AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Toyota Innova Crysta: కస్టమర్లకు టయోటా షాక్‌.. డీజిల్ ఇన్నోవా క్రిస్టాకు మంగళం.. ఎందుకు..? దీని బదులుగా..

Toyota Innova Crysta: టయోటా ఇన్నోవా క్రిస్టా డీజిల్‌ వర్షన్‌ కొనాలనుకుంటున్నారా? అయితే ఇక ఆలోచన విరమించుకోండి. డీజిల్ ఇన్నోవా క్రిస్టా బుకింగ్స్‌ను నిలిపేసింది టయోటా..

Toyota Innova Crysta: కస్టమర్లకు టయోటా షాక్‌.. డీజిల్ ఇన్నోవా క్రిస్టాకు మంగళం.. ఎందుకు..? దీని బదులుగా..
Toyota Innova Crysta
Subhash Goud
|

Updated on: Aug 27, 2022 | 10:05 AM

Share

Toyota Innova Crysta: టయోటా ఇన్నోవా క్రిస్టా డీజిల్‌ వర్షన్‌ కొనాలనుకుంటున్నారా? అయితే ఇక ఆలోచన విరమించుకోండి. డీజిల్ ఇన్నోవా క్రిస్టా బుకింగ్స్‌ను నిలిపేసింది టయోటా. ఇప్పటికే ఈ కార్లను బుక్‌ చేసుకున్న కస్టమర్లు పెట్రోల్‌ క్రిస్టా తీసుకోవాంటూ వేడుకుంటోంది. పైగా డీజిల్‌కన్నా పెట్రోలు వాహనం ఖర్చు తక్కువ అంటూ డీలర్లు ప్రజంటేషన్‌ కూడా ఇస్తున్నారు. అయితే కస్టమర్లు పెట్రోల్‌ క్రిస్టా కార్లు కొనేందుకు వెనుకడుగు వేస్తున్నారు. డీజిల్‌ వెర్షన్‌ మీదే ఆసక్తి చూపిస్తున్నారు. ఈ కార్ల ధరను పెంచినప్పటికీ కస్టమర్ల ఆదరణ మాత్రం తగ్గలేదు. ఇంత ఆదరణ ఉన్న డీజిల్ ఇన్నోవా క్రిస్టా బుకింగ్స్‌ను నిలిపేయడం ఆశ్యర్యం కలిగిస్తోంది.

భారత్‌లో అమ్మడవుతున్న టయోటా వాహనాల్లో అత్యధికం డీజిల్‌ ఇన్నోవా క్రిస్టానే. నెలకు 7 వేల 900 వాహనాలను విక్రయిస్తోంది టయోటా. ఇప్పుడు ఆ వాహనాల తయారీనే నిలిపివేస్తున్నారనే వార్త కొత్తగా కొందామనుకుంటున్న కస్టమర్లకు ఆందోళన కలిగిస్తోంది. డీజిల్ ఇన్నోవా క్రిస్టా బుకింగ్స్‌ ఎందుకు నిలిపివేశారనే విషయంలో టయోటా కంపెనీ క్లారిటీ ఇవ్వకున్నా, సెమీ కండక్టర్ల కొరతే కారణమని డీలర్లు భావిస్తున్నారు.

టొయోటా హైరైడర్ ఇటీవలే మనదేశంలో లాంచ్ అయింది. ఇది సెల్ఫ్ చార్జింగ్ ఎలక్ట్రిక్ స్ట్రాంగ్ హైబ్రిడ్ సిస్టం ఉన్న కారు. మరోవైపు టాయోటా కొత్తగా ఇన్నోవా పెట్రోల్ హైబ్రిడ్ పవర్‌ట్రెయిన్‌తో వస్తోంది. ఇందులోని ఇంటీరియర్‌ చాలా విలావంతంగా ఉంటుందని చెబుతున్నారు. ఈ వాహనాలు కస్టమర్ల ఆదరణ పొందుతాయని భావిస్తున్నారు. ఏది ఏమైనప్పటికీ టయోటా డీజిల్ ఇన్నోవా క్రిస్టా నిలిపివేయడం ఆందోళన కలిగిస్తోంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

ఏంటన్నా ఇలా మారిపోయావ్.. హీరోగా టాలీవుడ్ సెన్సేషనల్ డైరెక్టర్
ఏంటన్నా ఇలా మారిపోయావ్.. హీరోగా టాలీవుడ్ సెన్సేషనల్ డైరెక్టర్
తిరుమలకు వెళ్లే ఆ నడక మార్గం మూసివేత!
తిరుమలకు వెళ్లే ఆ నడక మార్గం మూసివేత!
రిచా ఘోష్ ఆన్ డ్యూటీ.. జీతం, బోనస్ కలిపి ఎంతోస్తాయో తెలుసా ?
రిచా ఘోష్ ఆన్ డ్యూటీ.. జీతం, బోనస్ కలిపి ఎంతోస్తాయో తెలుసా ?
గ్లాస్‌ బ్రిడ్జ్ కోసం కైలాసగిరికి క్యూ కట్టిన పర్యాటకులు
గ్లాస్‌ బ్రిడ్జ్ కోసం కైలాసగిరికి క్యూ కట్టిన పర్యాటకులు
రాంగ్‌ రూట్‌లో వచ్చి మరీ.. మహిళా కానిస్టేబుల్‌పై బైక్ రైడర్ దాడి
రాంగ్‌ రూట్‌లో వచ్చి మరీ.. మహిళా కానిస్టేబుల్‌పై బైక్ రైడర్ దాడి
బాలయ్య కంటే ముందే అఘోరాగా కనిపించిన చిరంజీవి..
బాలయ్య కంటే ముందే అఘోరాగా కనిపించిన చిరంజీవి..
జాతకంలో రాహు-కేతు పీడ ఉందా? బంగారం లాంటి చాన్స్ ఇది!
జాతకంలో రాహు-కేతు పీడ ఉందా? బంగారం లాంటి చాన్స్ ఇది!
కారు నట్స్‌ను ఇలా బిగిస్తున్నారా? జాగ్రత్త.. పేలిపోయే ప్రమాదం..!
కారు నట్స్‌ను ఇలా బిగిస్తున్నారా? జాగ్రత్త.. పేలిపోయే ప్రమాదం..!
ప్రైవేటు క్యాబ్‌ ట్యాక్సీల దోపిడీకి చెక్ భారత్ టాక్సీ సేవలు షురూ
ప్రైవేటు క్యాబ్‌ ట్యాక్సీల దోపిడీకి చెక్ భారత్ టాక్సీ సేవలు షురూ
రోజూ 15నిమిషాల పాటు రమ్‌తో మసాజ్ చేస్తే చాలు..లెక్కలేనన్ని లాభాలు
రోజూ 15నిమిషాల పాటు రమ్‌తో మసాజ్ చేస్తే చాలు..లెక్కలేనన్ని లాభాలు