Money Management: అప్పులు పెరిగి పోతున్నాయా? అయితే ఈ తప్పులు చేయకండి.. మీ సేవింగ్స్‌ను గణనీయంగా పెంచే టిప్స్ ఇవి.. మిస్ కావొద్దు..
భవిష్యత్తులో అత్యవసర పరిస్థితుల్లో ఆదుకోడానికి కొంత సేవింగ్స్ చేసుకోవడం ముఖ్యం. అందుకోసం ప్రజలు తమ పొదుపులను పెంచుకోవడంపై దృష్టి సారించాలి. పన్ను ఆదా వ్యూహాలను అవలంభించాలి. ఖర్చులను తగ్గించడంతో పాటు ఆదాయాన్నిపెంచడంలో సహాయపడే స్మార్ట్ పెట్టుబడి వ్యూహాలను ఎంచుకోవాలి. లేకపోతే ఇబ్బందులు తప్పవు. పొదుపు కోసం ఉపయోగపడే అలాంటి టిప్స్ మీ కోసం..
డబ్బులు పొదుపు అనేది ప్రతి ఒక్కరికీ అవసరమే. అది వ్యక్తిగతంగా అయినా.. కుటుంబ పరంగా అయినా.. నెలవారీ సంపాదన నుంచి తప్పనిసరిగా కొంత మొత్తాన్ని పొదుపు చేయాల్సిందే. లేకుంటే అత్యవసర సమయాల్లో ఇబ్బందులు తప్పవు. అలాగే భవిష్యత్తులో అవస్థలు తప్పవు. అయితే ఇటీవల కాలంలో మన దేశంలోని కుటుంబాలు అప్పుల్లో కూరుకుపోతున్నాయి. ఫలితంగా కుటుంబాల నికర పొదుపు తగ్గిపోతోంది. ఇది ఎవరో చెబుతోంది కాదు.. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నివేదించిన విషయం. ఈఏడాది మార్చితో ముగిసిన ఆర్థిక సంవత్సరంలో గృహ ఆర్థిక ఆస్తులు స్థూల జాతీయోత్పత్తిలో 5.1 శాతానికి తగ్గాయని పేర్కొంది. ఇది 2007 ఆర్థిక సంవత్సరం తర్వాత అత్యంత కనిష్ట స్థాయి అని పేర్కొంది. పెరుగుతున్న ద్రవ్యోల్బణం, ప్రజలు తమ లక్ష్యాలను చేరుకోవడానికి ఉత్తమ మార్గాలు వెతుకుతున్నారనడానికి ఇది నిదర్శనంగా ఉంటుంది. ఏది ఏమైనప్పటికీ భవిష్యత్తులో అత్యవసర పరిస్థితుల్లో ఆదుకోడానికి కొంత డబ్బు సేవింగ్స్ చేసుకోవడం ముఖ్యం. అందుకోసం ప్రజలు తమ పొదుపులను పెంచుకోవడంపై దృష్టి సారించాలి. పన్ను ఆదా వ్యూహాలను అవలంభించాలి. ఖర్చులను తగ్గించడంతో పాటు ఆదాయాన్నిపెంచడంలో సహాయపడే స్మార్ట్ పెట్టుబడి వ్యూహాలను ఎంచుకోవాలి.
మీ ఖర్చులను ట్రాక్ చేయండి.. మీ సంపాదన మొత్తం ఎటు వెళ్తుందో తెలుసుకోడానికి మీ ఆదాయంతో పాటు మీ ఖర్చులను ట్రాక్ చేయడం ముఖ్యం. మీ ఆదాయం, ఖర్చులను స్పష్టంగా వివరించే నెలవారీ బడ్జెట్‌ను రూపొందించండి. ఇది పొదుపు కోసం కొంత భాగాన్ని ఆదా చేయడంలో సహాయపడుతుంది.
అదనపు ఖర్చులను తగ్గించండి.. రోజువారీ ఖర్చులు ప్రజల జీవితంలో ఒక భాగమైనప్పటికీ, ప్రతి ఖర్చు ముఖ్యమైనది కాదు. అందువల్ల మీకు నిజంగా అవసరం లేని వాటిపై వారి డబ్బును వృథా చేయడం మానేయాలి. అలాంటి ఖర్చులు ఏమున్నాయో జాబితా చేసుకోవాలి. అప్పుడు డబ్బును ఆదా చేసుకొనే వీలుంటుంది.
సేవింగ్స్ ను వేరే ఖాతాలోకి మార్చేయండి.. మీ ఆదాయంలో గణనీయమైన మొత్తాన్ని ప్రత్యేక ఖాతాలోకి బదిలీ చేసే అలవాటును ఆచరించడం కూడా మీ సేవింగ్స్ ను పెంచడంలో సహాయపడుతుంది. మీరు ప్రతి నెలా మీ ఆదాయంలో కొంత భాగాన్ని ఆదా చేసేలా ఆటోమేటిక్ ట్రాన్స్‌ఫర్ సిస్టమ్‌ని సెటప్ చేయడం ద్వారా దీన్ని చేయవచ్చు.
అత్యవసర నిధి అవసరం.. మీరు సంపాదన మొత్తం నుంచి కొంత మొత్తాన్ని అత్యవసర నిధికి మళ్లించాలి. కనీసం 6 నెలలు వారి ఖర్చులను కవర్ చేయడానికి సహాయపడే నగదు ఎల్లప్పుడూ అత్యవసర నిధి పేరిట ఉండాలి.
పెట్టుబడులు.. ఫిక్స్‌డ్ డిపాజిట్లు, మ్యూచువల్ ఫండ్‌లు, పీపీఎఫ్ వంటి వివిధ మార్గాలలో అవసరమైన పెట్టుబడులు పెట్టాలి. ఇవి మంచి కార్పస్‌ను నిర్మించడానికి అత్యంత ప్రభావవంతమైన మార్గాలు. ఈ పెట్టుబడులు అదనపు వడ్డీతో పాటు పెద్ద మొత్తంలో నిధులను కూడగట్టుకోవడానికి సహాయపడతాయి.
అప్పులను తగ్గించండి.. పాత అప్పులను క్రమమైన వ్యవధిలో చెల్లించడం ద్వారా వాటిని తగ్గించడానికి ప్రయత్నించండి. క్రెడిట్ కార్డ్ బిల్లులు లేదా ఇతర అధిక-వడ్డీ రుణాలను క్లియర్ చేయడం ద్వారా దీన్ని చేయవచ్చు.
మీ ఆదాయాన్ని పెంచుకోండి.. పొదుపు చేయడం, ఖర్చులను తగ్గించుకోవడం, మీ నిధులను పెట్టుబడి పెట్టడంతోపాటు, పార్ట్‌టైమ్ ఉద్యోగం, ఫ్రీలాన్సింగ్ ఉద్యోగం లేదా చిన్న వ్యాపారాన్ని ప్రారంభించడం ద్వారా వారి ఆదాయాన్నిపెంచుకోవడానికి కూడా కృషి చేయాలి.
ఈ అంశాలన్నింటినీ పరిగణనలోకి తీసుకుంటూనే ఒక వ్యక్తిగత క్రమశిక్షణతో పాటు ప్రణాళికాబద్ధమైన వ్యూహాన్ని అనుసరించడం ద్వారా సేవింగ్స్ ను పెంచుకోవచ్చు.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..