికొత్త ప్రచారాన్ని కూడా ప్రారంభించింది. ట్రావెల్ ఏజెంట్ల కోసం ఒక స్టాప్ అనే కాన్సెప్ట్‌తో ఈ ప్లాట్‌ఫాం నడుస్తుంది. IRCTC ద్వారా నిర్వహించే అన్ని రైళ్ల సౌకర్యం ఈ ప్లాట్‌ఫారమ్‌లో అందుబాటులో ఉంటుంది. ఇది కాకుండా, దేశవ్యాప్తంగా దేశీయ, అంతర్జాతీయ విమానాలు, 10,000 బస్సు ఆపరేటర్ల సౌకర్యం అందుబాటులో ఉంటుంది. హోటళ్ల గురించి మాట్లాడితే.. దాదాపు 10 లక్షల హోటళ్లు కూడా దీనితో మెర్జ్ చేశారు. ఈ యాప్ గూగుల్ ప్లే స్టోర్‌లో కూడా అందుబాటులో ఉంటుంది. ప్రస్తుతం ఇది ఇంగ్లీష్, హిందీ భాషలలో అందుబాటులో ఉంది. రాబోయే రోజుల్లో 11 ఇతర భాషలలో కూడా అందుబాటులో ఉంటుంది.

MS Dhoni : ధోనికి షాకిచ్చిన ట్విట్టర్..! ఆశ్చర్యపోతున్న అభిమానులు.. అసలేం జరిగిందంటే..

EV Expo2021: ప్రారంభమైన ఎలక్ట్రానిక్ వెహికల్స్ ఎక్స్‌పో..మనదేశ ఉత్పత్తులే ఎక్కువ! 

108 వాహన సిబ్బందే వైద్యులయ్యారు.. పండంటి బిడ్డకు జన్మనిచ్చిన మహిళ