Ongole RIMS: ఒంగోలు రిమ్స్‌లో దారుణం.. కాంట్రాక్ట్‌ నర్సుపై పేషెంట్‌ బంధువు లైంగిక దాడి

ఒంగోలు రిమ్స్‌ ఆసుపత్రిలో దారుణం చోటు చేసుకుంది. కొవిడ్‌ పేషెంట్‌కు చికిత్స చేస్తున్న కాంట్రాక్ట్‌ నర్సుపై పేషెంట్‌ బంధువు లైంగికంగా దాడి చేసి ఆమె చేతివేలు కొరికాడు

Ongole RIMS: ఒంగోలు రిమ్స్‌లో దారుణం.. కాంట్రాక్ట్‌ నర్సుపై పేషెంట్‌ బంధువు లైంగిక దాడి
Ongole Rims
Follow us
Venkata Narayana

|

Updated on: Aug 06, 2021 | 3:37 PM

Ongole RIMS Hospital: ఒంగోలు రిమ్స్‌ ఆసుపత్రిలో దారుణం చోటు చేసుకుంది. కొవిడ్‌ పేషెంట్‌కు చికిత్స చేస్తున్న ఓ కాంట్రాక్ట్‌ నర్సుపై పేషెంట్‌ బంధువు లైంగికంగా దాడి చేసి ఆమె చేతివేలు కొరికాడు. కొవిడ్‌ వార్డులో అందరూ చూస్తుండగానే ఈ ఘటన చోటు చేసుకుంది. తనపై దాడి ఘటనతో బిత్తరపోయిన నర్సు పెద్దగా కేకలు వేయడంతో తోటి వైద్య సిబ్బంది, పేషెంట్‌ బంధువులు జోక్యం చేసుకుని నర్సును విడిపించారు. నర్పుపై లైంగికంగా దాడి చేయడమే కాకుండా ఆమె గొంతునులిమేందుకు ప్రయత్నించాడా కామాంధుడు.

వివరాల్లోకి వెళితే, ఒంగోలు రిమ్స్‌ వైద్యశాలలోని 216వ వార్డులో కొవిడ్‌ బాధితులకు చికిత్స అందిస్తున్న క్రమంలో ఓ నర్సుపై పేషెంట్‌ కొడుకు ఈ అకృత్యానికి పాల్పడ్డాడు. ఈనెల 1వ తేదిన జరిగిన ఈ సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. కొవిడ్‌ వార్డులో బాధితురాలికి ఓ మహిళా నర్సు చికిత్స అందిస్తోంది. ఈ క్రమంలో పేషెంట్‌ కొడుకైన విజయ్‌కుమార్‌ అనే యువకుడు నర్సుపై కన్నేశాడు. తన తల్లికి చికిత్స చేస్తున్న నర్సు ఒంటిపై చేయి వేశాడు. తాకరాని చోట తనను తాకడంతో నర్సు విజయ్‌కుమార్‌ను మందలించింది.

దీంతో మరింత రెచ్చిపోయిన విజయ్‌కుమార్‌ నర్సును బలంగా పట్టుకుని వాటేసుకున్నాడు. అతని పట్టునుంచి విడిపించుకునేందుకు ప్రయత్నించిన నర్సును మరింత బలంగా పక్కనే ఉన్న మంచంపై తోసి ఆమెపై పశువులా పడి లైంగికదాడి చేసేందుకు ప్రయత్నించాడు. వార్డులో ఇతర పేషెంట్లు, వారి బంధువులు అందరూ చూస్తుండగానే ఈ సంఘటన జరగడంతో విజయ్‌కుమార్‌ను వారించి అతని బారి నుంచి నర్సును కాపాడారు. జరిగిన అవమానంతో బిత్తరపోయిన నర్సు తనకు జరిగిన అన్యాయంపై వైద్యాధికారులకు ఫిర్యాదు చేసింది.

ఈ దృశ్యాలు ఆస్పత్రి సిసి కెమెరాల్లో రికార్డయ్యాయి. సిసి కెమెరా రికార్డులను పరిశీలించిన వైద్యాధికారులు వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశారు. కొవిడ్‌ పరిస్థితుల్లో ప్రాణాలకు తెగించి వైద్యసహాయాన్ని అందిస్తున్న వైద్య సిబ్బంది పట్ల పేషెంట్ల బంధువులు దాడులు చేయడమేకాకుండా లైంగికంగా వేధింపులకు గురిచేయడం సమంజసం కాదని వైద్యాధికారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి ఘటనలకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేస్తున్నారు.

బాధితురాలి నుంచి స్టేట్‌మెంట్‌ తీసుకున్న పోలీసులు నిందితుడు విజయ్‌కుమార్‌ను అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేశారు. అరెస్ట్‌ చేసి రిమాండ్‌కు తరలించారు. ఈ కేసులో వెంటనే కేసు నమోదు చేసి నిందితుడ్ని అరెస్ట్‌ చేసినట్టు పోలీసులు తెలిపారు.

Read also: Medak Children: మెదక్ జిల్లాలో అబ్బురపరుస్తోన్న బస్తీలోని చిన్న పిల్లల ప్రయత్నం.. యావత్ ప్రపంచానికే ఆదర్శం