AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Svitch CSR 762: ‘స్విచ్‌’తో మార్కెట్ షిఫ్ట్ అవడం ఖాయం.. కొత్త ఎలక్ట్రిక్ బైక్.. లాంచింగ్‌కు ముహూర్తం ఫిక్స్..

స్విచ్ మోటో కార్ప్(Svitch MotoCorp) తన మొదటి ఎలక్ట్రిక్ మోటార్ సైకిల్ ను లాంచ్ చేసేందుకు ఏర్పాట్లు చేస్తోంది. స్విచ్ సీఎస్ఆర్ 762 పేరిట దీనిని రానున్న 90 రోజుల్లో మన దేశీయ మార్కెట్లోకి తీసుకొచ్చేందుకు ముమ్మర కసరత్తు చేస్తోంది. ఈ మోటార్‌సైకిల్‌ను దాదాపు రెండు సంవత్సరాల క్రితం ప్రదర్శించారు. వాస్తవానికి 2022 ఆగస్టులోనే దీనిని మార్కెట్లోకి తీసుకురావాల్సి ఉంది.

Svitch CSR 762: ‘స్విచ్‌’తో మార్కెట్ షిఫ్ట్ అవడం ఖాయం.. కొత్త ఎలక్ట్రిక్ బైక్.. లాంచింగ్‌కు ముహూర్తం ఫిక్స్..
Svitch Csr 762 Electric Bike
Madhu
| Edited By: |

Updated on: Oct 23, 2023 | 11:30 AM

Share

మన దేశంలో ఎలక్ట్రిక్ వాహనాలకు డిమాండ్ పెరుగుతోంది. నెమ్మదిగా ఈ వాహనాలు మార్కెట్ లో తన ముద్ర వేస్తున్నాయి. ఇప్పటికే ఈ శ్రేణి ద్విచక్ర వాహనాలు సేల్స్ లో అదరగొడుతున్నాయి. ముఖ్యంగా ఎలక్ట్రిక్ స్కూటర్లు సంప్రదాయ ఇంధన స్కూటర్లకు పోటీగా నిలబడుతున్నాయి. దీంతో ఎలక్ట్రిక్ బైక్ లు కూడా పెద్ద ఎత్తున లాంచ్ అయ్యేందుకు సిద్ధమవుతున్నాయి. పలు కంపెనీలు ఇప్పటికే తమ ఉత్పత్తులను లాంచ్ చేసేందుకు కసరత్తు చేస్తున్నాయి. ఇదే క్రమంలో స్విచ్ మోటో కార్ప్(Svitch MotoCorp) తన మొదటి ఎలక్ట్రిక్ మోటార్ సైకిల్ ను లాంచ్ చేసేందుకు ఏర్పాట్లు చేస్తోంది. స్విచ్ సీఎస్ఆర్ 762 పేరిట దీనిని రానున్న 90 రోజుల్లో మన దేశీయ మార్కెట్లోకి తీసుకొచ్చేందుకు ముమ్మర కసరత్తు చేస్తోంది. ఈ మోటార్‌సైకిల్‌ను దాదాపు రెండు సంవత్సరాల క్రితం ప్రదర్శించారు. వాస్తవానికి 2022 ఆగస్టులోనే దీనిని మార్కెట్లోకి తీసుకురావాల్సి ఉంది. అయితే, అహ్మదాబాద్‌కు చెందిన ఈ స్టార్టప్‌కు టెక్నాలజీ సంబంధించి కొన్ని అవరోధాలు ఎదురయ్యాయి. దీంతో అది వాయిదా పడుతూ వచ్చింది. ఎట్టకేలకు దీనిని అరంగేట్రానికి మూహుర్తం ఫిక్స్ అవుతోంది. ఈ నేపథ్యంలో ఈ స్విచ్ సీఎస్సార్ 762 ఎలక్ట్రిక్ బైక్ పూర్తి స్పెసిఫికేషన్లు చూద్దాం..

రూ. 100 కోట్లకు పైగా పెట్టుబడి..

ఈ ఎలక్ట్రిక్ మోటార్‌సైకిల్ అభివృద్ధి కోసం 100 కోట్ల రూపాయలకు పైగా పెట్టుబడులు వచ్చినట్లు కంపెనీ పేర్కొంది. ఇదే విషయంపై స్విచ్ మోటోకార్ప్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ చింతన్ ఖత్రి మాట్లాడుతూ, “ఈ ప్రాజెక్ట్ మేక్ ఇన్ ఇండియా” పట్ల మా అంకితభావాన్ని ప్రదర్శిస్తుంది. దేశ ఆర్థిక వృద్ధికి దోహదపడుతుంది.”

ఇవి కూడా చదవండి

స్విచ్ సీఎస్సార్ 762 ఎలక్ట్రిక్ బైక్ హైలైట్స్..

  • ఈ ఎలక్ట్రిక్ బైక్ లో 10 బీహెచ్ పీ, 55ఎన్ఎం టార్క్ అందించే 3కేడబ్ల్యూ ఎలక్ట్రిక్ మోటారు ఉంటుంది. 3.7 కేడబ్ల్యూహెచ్ సామర్థ్యంతో స్వాపబుల్ బ్యాటరీలు ఉంటాయి. వీటిని సింగిల్ చార్జ్ పై 120 కిలోమీటర్ల పరిధిని అందిస్తాయి.
  • వీల్‌బేస్ 1,430 మిమీ, 780 మిల్లీమీటర్ల సీటు ఎత్తుతో, ఇది భారతీయ ప్రజలకు అందుబాటులో ఉండే మోటార్‌సైకిల్‌గా ఉంటుంది. అంతేకాకుండా, ఈ బైక్లో 6 రైడింగ్ మోడ్‌లు ఉంటాయి. అలాగే, పెరిగిన ప్రాక్టికాలిటీ కోసం బ్యాటరీ మార్పిడి జాయింట్‌లను సెటప్ చేయడానికి స్టార్టప్ ఆసక్తిగా ఉంది.
  • ఫీచర్ల పరంగా, సీఎస్సార్ 762 అంతర్నిర్మిత మొబైల్ చార్జర్, కవర్ మొబైల్ హోల్డర్ , 40 లీటర్ బూట్ స్పేస్‌తో వస్తుంది. చెన్నై, హైదరాబాద్, బెంగళూరులలో నాలుగు ప్రత్యేక షోరూమ్‌లను ఏర్పాటు చేసినట్లు స్విచ్ పేర్కొంది. వినియోగదారుల కోసం బ్యాటరీ మార్పిడి మౌలిక సదుపాయాలకు కూడా నెట్‌వర్క్ మద్దతు ఇస్తుంది.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

రుచితోపాటు అమోఘమైన పోషకాలు దాగి ఉన్న ఈ పండు గురించి తెలుసా?
రుచితోపాటు అమోఘమైన పోషకాలు దాగి ఉన్న ఈ పండు గురించి తెలుసా?
రాగి బాటిల్ vs గ్లాస్ బాటిల్.. మంచి నీళ్లు తాగడానికి ఏది బెస్ట్?
రాగి బాటిల్ vs గ్లాస్ బాటిల్.. మంచి నీళ్లు తాగడానికి ఏది బెస్ట్?
భుజంపై తాబేలుతో పోజులిచ్చిన బిగ్‌బాస్ బ్యూటీ.. ఫొటోస్ ఇదిగో
భుజంపై తాబేలుతో పోజులిచ్చిన బిగ్‌బాస్ బ్యూటీ.. ఫొటోస్ ఇదిగో
పెట్రోల్‌, డీజిల్‌ కారు ఉన్నవారికి ఫ్రీగా రూ.50 వేలు!
పెట్రోల్‌, డీజిల్‌ కారు ఉన్నవారికి ఫ్రీగా రూ.50 వేలు!
తెల్లటి బియ్యాన్ని దానం చేయడం వల్ల కలిగే ఈ 5 అద్భుత ప్రయోజనాలు
తెల్లటి బియ్యాన్ని దానం చేయడం వల్ల కలిగే ఈ 5 అద్భుత ప్రయోజనాలు
చలికాలంలో ఒంటి నొప్పులు ఎక్కువగా ఉంటున్నాయా?.. ఇదే కారణం..
చలికాలంలో ఒంటి నొప్పులు ఎక్కువగా ఉంటున్నాయా?.. ఇదే కారణం..
ఈ కంపెనీ అద్భుతాలు చేసింది.. ఇక మొత్తం కంప్యూటర్‌ కీబోర్డ్‌లోనే..
ఈ కంపెనీ అద్భుతాలు చేసింది.. ఇక మొత్తం కంప్యూటర్‌ కీబోర్డ్‌లోనే..
OTTలో ఒళ్లు గగుర్పొడిచే హారర్ థ్రిల్లర్.. ధైర్యముంటేనే చూడండి
OTTలో ఒళ్లు గగుర్పొడిచే హారర్ థ్రిల్లర్.. ధైర్యముంటేనే చూడండి
కోనసీమ.. చమురు బావుల కింద కుంగాల్సిందేనా?
కోనసీమ.. చమురు బావుల కింద కుంగాల్సిందేనా?
నేపాల్‌లో మత ఘర్షణలు.. సోషల్ మీడియా చిచ్చుతో బిర్గుంజ్‌లో కర్ఫ్యూ
నేపాల్‌లో మత ఘర్షణలు.. సోషల్ మీడియా చిచ్చుతో బిర్గుంజ్‌లో కర్ఫ్యూ