AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

MS Dhoni : ధోనికి షాకిచ్చిన ట్విట్టర్..! ఆశ్చర్యపోతున్న అభిమానులు.. అసలేం జరిగిందంటే..

MS Dhoni : టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ గత రెండు రోజులుగా చర్చనీయాంశంగా మారారు. కారణం అతని ట్విట్టర్ ఖాతాకు సంబంధించిన

MS Dhoni : ధోనికి షాకిచ్చిన ట్విట్టర్..! ఆశ్చర్యపోతున్న అభిమానులు.. అసలేం జరిగిందంటే..
Ms Dhoni
uppula Raju
|

Updated on: Aug 06, 2021 | 4:51 PM

Share

MS Dhoni : టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ గత రెండు రోజులుగా చర్చనీయాంశంగా మారారు. కారణం అతని ట్విట్టర్ ఖాతాకు సంబంధించిన ఇష్యూ. ధోనీ ఖాతాకు ట్విట్టర్ బ్లూ టిక్‌ను తీసివేసింది. అయితే ట్విట్టర్ ఇలా ఎందుకు చేసిందో తెలియడం లేదు. కొంతమంది నిపుణులు అతను సోషల్ మీడియాలో యాక్టివ్‌గా లేనందున ఈ చర్య తీసుకుందని భావిస్తున్నారు. ఈ ఏడాది జనవరిలో ధోనీ తన ట్విట్టర్ ఖాతాలో చివరిగా ఏదో రాశాడు. అప్పటి నుంచి అతను ఒక్క ట్వీట్ కూడా చేయలేదు. అంతకు ముందు సెప్టెంబర్ 2020 లో చివరి ట్వీట్ చేసాడు. అంటే భారత మాజీ కెప్టెన్ చేసిన ఒక ట్వీట్‌కు మరొకటి మధ్య చాలా గ్యాప్ ఉంది. దీంతో ట్విట్టర్ అతని ఖాతా నుంచి బ్లూ టిక్‌ను తీసివేసిందని చెబుతున్నారు.

అయితే ధోనీ ట్విట్టర్ అకౌంట్ నుంచి బ్లూ టిక్ తొలగించడంతో ప్రజలు, అభిమానులు షాక్ అవుతున్నారు. ట్విట్టర్ ధోని లక్ష్యంగా చేసుకున్నట్లు కనిపిస్తుందని అభిమానులు ఆరోపిస్తున్నారు. వివరణ లేకుండా ఇలా చేయడం దారుణమని కామెంట్స్ చేస్తున్నారు. ప్రస్తుతం ధోనీ ట్విట్టర్ ఖాతా నుంచి బ్లూ టిక్‌ను తీసివేసిన ఇష్యూలో ఉంటే.. మరోవైపు అతను 7 సంవత్సరాల క్రితం చేసిన ట్వీట్ గురించి చర్చ జరగుతుంది. 2014 లో భారత పురుషుల హాకీ జట్టు కాంస్య పతకం గెలుచుకున్న తర్వాత ధోనీ చేసిన ట్వీట్ వైరల్ అయ్యింది. ఆ సంవత్సరం ఆసియా క్రీడల్లో స్వర్ణం గెలిచిన హాకీ జట్టును అతను అభినందించాడు.

కరోనా సెకండ్ వేవ్ కారణంగా.. ఐపీఎల్ సీజన్ 14 వాయిదా పడిన విషయం తెలిసిందే. అప్పటి నుంచి చెన్నై సూపర్ కింగ్స్ జట్టు కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ తనకు దొరికిన సమయాన్ని అద్భుతంగా సద్వినియోగం చేసుకుంటున్నాడు. కుటుంబ సభ్యులతో, స్నేహితులు, బంధువులతో సరదాగా గడిపేస్తున్నాడు. తన వ్యక్తిగత జీవితాన్ని ఆనందిస్తున్నాడు. ధోని సోషల్ మీడియాకు ఉన్నా.. అతని భార్య సాక్షి సింగ్ మాత్రం ఎప్పటికప్పుడు ధోనీ అప్‌డేట్స్‌ను అభిమానులతో పంచుకుంటోంది. తాజాగా సాక్షి సింగ్ సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన కొన్ని ఫోటోలు తెగ వైరల్ అవుతున్నాయి. మహీ నయా లుక్ ఫోటోలు, స్నేహితులతో సరదాగా గడుపుతున్న పోటోలను చూసి అభిమానులు ఫిదా అయిపోతున్నారు.

RS Praveen Kumar: RS ప్రవీణ్‌కుమార్‌ పొలిటికల్ ఎంట్రీ.. నల్గొండ వేదికగా ఆ పార్టీలోకి..

AP Crime News: తప్పు.. తప్పు.. రూటు మార్చిన పూజారి.. భక్తులకు అడ్డంగా దొరికిపోయాడు

Two Women Murdered : కడప జిల్లాలో దారుణం.. తల్లీ కూతుళ్లను కత్తులతో నరికి చంపిన దుండగులు