RS Praveen Kumar: RS ప్రవీణ్‌కుమార్ పొలిటికల్ ఎంట్రీ.. నల్గొండ వేదికగా ఆ పార్టీలోకి..
రేపల్లె శివ ప్రవీణ్‌కుమార్ (RS ప్రవీణ్‌కుమార్ RS Praveen Kumar).. 1995 ఐపీఎస్ అధికారి. ప్రభుత్వ గురుకులాల్లో మంచి పట్టు సాధించి ఎవ్వరు ఊహించని విధంగా రాజీనామా చేసి పతాక శీర్షికల్లోకి ఎక్కిన...
రేపల్లె శివ ప్రవీణ్‌కుమార్ (RS ప్రవీణ్‌కుమార్ RS Praveen Kumar).. 1995 ఐపీఎస్ అధికారి. తెలుగు రాష్ట్రాల్లో ఎన్‌కౌంటర్ స్పెషలిస్ట్‌గా పేరు తెచ్చుకున్నారు. ప్రభుత్వ గురుకులాల్లో మంచి పట్టు సాధించి ఎవ్వరు ఊహించని విధంగా రాజీనామా చేసి పతాక శీర్షికల్లోకి ఎక్కిన గురుకులాల మాజీ సెక్రటరీ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ రాజకీయ జీవితంపై ఓ క్లారిటీ వచ్చింది. అయితే తాను ఏ రాజకీయ పార్టీలో చేరట్లేదని బలహీన వర్గాల ప్రజలకు అందుబాటులో ఉండటానికే పదవులకు రాజీనామా చేసినట్లు ఆరోజు వెల్లడించారు. అయితే.. ఇన్నాళ్లు ఆయన చెబుతున్న బహుజన వాదానికి అనుగుణంగానే ప్రకటన వెలువడింది. ఈ నేపథ్యంలోనే ఆయన త్వరలోనే బీఎస్పీలో చేరతారని యూపికి చెందిన బహుజన సమాజ్వాదీ పార్టీ(BSP) చీఫ్ మాయవతి స్వయంగా ప్రకటించిన సంగతి తెలిసిందే.
దీంతో ఆయన రాజకీయ అరంగ్రేటానికి సన్నద్దమయినట్టు తెలుస్తోంది. ఈ క్రమంలోనే ఆయన గతంలో యూపీకి వెళ్లి మాయవతిని కలిసి వచ్చినట్టుగా తెలుస్తోంది. ముందస్తు వ్యుహంలో భాగంగానే ఆయన రాజీనామా సమర్పించారని సమాచారం. అయితే ఆయన చేరికపై ఇప్పుడు మరింత క్లారిటీ వచ్చింది. ఆ పార్టీ రాష్ట్ర శాఖ అధ్యక్షుడు ప్రభాకర్ ఓ ప్రకటన చేశారు. రాజ్యాంగంను రక్షించడం కోసం అర్ ఎస్ ప్రవీణ్ కుమార్ తన పదవికి రాజీనామా చేశారని తెలిపారు. RS ప్రవీణ్ కుమార్ ఈ నెల 8 తేదీన బహుజన సమాజ్వాదీ పార్టీలో జాయిన్ అవుతున్నారని ప్రకటించారు. ఆయన చేరిక కోసం భారీ ఏర్పాట్లు చేస్తున్నట్లుగా తెలిపారు. ఇందు కోసం నల్గొండలోని NG కాలేజ్ గ్రౌండ్‌లో ఈ కార్యక్రమం జరుగుతుందని తెలిపారు. BSP జాతీయ కోఆర్డినేటర్ రాజ్యసభ MP రాంజీ గౌతమ్ సమక్షంలో ప్రవీణ్ కుమార్ పార్టీలో చేరుతున్నారని తెలిపారు.
గతంలో ఆ పార్టీ నుంచి..
ఈ నేపథ్యంలోనే ఆయన రాజీనామా తర్వాత ముందుగా TRSలో చేరతారని మీడియాలో.. సోషల్ మీడియాలో భారీ ప్రచారం సాగింది. SCలు ఎక్కువగా ఉన్న హుజూరాబాద్‌లో ఆయన TRS పార్టీ నుండి పోటీచేస్తారనే విపరీతమైన ప్రచారం జరిగింది. మరోవైపు ఆయనే ఓ స్వంత పార్టీ పెడతారనే ప్రచారం కూడా వినిపించింది. అయితే వీటికి ఆయన ఎండ్ కార్డ్ వేశారు. తాను ముందుగా రాజకీయాల్లో రానన ప్రకటించిన ఆయన అనంతరం బడుగుల బలహీన వర్గాల అభివృద్ది కోసం ముందుకు వస్తానని ప్రకటించారు.
తన విశాల దృక్పథం ఉండడం వల్ల ప్రజలకు మరింత సేవ చేసేందుకు ముందుకు వస్తానని చెప్పారు. ఈనేపథ్యంలోనే రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకువచ్చిన దళిత బంధు వల్ల ప్రయోజనం చేకూరదని విమర్శించారు. ఆ డబ్బులతో గురుకులాలను బాగు చేయాలని డిమాండ్ చేశారు. మరోవైపు టీఆర్ఎస్‌లో ఉన్న ఎస్సీ ఎమ్మెల్యేలతో ప్రయోజనం లేదని కామెంట్ చేసిన సంగతి తెలిసిందే.
రంగు మార్చేస్తా…
BSP చేరుతున్నట్లుగా RS ప్రవీణ్ కుమార్ ప్రకటించారు. ఈ నెల 8న నల్గొండ వేదికగా బీఎస్పీలో చేరుతున్నట్లుగా తెలిపారు. MLA కావాలనో.. మంత్రి కావాలనో చేరడం లేదని అన్నారు.కేవలం గులాబీ తెలంగాణను నీలి తెలంగాణ మార్చేందుకు రాజకీపార్టీలో చేరుతున్నట్లుగా వివరణ ఇచ్చుకున్నారు.
ఇవి కూడా చదవండి: IND vs ENG 1st Test Day 3 Live: ఆసక్తికరంగా పోరు.. స్కోర్ కోసం ఇక్కడ చూడండి..
Gold Funds: భారీ లాభాల కోసం ప్లాన్ చేస్తున్నారా.. పెట్టుబడి పెట్టడానికి ముందు ఇది తెలుసుకోండి..