AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Andhra Politics: ఆంధ్రా పాలిటిక్స్‌ గురూ.. టాపిక్ ఏదైనా టాప్ లేచిపోవాల్సిందే..!

ఆంధ్రప్రదేశ్‌లో కూటమి ప్రభుత్వం రెండేళ్లు పూర్తి చేసుకున్న నేపథ్యంలో రాజకీయ వాతావరణం మరింత వేడెక్కింది. రెండేళ్ల పాలనలో సాధించిన విజయాలను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు కూటమి ప్రభుత్వం ప్రత్యేక కార్యక్రమాలకు సిద్ధమవుతోంది.. ఈ తరుణంలో ‘వెన్నుపోటుకు రెండేళ్లు’ పేరుతో వైసీపీ రాష్ట్రవ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు చేపట్టింది.

Andhra Politics: ఆంధ్రా పాలిటిక్స్‌ గురూ.. టాపిక్ ఏదైనా టాప్ లేచిపోవాల్సిందే..!
Andhra Pradesh Political Heat
Shaik Madar Saheb
|

Updated on: Jun 04, 2026 | 9:46 PM

Share

జనం ఇచ్చిన ఐదేళ్ల అవకాశంలో రెండేళ్లు గడిచాయి. ఈ రెండేళ్లలోనే ఎన్నో అద్భుతాలు చేశాం.. మిగతా మూడేళ్లూ ఇంతకుమించి చేస్తాం అని ఫ్యూచర్ గవర్నెన్స్‌పై మాస్టర్ ప్లాన్ వేసుకుంది కూటమి ప్రభుత్వం. కేంద్రంలోని మోదీ సర్కార్‌ సాధించిన విజయాల్ని కూడా జనంలోకి తీసుకెళ్లాలని గట్టి సంకల్పమే తీసుకుంది. రాష్ట్రంలోని మూడు చోట్ల 3 ఎజెండాలతో మూడు సమావేశాలకు ప్లానింగ్ పూర్తయింది. 24 నెలల్లో అమల్లో పెట్టిన 24 థియరీల్ని జనానికి పరిచయం చేయడం ఎజెండా. ఈనెల 12న అమరావతిలో 12ఏళ్ల నమ్మకం పేరుతో సభ నిర్వహించబోతోంది. అలాగే, డబుల్‌ ఇంజిన్‌ సర్కార్‌ సాధించిన అభివృద్ధి-సంక్షేమంపై విశాఖ, తిరుపతిలో పబ్లిక్ మీటింగ్‌లు పెట్టబోతోంది కూటమి సర్కార్. కానీ, సరిగ్గా ఇదే టైమ్‌లో ఈ సంబరాల్నే డిస్టర్బ్ చేయాలని చూస్తోంది విపక్ష వైసీపీ. మొత్తానికి ఏపీలో రాబోయే వారమంతా వార్‌ సిట్యువేషనే అన్నమాట.. జూన్ 4, 2024… ఆంధ్రప్రదేశ్‌ రాజకీయాల్లో భూకంపం వచ్చి, బండ్లు ఓడలై ఓడలు బండ్లయి సరిగ్గా రెండేళ్లయింది. కూటమి థంపింగ్ విక్టరీ కొట్టి, వైసీపీ నంబర్ దారుణంగా పడిపోయి, పార్టీల మధ్య విషాలు, వైషమ్యాలు పెరగడం మొదలై రెండు వసంతాలు గడిచిపోయాయి. చంద్రబాబు సీఎంగా ప్రమాణ స్వీకారం చేసింది జూన్ 12వ తేదీ ఐనా, ఫలితాలొచ్చి ప్రభుత్వాలు మారింది మాత్రం జూన్ 4వ తేదీ. సెకండ్ యానివర్సరీకి వేళయిందో లేదో రెండు శత్రుపార్టీలు ప్లాన్ ఆఫ్ యాక్షన్ పక్కాగానే రాసుకున్నాయి. రాక్షస పాలన...

Follow Us

పూర్తి కథనాన్ని చదివేందుకు TV9 యాప్‌ని డౌన్‌లోడ్ చేయండి

ప్రత్యేకమైన కథనాలకు అపరిమితమైన యాక్సెస్ TV9 యాప్‌లో కొనసాగండి