Two Women Murdered : కడప జిల్లాలో దారుణం.. తల్లీ కూతుళ్లను కత్తులతో నరికి చంపిన దుండగులు

Two Women Murdered : కడప జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. బ్రహ్మంగారి మఠం మండలం డి నేలటూరులో తల్లీ కూతుళ్లను గుర్తు తెలియని దుండగులు

Two Women Murdered : కడప జిల్లాలో దారుణం.. తల్లీ కూతుళ్లను కత్తులతో నరికి చంపిన దుండగులు
Follow us
uppula Raju

|

Updated on: Aug 06, 2021 | 3:59 PM

Two Women Murdered : కడప జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. బ్రహ్మంగారి మఠం మండలం డి నేలటూరులో తల్లీ కూతుళ్లను గుర్తు తెలియని దుండగులు కత్తులతో నరికి చంపారు. మృతులను అంజనమ్మ, లక్ష్మీదేవిగా గుర్తించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని పరిశీలిస్తున్నారు. అయితే 2012లో జరిగిన హత్యలకు ప్రతీకారంగానే వీరి హత్యలు జరిగినట్లుగా తెలుస్తోంది. ఆస్తుల కోసమే వీరి హత్య జరిగినట్లుగా పోలీసులు ప్రాథమికంగా నిర్థారించారు.

గతంలో అంజనమ్మ,లక్ష్మీ దేవిలు కోడలైన చరిష్మను వేధింపులు గురి చేస్తు హత్య చేశారు. చరీష్మా త‌ల్లిదండ్రులు అంజనమ్మ,లక్ష్మీ దేవి లపై కేసుపెట్టడంతో ఇటీవల బెయిల్‌పై ఇద్దరు బయటికి వచ్చారు. ఆస్తి పంపకాల విషయంలో కోడలు చరిష్మా తరుపు కుటుంబ సభ్యులు, అంజనమ్మల మధ్య పంచాయితీ కొనసాగుతూ ఉంది. కూతురుని చంపిన ప్రతీకార చ‌ర్యలో భాగంగా చరిష్మా కుటుంబ సభ్యులు ఈ ఇద్దరిని హ‌త్య చేసి ఉంటార‌ని పోలీసులు అనుమానిస్తున్నారు. అయితే అసలు నిజాలు ఇంకా వెల్లడి కావల్సి ఉంది. పోలీసులు విచారణ జరుగుతోంది.

Bigg BosTamil Season 5 : మరోసారి బిగ్ బాస్ హోస్ట్‌గా కమల్ హాసన్.. అక్టోబర్ నుంచి ప్రారంభం

Bigg Boss 5 Telugu: బిగ్ బాస్ ఇంట్లోకి ఎంట్రీ ఇవ్వనున్న ‘జబర్దస్త్’ లేడీ.. ఎవరో తెలుసా..?

Ongole RIMS: ఒంగోలు రిమ్స్‌లో దారుణం.. కాంట్రాక్ట్‌ నర్సుపై పేషెంట్‌ బంధువు లైంగిక దాడి

Dhanush: నో గ్యాప్ అంటున్న స్టార్ హీరో.. బ్యాక్ టూ బ్యాక్ సినిమాలతో రానున్న ధనుష్.. శేఖర్ కమ్ముల మూవీస్టోరీ ఇదేనా..