Honda Activa: మార్కెట్లోకి సరికొత్త యాక్టివా.. స్మార్ట్ ఫీచర్లతో.. అతి తక్కువ ధరలోనే.. పరిమిత కాలమే.. త్వరపడండి..
ప్రముఖ ద్విచక్ర వాహనాల తయారీదారు హోండా మోటార్ సైకిల్ అండ్ స్కూటర్ ఇండియా లిమిటెడ్ మరో కొత్త స్కూటర్ ను లాంచ్ చేసింది. కొత్త లిమిటెడ్ ఎడిషన్ యాక్టివాను భారతీయ మార్కెట్లోకి విడుదల చేసింది. దీని ధరను రూ. 80,734గా పేర్కొంది. రానున్న దసరా, దీపావళి పండుగల నేపథ్యంలో సేల్స్ పెంచుకునేందుకు వ్యూహాత్మకంగా ఈ కొత్త మోడల్ ను హోండా లాంచ్ చేసింది.

పండుగ సీజన్లో కొత్త వాహనాల పరంపర కొనసాగుతోంది. ఇప్పటికే పలు కంపెనీలు తమ ఉత్పత్తుల లాంచ్ డేట్ లు ప్రకటించగా.. ఇప్పుడు ప్రముఖ ద్విచక్ర వాహనాల తయారీదారు హోండా మోటార్ సైకిల్ అండ్ స్కూటర్ ఇండియా లిమిటెడ్ మరో కొత్త స్కూటర్ ను లాంచ్ చేసింది. కొత్త లిమిటెడ్ ఎడిషన్ యాక్టివాను భారతీయ మార్కెట్లోకి విడుదల చేసింది. దీని ధరను రూ. 80,734గా పేర్కొంది. రానున్న దసరా, దీపావళి పండుగల నేపథ్యంలో సేల్స్ పెంచుకునేందుకు వ్యూహాత్మకంగా ఈ కొత్త మోడల్ ను హోండా లాంచ్ చేసింది. కాగా ఇంతకు ముందే హోండా ఎస్పీ 125 స్పోర్ట్ ఎడిషన్ ను పరిచయం చేయగా ఇప్పుడు హోండా యాక్టివాను తీసుకొచ్చింది. ఈ రెండు కొత్త బైక్ లు పరిమిత కాలం వరకే అందుబాటులో ఉండనున్నాయి. ఈ నేపథ్యంలో దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం..
కొత్త లిమిటెడ్ ఎడిషన్ యాక్టివాలో ఏముంటుంది..
ఈ కొత్త ఎడిషన్ యాక్టివాలో కూడా ఇప్పటికే ఇంజిన్ నే వాడారు. బీఎస్6.2 కంప్లైంట్ 109.51సీసీ సింగిల్ సిలెండర్ ఇంజిన్ ఉంటుంది. ఇది 8.90 ఎన్ఎం టార్క్, 7.37బీహెచ్పీ శక్తిని అందిస్తుంది. అయితే ఇది రెండు కొత్త రంగుల్లో అందుబాటులోకి వస్తుంది. మ్యాటే స్టీల్ బ్లాక్ మెటాలిక్, పెరల్ సైరెన్ బ్లూ కలర్ ఆప్షన్లలో అందుబాటులోకి వచ్చింది. కొత్త అల్లాయ్ వీల్స్ ఉంటాయి. అధిక స్పెసిఫికేషన్లు ఉండే డీఎల్ఎక్స్ వేరియంట్ మాదిరిగా ఇది ఉంటుంది. ఈ కొత్త ఎడిషన్ హోండా యాక్టివాలో సరికొత్త స్మార్ట్ కీ ఆప్షన్ కూడా ఉంది.
ఎప్పుడు కొనుగోలు చేయొచ్చు..
హోండా యాక్టివా లిమిటెడ్ ఎడిషన్ స్కూటర్ కు సంబంధించిన ప్రీ బుకింగ్స్ ప్రారంభమయ్యాయి. హోండా రెడ్ వింగ్ డీలర్ షిప్స్ ద్వారా దేశ వ్యాప్తంగా అందుబాటులోకి వస్తుంది. అయితే ఈ స్కూటర్ పరిమిత కాలం వరకూ అందుబాటులో ఉంటుందన్న విషయాన్ని వినియోగదారులు గుర్తుంచుకోవాలి.
యువ వినియోగదారులే లక్ష్యం..
యువ వినియోగదారులే లక్ష్యంగా ఈ కొత్త ఎడిషన్ యాక్టివాలను లాంచ్ చేశామని హోండా మోటార్ సైకిల్ అండ్ స్కూటర్ ఇండియా మేనేజింగ్ డైరెక్టర్, ప్రెసిడెంట్ అండ్ సీఈఓ సుట్సుము ఒటాని చెప్పారు. అలాగే అన్ని వయసుల వారికి ఉపయోగపడేలా దీనిని తీర్చిదిద్దామన్నారు. ఇది దేశంలోనే అందరూ ఇష్టపడే స్కూటర్ గుర్తు చేశారు. అదే విధంగా హోంటా మోటార్ సైకిల్ అండ్ స్కూటర్ ఇండియా సేల్స్ అండ్ మార్కెటింగ్ డైరెక్టర్ యోగేష్ మథుర్ మాట్లాడుతూ తమ కొత్త యాక్టివా లిమిటెడ్ ఎడిషన్ స్టైకింగ్ లుక్స్, స్మార్ట్ అడ్వాన్స్ ఫీచర్లు, అధిక పనితీరు కలిగిన ఇంజిన్ తో ఈ ఫెస్టివ్ సీజన్ కు ముందే ఆవిష్కరించడం ఆనందంగా ఉందన్నారు.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..