AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Indian Railways: ఈ ట్రిక్స్ పాటిస్తే తత్కాల్ టికెట్లు మీకు దొరకడం ఫిక్స్.. చేయకూడని తప్పులివే..

తత్కాల్ టికెట్ల గురించి అందరికీ తెలిసే ఉంటుంది. ఈ టికెట్లను పొందటం అంత సులువైన పని కాదు. జస్ట్ నిమిషాల వ్యవధిలోనే టికెట్లు అన్నీ అయిపోతాయి. కానీ కొన్ని ట్రిక్స్ పాాటించడం వల్ల మీరు తత్కాల్ టికెట్ల రేసులో గెలవొచ్చు. అవేంటి అంటే..

Indian Railways: ఈ ట్రిక్స్ పాటిస్తే తత్కాల్ టికెట్లు మీకు దొరకడం ఫిక్స్.. చేయకూడని తప్పులివే..
Indian Railways
Venkatrao Lella
|

Updated on: Jun 04, 2026 | 10:08 PM

Share

రైళ్లల్లో ఎక్కడికైనా అత్యవసరంగా ప్రయాణం చేయాలనుకుంటే తత్కాల్ టికెట్లనే దిక్కు. చివరి నిమిషంలో ప్రయాణం చేయాలనుకునేవారు ఈ టికెట్ల మీదనే ఆధారపడతారు. అయితే ఈ టికెట్లను పొందటం అంత సులువు కాదు. వీటికి ఉన్న డిమాండ్ కారణంగా పొందేందుకు పోటీ పడాల్సిందే. ఉదయం 10 లేదా 11 గంటలకు టికెట్లను విడుదల చేయగానే కొన్ని గంటల్లో అయిపోతాయి. అయితే కొన్ని చిట్కాలను పాటించడం వల్ల తత్కాల్ టికెట్లను సులువుగా పొందవచ్చు. అవేంటి అనేది ఇప్పుడు చూద్దాం.

ఈ ట్రిక్స్ పాటించండి

-బుకింగ్ ప్రారంభం కాగానే ప్రయాణికుల పేరు, వయస్సు, జెండర్ లాంటివి నమోదు చేయడానికి కనీసం 30 నుండి 45 సెకన్ల సమయం పడుతుంది. దీంతో బుకింగ్ ప్రారంభం కావడానికి అరగంట ముందు మీ IRCTC అకౌంట్లోకి వెళ్లి “మై ప్రొఫైల్” విభాగానికి వెళ్లి ఒక మాస్టర్ లిస్ట్‌ను సృష్టించుకోవచ్చు. అక్కడ ప్రయాణికులందరి పేర్లను ముందుగానే సేవ్ చేసుకోవడం వల్ల బుకింగ్ సమయంలో సమయం వృధా కాదు. బుకింగ్ చేసేటప్పుడు మీరు కేవలం పేర్లను ఎంచుకుంటే సరిపోతుంది.

-ఇక పేమెంట్స్ చేసేటప్పుడు బ్యాంక్ ఓటీపీల మీద ఆధారపడటం వల్ల సమయం వృథా అవుతుంది. అందుకే UPI లేదా IRCTC వాలెట్‌ను ఉపయోగించండి. దీని వల్ల ఒక్క క్లిక్‌తో చెల్లింపులు చేయవచ్చు.

-ఇఖ ఉదయం 11 గంటలకు టికెట్లు రిలీజ్ చేస్తుంటే 10:30 గంటలకు లాగిన్ అవ్వండి. ఏసీ క్లాసుల్లో టికెట్ల కోసం 10:58 గంటలకు, నాన్-ఏసీ క్లాసుల కోసం 11:58 గంటలకు లాగిన్ అవ్వండి. దీని వల్ల మీరు లాగిన్‌లో ఉంటారు. ఎక్కువసేపు వెబ్ సైట్లో ఉంటే లాగౌట్ అయ్యే అవకాశముంటుంది.

-ఇక మీ గమ్యస్థానం, అడ్రస్, పిన్ కోడ్‌ను నమోదు చేయాల్సి ఉంటుంది. దీంతో వీటి ని ముందుగానే టైప్ చేసి బుకింగ్ చేసేటప్పుడు వెంటనే కాపీ చేసి పేస్ట్ చేయండి.

-ఇక కొన్నిసార్లు IRCTC వెబ్‌సైట్ క్రాష్ కావచ్చు లేదా మొబైల్ యాప్ నెమ్మదించవచ్చు. మీ వద్ద ల్యాప్‌టాప్, మొబైల్ ఫోన్ రెండూ ఉంటే ఒకదానిలో వెబ్‌సైట్‌ను, మరొకదానిలో యాప్‌ను తెరిచి ఉంచండి.

Follow Us