AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Credit Cards: క్రెడిట్ కార్డ్స్‌లో ఉండే ఈ బెనిఫిట్స్ గురించి చాలామందికి తెలియదు!

క్రెడిట్ కార్డు కేవలం అప్పు ఇచ్చే కార్డు మాత్రమే కాదు, వాటితో చాలా ఇంట్రెస్టింగ్ బెనిఫిట్స్ ఉంటాయి. క్రెడిట్ కార్డుల్లో ఉండే ఈ ఫీచర్లు, వెసులుబాట్ల గురించి తెలుసుకోవడం ద్వారా ఆర్ధికంగా ఎదురయ్యే కొన్ని ఇబ్బందుల నుంచి బయటపడొచ్చు. అలాంటి కొన్ని ముఖ్యమైన విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం.

Credit Cards: క్రెడిట్ కార్డ్స్‌లో ఉండే ఈ బెనిఫిట్స్ గురించి చాలామందికి తెలియదు!
Nikhil
|

Updated on: Sep 25, 2025 | 6:10 PM

Share

మనదేశంలో రోజురోజుకీ క్రెడిట్‌ కార్డుల వాడకం పెరుగుతోందని సర్వేలు చెప్తున్నాయి. ముఖ్యంగా ఉద్యోగం చేస్తున్న చాలామంది కనీసం రెండు లేదా మూడు క్రెడిట్ కార్డులు వాడుతున్నారు. అయితే క్రెడిట్ కార్డు వాడే చాలామందికి వాటిలో ఉండే బెనిఫిట్స్, ఫీచర్స్ గురించి తెలియదు. క్రెడిట్ కార్డుని తెలివిగా ఎలా వాడుకోవచ్చంటే..

కార్డు ఛార్జీలు

క్రెడిట్ కార్డు సంస్థలు చాలావరకూ ఉచితంగానే కార్డులు అందజేస్తుంటాయి. ఒకవేళ వాడని క్రెడిట్ కార్డులపై మెయిటెనెన్స్ ఛార్జీలు కట్టాల్సి వచ్చినప్పుడు.. కార్డు క్లోజర్ రిక్వెస్ట్ పెట్టుకుని కార్డుని క్లోజ్ చేసుకోవచ్చు. లేదా కొన్నిసార్లు కంపెనీలు మెయింటెనెన్స్ ఛార్జీలను రద్దు చేసి ఉచితంగా సర్వీస్ ఇస్తామని కూడా ఆఫర్ ఇస్తాయి.

షాపింగ్ బెనిఫిట్స్

క్రెడిట్ కార్డులు తీసుకునేటప్పుడు కోబ్రాండెడ్ కార్డులు తీసుకోవడం ద్వారా షాపింగ్, ట్రావెల్ వంటి రకరకాల అదనపు బెనిఫిట్స్ పొందొచ్చు. అలాగే బిల్లింగ్ సైకిల్‌ డేట్స్, బిల్ డేట్లు మార్చుకునేందుకు కూడా క్రెడిట్ కార్లు అవకాశం కల్పిస్తాయి. దీనికై యాప్ లేదా హెల్ప్ లైన్ ద్వారా రిక్వెస్ట్ పెట్టుకోవాలి.

బ్యాలెన్స్ ట్రాన్స్‌ఫర్

క్రెడిట్ కార్డు కంపెనీలు ఇప్పుడు కొత్తగా బ్యాలెన్స్‌ ట్రాన్స్‌ఫర్‌ అనే ఫీచర్‌‌ను ప్రవేశపెడుతున్నాయి. అంటే ఒక క్రెడిట్‌ కార్డు బ్యాలెన్స్‌ను మరో కార్డుకు బదిలీ చేసుకోవచ్చన్న మాట. ఒకవేళ మీరు వాడుతున్న కార్డు కంపెనీ కంటే ఇతర బ్యాంకులు తక్కువ వడ్డీరేటును కల్పించినప్పుడు కూడా క్రెడిట్ కార్డుని ఇతర సంస్థకు ట్రాన్స్‌ఫర్ చేసుకోవచ్చు. ఈ సదుపాయం ద్వారా క్రెడిట్‌ కార్డు లిమిట్‌లో 75 నుంచి 80 శాతం వరకు బ్యాలెన్స్‌ను వేరే సంస్థ క్రెడిట్ కార్డుకి ట్రాన్స్ ర్ చేసుకోవచ్చు. అలాగే నాలుగైదు క్రెడిట్ కార్డులు వాడుతున్నవాళ్లు కూడా అన్ని కార్డు చెల్లింపులను ఒకే దగ్గరకు చేర్చుకోవచ్చు.

మినిమమ్ డ్యూ

క్రెడిట్ కార్డు బిల్లు వచ్చినప్పుడు కట్టాల్సిన మొత్తం(టోటల్ డ్యూ), కనీస మొత్తం(మినిమం డ్యూ) అని రెండు కనిపిస్తాయి. మొత్తం  బిల్లు కట్టలేని పరిస్థితుల్లో చాలామంది మినిమం డ్యూ కట్టేస్తుంటారు. అంటే  మొత్తం బిల్లులో ఐదు శాతం కడితే చాలు.  దీనివల్ల మీకు తాత్కాలికంగా  రిలీఫ్ లభించినప్పటికీ తర్వాత దానిపై అదనపు వడ్డీ కట్టాల్సి వస్తుంది. మినిమం డ్యూ కట్టడం ద్వారా మిగిలిన ఈఎంఐ అమౌంట్ మరుసటి నెల బిల్లుకు బదిలీ అవుతుంది. దానిపై అదనపు వడ్డీ పడుతుంది. మినిమన్ డ్యూ అనే ఆప్షన్ వల్ల మీకు నష్టం తప్ప లాభం లేదు. కాబట్టి కట్టలేని పరిస్థితుల్లోనే ఈ ఆప్షన్ వాడుకోవాలి.

ఫ్రీ బెనిఫిట్స్‌

క్రెడిట్ కార్డు తీసుకునేటప్పుడు దాని ఫుల్ డీటెయిల్స్, బెనిఫిట్స్ గురించి తెలుసుకోవాలి.  కొన్ని క్రెడిట్ కార్డు ఫ్రీ ట్రావెల్ ఇన్సూరెన్స్ లు, యూసేజ్ ను బట్టి రివార్డ్ పాయింట్ల వంటివి ఇస్తుంటాయి. అలాగే కొన్ని క్రెడిట్ కార్డులు కొన్నికంపెనీలతో లింక్ అయ్యి అదనపు బెనిఫిట్స్ ను అందిస్తుంటాయి. ఉదాహరణకు యస్ బీఐ బీపీసీఎల్ కార్డు ద్వారా భారత్ పెట్రోలియంలో పెట్రోల్ కొట్టించిన ప్రతిసారీ 5 శాతం డిస్కౌంట్ లభిస్తుంది. ఇలాంటి బెనిఫిట్స్ తెలుసుకుంటేనే వాటి ద్వారా లాభం పొందే వీలుంటుంది.

బిల్లింగ్ డీటెయిల్స్

ఇకపోతే క్రెడిట్ కార్డులు వాడేవాళ్లు దాని పనితీరు, వాటి వడ్డీ రేట్ల వివరాలు గురించి పూర్తిగా తెలుసుకోవాలి.  బిల్లు కట్టే ప్రతీసారీ స్టేట్‌మెంట్‌ను ఒకటికి రెండు సార్లు చెక్ చేసుకోవాలి. ఏ ఛార్జీ ఎందుకు పడిందో తెలుసుకుని బిల్లు కట్టాలి. అయితే క్రెడిట్ కార్డు వాడేవాళ్లు ఒకరోజు లేట్‌గా బిల్లు కట్టినా ఏమీ కాదనుకుంటారు. అయితే గడువు కేవలం ఒక్కరోజు దాటినా కూడా దానికి రకరకాల లేట్ ఛార్జీలు అప్లై అవుతాయి. ఇవి బిల్లు మొత్తాన్ని బట్టి డిసైడ్ అవుతాయి. రూ.1000 వరకూ ఒక ఛార్జీ, రూ 3,000 వరకూ ఒక ఛార్జీ ఇలా రకరకాల లేట్ పేమెంట్ ఛార్జీలు ఉంటాయి. ఈ ఛార్జీలు తదుపరి బిల్లింగ్ సైకిల్‌లో యాడ్ అవుతాయి. బిల్లింగ్ విషయంలో కొన్ని సార్లు తప్పులు జరిగే అవకాశం కూడా ఉంది. అందుకే మీరు గమనించి కస్టమర్ కేర్ ను అడగడం ద్వారా కొన్ని సార్లు అదనపు ఛార్జీలు తొలగించే(వేవ్ ఆఫ్) అవకాశం ఉంటుంది.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

అమ్మాయికి మొగుడు... అత్తకు యముడు... ఏకంగా గొంతు కోసి..
అమ్మాయికి మొగుడు... అత్తకు యముడు... ఏకంగా గొంతు కోసి..
గురు, శుక్రుల అనుకూలత.. ఆ రాశుల వారికి హద్దుల్లేని సంపద ఖాయం..!
గురు, శుక్రుల అనుకూలత.. ఆ రాశుల వారికి హద్దుల్లేని సంపద ఖాయం..!
మెస్సీ వచ్చిన ఆ రోజు కోల్‌కతా స్టేడియంలో ఏం జరిగింది ?
మెస్సీ వచ్చిన ఆ రోజు కోల్‌కతా స్టేడియంలో ఏం జరిగింది ?
కొత్త ఏడాది ఈ రాశుల వారి కుటుంబాల్లో భారీగా శుభ కార్యాలు..!
కొత్త ఏడాది ఈ రాశుల వారి కుటుంబాల్లో భారీగా శుభ కార్యాలు..!
రైతన్నలకు అదిరిపోయే గుడ్‌న్యూస్.. ఇకపై నేరుగా ఇంటికే యూరియా!
రైతన్నలకు అదిరిపోయే గుడ్‌న్యూస్.. ఇకపై నేరుగా ఇంటికే యూరియా!
టీ20 వరల్డ్ కప్ టికెట్‌ను మెస్సీకి బహూకరించిన ఐసీసీ ఛైర్మన్ జై షా
టీ20 వరల్డ్ కప్ టికెట్‌ను మెస్సీకి బహూకరించిన ఐసీసీ ఛైర్మన్ జై షా
సమాధులే ఇంటి దేవతలు.. ఏపీలోని ఈ వింత గ్రామం గురించి మీకు తెలుసా
సమాధులే ఇంటి దేవతలు.. ఏపీలోని ఈ వింత గ్రామం గురించి మీకు తెలుసా
కేంద్ర ప్రభుత్వం నుంచి రూ.20 లక్షల వరకు లోన్.. పొందండిలా..
కేంద్ర ప్రభుత్వం నుంచి రూ.20 లక్షల వరకు లోన్.. పొందండిలా..
ఈ ఫొటోలో ఒక టాలీవుడ్ హీరోయిన్ కూడా ఉంది.. గుర్తు పట్టండి చూద్దాం
ఈ ఫొటోలో ఒక టాలీవుడ్ హీరోయిన్ కూడా ఉంది.. గుర్తు పట్టండి చూద్దాం
టూర్ ప్లాన్ చేస్తున్నారా? ఆంజనేయుడి జన్మస్థలం చూసొద్దాం రండి..
టూర్ ప్లాన్ చేస్తున్నారా? ఆంజనేయుడి జన్మస్థలం చూసొద్దాం రండి..