Anil Kumar Yadav vs Lokesh: ఆయన పాదాలు ఎలాంటివో నారా లోకేష్ చెప్పాలి.. మంత్రి అనిల్ కుమార్ యాదవ్ స్ట్రాంగ్ కౌంటర్
పులిచింతల పాపం ఎవరిది? దీనిపైనే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్‌లో పొలిటికల్ పంచాయితీ నడుస్తోంది. నారా లోకేష్ ఇష్టమొచ్చినట్టు ఆరోపణలు చేయడం సరికాదంటూ మండిపడ్డ ఏపీ జలవనరుల మంత్రి
Anil Kumar Yadav vs Lokesh: పులిచింతల పాపం ఎవరిది? దీనిపైనే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్‌లో పొలిటికల్ పంచాయితీ నడుస్తోంది. నారా లోకేష్ ఇష్టమొచ్చినట్టు ఆరోపణలు చేయడం సరికాదంటూ మండిపడ్డ ఏపీ జలవనరుల మంత్రి అనిల్ కుమార్ యాదవ్.. చంద్రబాబు హయాంలో అన్నమయ్య ప్రాజెక్టు గేటు కొట్టుకుపోయిన సంగతేంటని ప్రశ్నించారు. పులిచింతలపై రిపోర్ట్ వస్తే చంద్రబాబు పక్కనపెట్టేశారన్నారాయన. ఇవాళ పులిచింతల అంశానికి సంబంధించి టీడీపీ నేత నారాలోకేష్ చేసిన ట్వీట్‌పై మంత్రి టీవీ9తో మాట్లాడారు.
“ట్విట్టర్ చేతిలో ఉందని లోకేష్ ఇష్టం వచ్చినట్టు ట్వీట్లు చేస్తున్నారు. చంద్రబాబు సీఎం గా ఉన్నప్పుడు అన్నమయ్య రిజర్వాయర్ లో గేట్లు కొట్టుకుపోయాయి. గోదావరిలో చంద్రబాబు పాదం పెడితే 30 మంది చనిపోయారు. చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కనీసం వర్షాలు పడలేదు. జగన్ పాదం పెట్టాకే వర్షాలు పుష్కలంగా పడుతున్నాయి. గతంలో ఇదే పులిచాంతల పై రిపోర్ట్ వస్తే అప్పుడు చంద్రబాబు ప్రభుత్వం పక్కన పెట్టింది.” అని ఎదురుదాడికి దిగారు మంత్రి అనిల్.
ఇలాఉండగా, భారీ వర్షాలు, వరద నీటితో పూర్తిస్థాయి నీటితో తొణికిసలాడుతోన్న పులిచింతల ప్రాజెక్టు గేటు ఒక్కసారిగా విరిగి పడి కొట్టుకుపోయిన ఘటనపై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ఇవాళ స్పందించారు. ట్విట్టర్ వేదికగా ఆయన విమర్శలు చేశారు. మాజీ ముఖ్యమంత్రి, దివంగత వైయస్ఆర్ హయాంలో జరిగిన జలయజ్ఞంలో అవినీతి వల్లే, నిర్మాణ లోపం జరిగి గేటు కొట్టుకుపోయిందంటూ ఆరోపించే ప్రయత్నం చేశారు లోకేష్.
దీనికి సంబంధించి లోకేష్ ఇలా ట్వీట్ చేశారు. “జలయజ్ఞం పేరుతో మహా”మేత”… దరిద్ర పాదం ఎఫెక్ట్ తో ఊడిపడిన గేటు… సముద్రంపాలవుతున్న లక్షల క్యూసెక్కుల జలాలు… తండ్రి హయాంలో జరిగిన అవినీతి తనయుడి హయాంలో బయటపడటమే దేవుడి స్క్రిప్ట్.” అంటూ లోకేష్ ట్వీట్ చేశారు. దీనిపైనే మంత్రి అనిల్ కుమార్ యాదవ్.. లోకేష్ కు కౌంటర్ ఇచ్చారు.
Read also: Ongole RIMS: ఒంగోలు రిమ్స్‌లో దారుణం.. కాంట్రాక్ట్ నర్సుపై పేషెంట్ బంధువు లైంగిక దాడి