AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

UPI Payments: బ్యాంక్ అకౌంట్‌లో డబ్బులు లేకపోయినా యూపీఐ పేమెంట్స్ చేయొచ్చు.. ఎలా అంటే..?

మీ బ్యాంక్ అకౌంట్లో డబ్బులు లేకపోయినా సరే యూపీఐ పేమెంట్స్ చేయవచ్చు. ఈ మేరకు భారత్ ఫ్లెక్స్ అదిరిపోయే ఫీచర్ అందుబాటులోకి తెచ్చింది. యస్ బ్యాంక్‌తో కలిసి భారత్ పే ఈ ఫీచర్ లాంచ్ చేసింది. దీనిని ఎలా యాక్టివేట్ చేసుకోవాలంటే..

UPI Payments: బ్యాంక్ అకౌంట్‌లో డబ్బులు లేకపోయినా యూపీఐ పేమెంట్స్ చేయొచ్చు.. ఎలా అంటే..?
Upi
Venkatrao Lella
|

Updated on: Jun 04, 2026 | 9:48 PM

Share

భారతదేశంలో డిజిటల్ చెల్లింపులు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. రికార్డు స్థాయిలో యూపీఐ పేమెంట్స్ జరుగుతున్నాయి. డిజిటల్ లావాదేవీల్లో మెజార్టీ వాటా యూపీఐదే ఉందని చెప్పవచ్చు. దీంతో యూపీఐ వాడేవారి కోసం ఫిన్‌టెక్ కంపెనీలు అనేక ఆఫర్లు తీసుకొస్తున్నారు. అందులో భాగంగా ప్రముఖ ఫిన్ టెక్ సంస్థ భారత్ పే యూపీఐ కస్టమర్ల కోసం అదిరిపోయే కొత్త ఫీచర్ అందుబాటులోకి తెచ్చింది. భారత్‌పే, యెస్ బ్యాంక్ సంయుక్తంగా ‘భారత్‌పే ఫ్లెక్స్’ను ప్రవేశపెట్టాయి. దీని ద్వారా యూపీఐ క్రెడిట్ లైన్‌ను పొందవచ్చు.

బ్యాంక్ అకౌంట్‌లో డబ్బులు లేకపోతే..

బ్యాంక్ అకౌంట్లో డబ్బులు లేనప్పుడు యూపీఐ ద్వారా చెల్లింపు చేయవచ్చు. ఆ తర్వాత తిరిగి చెల్లించాల్సి ఉంటుంది. 45 రోజుల పాటు ఎలాంటి వడ్డీ ఉండదు. క్రెడిట్ కార్డు తరహాలో ఈ ఫీచర్ ఉంటుంది. ఈ కాలంలో వినియోగదారులు తమ ఖర్చులను బిల్లింగ్ సైకిల్‌లోనే చెల్లించవచ్చు. అలాగే 3 నుండి 12 నెలల EMIలుగా మార్చుకుని అయినా చెల్లించవచ్చు. క్యూఆర్ కోడ్ స్కానింగ్, ఆన్‌లైన్ షాపింగ్, బిల్లు చెల్లింపులు, మొబైల్ రీఛార్జ్‌లు, ప్రయాణ బుకింగ్‌లు, పెట్రోల్ కొనుగోళ్లు, ఇతర రోజువారీ ఖర్చుల కోసం క్రెడిట్ లైన్ అనేది వాడుకోవచ్చు.

ఎలా యాక్టివేట్ చేసుకోవాలి..?

ముందుగా యాప్‌లోకి వెళ్లి క్రెడిట్ లైన్ కోసం దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఆ తర్వాత అర్హులైన కస్టమర్లకు మూడు నిమిషాల్లో ఈ ఫీచర్ యాక్టివేట్ చేస్తారు. వినియోగదారులు యాప్‌లోనే తమ ఖర్చులను, అందుబాటులో ఉన్న క్రెడిట్ పరిమితిని, తిరిగి చెల్లింపులను ట్రాక్ చేయవచ్చు. కేవైసీ పూర్తి చేయాల్సి ఉంటుంది. అనంతరం మీ క్రెడిట్ లైన్‌ను యూపీఐకి లింక్ చేసి యూపీఐ పిన్‌ను సెట్ చేసుకోవాలి. అనంరతం యూపీఐ మర్చంట్‌ల వద్ద చెల్లింపులు చేయవచ్చు. అలాగే  భారత్‌పే యూపీఐ రివార్డ్స్ కింద అర్హత గల లావాదేవీలపై రివార్డులు కూడా పొందవచ్చు.

Follow Us
జేబీఎల్ నుంచి అదిరిపోయే ఇయర్‌బడ్స్.. పూర్తి వివరాలు
జేబీఎల్ నుంచి అదిరిపోయే ఇయర్‌బడ్స్.. పూర్తి వివరాలు
షుగర్‌ ఉన్నవారు భోజనం తర్వాత 10 నిమిషాలు నడిస్తే ఏమవుతుందో తెలుసా
షుగర్‌ ఉన్నవారు భోజనం తర్వాత 10 నిమిషాలు నడిస్తే ఏమవుతుందో తెలుసా
ప్రతిరోజు ఒక్క గ్లాస్ తాగితే ఉక్కులాగా ఆరోగ్యంగా ఉంటారు..
ప్రతిరోజు ఒక్క గ్లాస్ తాగితే ఉక్కులాగా ఆరోగ్యంగా ఉంటారు..
వరమహాలక్ష్మి వ్రతానికి ఈ రంగు చీరలే ఎందుకు ప్రత్యేకమో తెలుసా?
వరమహాలక్ష్మి వ్రతానికి ఈ రంగు చీరలే ఎందుకు ప్రత్యేకమో తెలుసా?
కొత్త పింఛన్లపై తెలంగాణ సర్కార్ కీలక ప్రకటన..
కొత్త పింఛన్లపై తెలంగాణ సర్కార్ కీలక ప్రకటన..
అగ్నివీర్‌గా 'రేసు గుర్రం' విలన్ కూతురు.. ప్రముఖుల ప్రశంసలు
అగ్నివీర్‌గా 'రేసు గుర్రం' విలన్ కూతురు.. ప్రముఖుల ప్రశంసలు
భారత్-అఫ్గాన్ టీ20 సిరీస్ షెడ్యూల్ వచ్చేసింది
భారత్-అఫ్గాన్ టీ20 సిరీస్ షెడ్యూల్ వచ్చేసింది
ప్లాస్టిక్ కుర్చీలు మురికిగా మారాయా? ఇలా చేస్తే మెరిసిపోతాయ్!
ప్లాస్టిక్ కుర్చీలు మురికిగా మారాయా? ఇలా చేస్తే మెరిసిపోతాయ్!
నక్కజిత్తుల చైనా.. కుట్ర బట్టబయలు.. బ్రిటన్ మిలిటరీకే కన్నం..
నక్కజిత్తుల చైనా.. కుట్ర బట్టబయలు.. బ్రిటన్ మిలిటరీకే కన్నం..
ఫ్రిజ్‌లో పెట్టిన ఆహారం మళ్లీ వేడి చేసి తింటున్నారా?
ఫ్రిజ్‌లో పెట్టిన ఆహారం మళ్లీ వేడి చేసి తింటున్నారా?