BGauss EV scooter : అందుబాటులోకి సరికొత్త ఈవీ స్కూటర్.. ఓ సారి చార్జ్ చేస్తే సూర్యపేట నుంచి హైదరాబాద్‌కు వెళ్లిపోవచ్చు..
ఎలక్ట్రిక్ ఉపకరణాల పరిశ్రమలో ప్రసిద్ధి చెందిన బిగాస్(BGAUSS) తన సరికొత్త ఎలక్ట్రిక్ స్కూటర్ సీ 12ను లాంచ్ చేస్తూ ఆటోమొబైల్ మార్కెట్లోకి గ్రాండ్ ఎంట్రీ ఇచ్చింది. కొత్త స్కూటర్ ఆకట్టుకునే రేంజ్, విశాలమైన ట్రంక్ స్పేస్, స్టైలిష్ డిజైన్‌తో పాటు సౌకర్యవంతమైన డ్రైవింగ్ అనుభవంతో వస్తుంది.

ప్రస్తుతం ఇండియాలో ఈవీ వాహనాల మార్కెట్ విపరీతంగా దూసుకుపోతుంది. ఈ మార్కెట్‌లో తమ మార్క్ చూపించడానికి వివిధ కంపెనీ కొత్త ఈవీ మోడల్స్‌ను ప్రవేశపెడుతున్నాయి. తాజాగా ఎలక్ట్రిక్ ఉపకరణాల పరిశ్రమలో ప్రసిద్ధి చెందిన బిగాస్(BGAUSS) తన సరికొత్త ఎలక్ట్రిక్ స్కూటర్ సీ 12ను లాంచ్ చేస్తూ ఆటోమొబైల్ మార్కెట్లోకి గ్రాండ్ ఎంట్రీ ఇచ్చింది. కొత్త స్కూటర్ ఆకట్టుకునే రేంజ్, విశాలమైన ట్రంక్ స్పేస్, స్టైలిష్ డిజైన్‌తో పాటు సౌకర్యవంతమైన డ్రైవింగ్ అనుభవంతో వస్తుంది. కేవలం రూ. 97,999 బిగాస్ సీ 12 వినియోగదారులకు అందుబాటులో ఉంటుంది. ఫైనాన్సింగ్ పరంగా రూ.2,775 ప్రారంభ డిపాజిట్‌తో స్కూటర్‌ను సొంతం చేసుకోవచ్చు. అయితే బుకింగ్ కోసం తక్షణం రూ.499 చెల్లించాల్సి ఉంటుంది. లాంచ్ ఈవెంట్ సందర్భంగా, బిగాస్ భద్రత, నాణ్యత మరియు విశ్వసనీయత పట్ల తన నిబద్ధతను పేర్కొంది. ఎలక్ట్రిక్ వాహనాల రంగంలో తాము కూడా సీ12 ద్వారా ఓ ముఖ్యమైన అడుగు వేస్తున్నట్లు కంపెనీ ప్రతినిధులు పేర్కొన్నారు.
బిగాస్ సీ 12 ఫీచర్లు ఇవే
బిగాస్‌లో డీ15, ఏ2, బీ8 అనే మరో మూడు ఎలక్ట్రిక్ స్కూటర్లు ఉన్నాయి. కంపెనీ సరికొత్తగా ఎలక్ట్రిక్ స్కూటర్ బిగాస్ సీ12ని విడుదల చేసింది. రిమూవబుల్ బ్యాటరీతో వచ్చే ఈ స్కూటర్ బరువు 109 కిలోలుగా ఉంటుంది. అలాగే ఓ సారి చార్జి చేస్తే 143 కిలో మీటర్ల మైలెజ్ వస్తుందని కంపెనీ ప్రతినిధులు చెబుతున్నారు. గంటలకు గరిష్టంగా 50 కిలో మీటర్లతో వెళ్లుతుంది. ఎల్లో టెక్నో, రెడ్ బ్లాక్, పెర్ల్ వైట్, ఫోలేజ్ గ్రీన్, షైనీ సిల్వర్, మాట్ బ్లాక్ వంటి బహుళ రంగు ఎంపికల లభ్యతతో, స్కూటర్ కొనుగోలుదారుల దృష్టిని ఆకర్షించడం ఖాయమని కంపెనీ వర్గాలు ధీమా వ్యక్తం చేస్తున్నాయి.



మరిన్ని బిజినెస్ వార్తల కోసం..




