AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Money Saving Tips: అనవసర ఖర్చులతోనే అసలు సమస్య.. ఈ చిట్కాలు పాటిస్తే సొమ్ము ఆదా సులభతరం

ఆర్థిక నిపుణులు పొదుపు ఆవశ్యకతను ఎంత చెబుతున్నా ముఖ్యంగా యువత పొదుపు విషయంలో వెనకడుగు వేస్తున్నారు. ఉద్యోగ నష్టం, ఊహించని ఖర్చుల విషయంలో ఎక్కువ మంది ఇబ్బంది పడుతున్నారు. అయితే వనరులు పరిమితంగా ఉన్నప్పుడు అనవసర ఖర్చులను తగ్గిస్తే పొదుపు సాధ్యమని నిపుణుల చెబుతున్నారు. కాబట్టి పొదుపు మంత్రం పాటించాలంటే ఎలాంటి ఖర్చులను తగ్గించుకోవాలో? ఓ సారి తెలుసుకుందాం.

Money Saving Tips: అనవసర ఖర్చులతోనే అసలు సమస్య.. ఈ చిట్కాలు పాటిస్తే సొమ్ము ఆదా సులభతరం
Cash
Nikhil
| Edited By: |

Updated on: Oct 04, 2023 | 5:00 PM

Share

ప్రస్తుత రోజుల్లో పొదుపు అనేది ఎవ్వరూ పాటించడం లేదు. ముఖ్యంగా పెరిగన ఖర్చులు, అవసరాల నేపథ్యంలో పొదుపును అందరూ వదిలేస్తున్నారు. అయితే అనుకోని ఖర్చులు వస్తే మాత్రం అప్పులపాలవుతున్నారు. ఆర్థిక నిపుణులు పొదుపు ఆవశ్యకతను ఎంత చెబుతున్నా ముఖ్యంగా యువత పొదుపు విషయంలో వెనకడుగు వేస్తున్నారు. ఉద్యోగ నష్టం, ఊహించని ఖర్చుల విషయంలో ఎక్కువ మంది ఇబ్బంది పడుతున్నారు. అయితే వనరులు పరిమితంగా ఉన్నప్పుడు అనవసర ఖర్చులను తగ్గిస్తే పొదుపు సాధ్యమని నిపుణుల చెబుతున్నారు. కాబట్టి పొదుపు మంత్రం పాటించాలంటే ఎలాంటి ఖర్చులను తగ్గించుకోవాలో? ఓ సారి తెలుసుకుందాం.

బడ్జెట్‌ను రూపొందించడం

పొదుపు వైపు గణనీయమైన పురోగతి సాధించే ముందు మీరు డబ్బును ఎలా ఖరచ్చు చేస్తున్నారో? తెలుసుకోవాలి. ప్రణాళికాబద్ధమైన బడ్జెట్ మీ ఆదాయాన్ని, మీ ఖర్చులను గణనీయంగా ప్రభావితం చేస్తున్నారు. మీరు ఎక్కడ ఖర్చు తగ్గించుకోవాలో? తెలియజేస్తుంది. కాబట్టి డబ్బును ఆదా చేయాలంటే బడ్జెట్‌ నిర్వహణ తప్పనిసరి

ఖర్చును ట్రాక్‌ చేయడం

చిన్న చిన్న ఖర్చులు బడ్జెట్‌ చాలా వేగంగా ప్రభావితం చేస్తుంది. ముఖ్యంగా కిరాణా, గ్యాస్‌తో పాటు ఇతర అవసరాల కోసం ఖర్చు చేసిన ప్రతి రూపాయి రికార్డులను ఉంచుకోవాలి.  ఇది మీ ఖర్చు విధానాన్ని గుర్తించడంతో పాటు అనవసరమైన ఖర్చులను గుర్తించడంలో మీకు సహాయం చేస్తుంది. 

ఇవి కూడా చదవండి

ఆహారంపై ఆదా 

ఖర్చులను ఆదా చేయడానికి మీ భోజనం కూడా కీలకపాత్ర పోషిస్తుంది. ముఖ్యంగా బయట ఆహారాన్ని తీసుకోకుండా ఉంటే మేలు. అలాగే కూరగాయలు వంటి రైతు బజార్లలో కొనుగోలు చేయడం ద్వారా ఖర్చును ఆదా చేసుకోవచ్చు.

అనవసరమైన సబ్‌స్క్రిప్షన్‌లు

మీరు నిజంగా ఉపయోగించే సబ్‌స్క్రిప్షన్‌లను విశ్లేషించాలి. అనవసరంగా బావించే ఇతర వాటికి దూరంగా ఉండాలి. ఉదాహరణకు కేబుల్ సబ్‌స్క్రిప్షన్‌లను చౌకైన స్ట్రీమింగ్ సేవల ద్వారా భర్తీ చేయవచ్చు. చాలా మంది వ్యక్తులు అరుదుగా ఉపయోగించే జిమ్ మెంబర్‌షిప్‌ల కోసం చెల్లిస్తారు. కాబట్టి రన్నింగ్ లేదా హోమ్ వర్కౌట్‌ల ద్వారా జిమ్‌ ఖర్చు నుంచి తప్పించుకోవచ్చు.

షాపింగ్ 

కొనుగోలు చేయడానికి ముందు ఎల్లప్పుడూ ధరలను సరిపోల్చాలి. ముఖ్యంగా పెద్ద కొనుగోళ్ల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. కిరాణా షాపింగ్ చేసేటప్పుడు మీ జాబితాకు కట్టుబడి ఉండాలి. ముఖ్యంగా కూపన్‌లను ఉపయోగించుకోవడం ద్వారా అనవసరం ఖర్చు నుంచి బయటపడవచ్చు.  

యుటిలిటీ బిల్లులు

మీరు మీ విద్యుత్ లేదా నీటి వినియోగ బిల్లులపై కూడా డబ్బు ఆదా చేసుకోవచ్చు. ఉపయోగంలో లేనప్పుడు లైట్లను ఆఫ్ చేయాలి. ఎలక్ట్రానిక్స్‌ను అన్‌ప్లగ్ చేయండి. 

రుణాన్ని చెల్లించడం

మీరు ఎంత ఎక్కువ కాలం రుణాన్ని కలిగి ఉంటే అంత ఎక్కువ వడ్డీని చెల్లిస్తారు. అప్పులు చెల్లించడానికి ప్రాధాన్యత ఇవ్వడం వల్ల దీర్ఘకాలంలో మీకు గణనీయమైన డబ్బు ఆదా అవుతుంది. 

రవాణాలో ఆదా

ప్రజా రవాణా ఎంపికలను ద్వారా మన ఖర్చులను ఆదా చేసుకోవచ్చు. అంటే క్యాబ్‌లో ఒంటరిగా వెళ్లడం కంటే మెట్రోలో ప్రయాణించాలి. సర్‌చార్జి ఎక్కువగా ఉన్నప్పుడు వెళ్లే బదులు సర్‌చార్జ్ తక్కువగా ఉన్నప్పుడు ప్రయాణాలు చేయాలి.

పొదుపు 

వారం, నెల, రోజుల ప్రాతిపదికన కచ్చితంగా కొంత సొమ్మును పొదుపు చేయాలి. ఇలా పొదుపు చేయడం వల్ల దీర్ఘకాలంలో మీకు ప్రయోజనం చేకూరుతుంది. 

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..