AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

New Income Tax rules: ఏప్రిల్ ఒకటిన విడుదల.. పన్ను చెల్లింపుదారులు తెలుసుకోవాల్సిన ప్రధాన అంశాలివి..

ఏప్రిల్ ఒకటో తేదీ నుంచి కొత్త ఆర్థిక సంవత్సరం మొదలవుతోంది. ఈ నేపథ్యంలో కొన్ని నిబంధనలు మారుతుంటాయి. కొన్ని పరిమితులు పెరుగుతుంటాయి, తగ్గుతుంటాయి.. వాటి గురించి కనీస అవగాహన ఉండటం అవసరం.

New Income Tax rules: ఏప్రిల్ ఒకటిన విడుదల.. పన్ను చెల్లింపుదారులు తెలుసుకోవాల్సిన ప్రధాన అంశాలివి..
Taxpayers
Madhu
|

Updated on: Mar 17, 2023 | 4:30 PM

Share

ఈ మార్చితో ఆర్థిక సంవత్సరం ముగుస్తోంది. ఏప్రిల్ ఒకటో తేదీ నుంచి కొత్త ఆర్థిక సంవత్సరం మొదలవుతోంది. ఈ నేపథ్యంలో కొన్ని నిబంధనలు మారుతుంటాయి. కొన్ని పరిమితులు పెరుగుతుంటాయి, తగ్గుతుంటాయి.. వాటి గురించి కనీస అవగాహన ఉండటం అవసరం. ప్రధానంగా ప్రతిపాదిత ఆర్థిక బిల్లు అమల్లోకి వచ్చినప్పుడు ఆదాయపు పన్ను నిబంధనలలో మార్పుల గురించి ముందుగానే తెలుసుకోవడం ముఖ్యం. ఇది మన పోర్ట్‌ఫోలియోను చక్కగా నిర్వహించడానికి అవసరమైన మార్పులను చేసుకోవడానికి ఉపకరిస్తుంది. ఈ నేపథ్యంలో 2023 బడ్జెట్‌లో చేసిన ప్రతిపాదనల ఆధారంగా ఏప్రిల్ 1 నుండి అమలు కానున్న కొన్ని కొత్త పన్ను నియమాలను నిపుణులు చెబుతున్నారు. అవేంటో ఓ సారి చూద్దాం..

వేతన ఉద్యోగులకు టీడీఎస్ తగ్గింపు

కొత్త పన్ను విధానం ఏప్రిల్ 1 నుండి ప్రారంభమవుతుంది. ఫలితంగా జీతాల ద్వారా వచ్చే ఆదాయం కలిగిన పన్ను చెల్లింపుదారులు టీడీఎస్ లో తగ్గింపును పొందుతారు. రూ. 7,00,000 కంటే తక్కువ ఆదాయాన్ని కలిగి ఉన్న వారు కొత్త పన్ను విధానాన్ని ఎంచుకుంటే.. ఆదాయపు పన్ను చట్టం, 1961 సెక్షన్ 87ఏ కింద అందించిన అదనపు రాయితీ వర్తిస్తుంది. దీని కారణంగా టీడీఎస్ కత్తిరింపులుండవు. అలాగే పన్ను పరిధిలోకి వచ్చే ఆదాయం రూ. 5 కోట్లకు మించిన వ్యక్తులకు, కొత్త పన్ను విధానంలో వర్తించే సర్‌ఛార్జ్ 37 శాతం నుంచి 25 శాతానికి తగ్గింది. మొత్తం మీద కొత్త పన్ను విధానాన్ని ఎంచుకునే పన్ను చెల్లింపుదారులకు కొంత ఉపశమనం లభించవచ్చు.

దీనిపై పన్ను లేదు.. బంగారాన్ని ఎలక్ట్రానిక్ గోల్డ్ రసీదు (ఈజీఆర్)గా మార్చడంపై పన్ను విధించబడదు. SEBI-నమోదిత వాల్ట్ మేనేజర్ ద్వారా బంగారాన్ని ఉచితంగా ఈజీఆర్ గా మార్చుకోవచ్చు.

ఇవి కూడా చదవండి

దీనిపై కూడా టీడీఎస్ మినహాయింపు..

ఆదాయ పన్ను చట్టంలోని సెక్షన్ 193లోని నిబంధన ప్రకారం నిర్దిష్ట సెక్యూరిటీలపై వడ్డీ చెల్లింపునకు సంబంధించి టీడీఎస్ నుంచి మినహాయింపును అందిస్తుంది. పైన పేర్కొన్న సెక్షన్‌లోని నిబంధన (ix) ప్రకారం, కంపెనీ జారీ చేసిన ఏదైనా సెక్యూరిటీపై చెల్లించాల్సిన వడ్డీ విషయంలో ఇలాంటి పన్ను మినహాయింపును అందిస్తుంది, అటువంటి సెక్యూరిటీ డీమెటీరియలైజ్డ్ రూపంలో ఉంటుంది. అంతేకాక ఇది గుర్తింపు పొందిన స్టాక్ ఎక్స్ఛేంజ్‌ జాబితాలో ఉంటుంది. అయితే, ఏప్రిల్ నుండి, ఈ మినహాయింపు తొలగిపోనుంది. జాబితా చేయబడిన డిబెంచర్లతో సహా అన్ని వడ్డీ చెల్లింపులపై 10 శాతం టీడీఎస్ వర్తిస్తుంది.

ఆన్‌లైన్ గేమ్‌ల విజయాలపై.. ఆదాయ పన్ను చట్ట కొత్త సెక్షన్ 115BBJ నిబంధనల ప్రకారం ఆన్‌లైన్ గేమ్‌ల నుండి గెలుపొందిన వాటిపై పన్ను విధించబడుతుంది. 30 శాతం పన్ను వర్తిస్తుంది.

కొన్ని పరిమితులు..

కొత్త ఆర్థిక సంవత్సరం నుంచి ఆదాయ పన్ను చట్టం సెక్షన్ 54, 54F నిబంధనల ప్రకారం రూ. 10 కోట్ల వరకు లాభాలు మాత్రమే మినహాయించబడతాయి. బ్యాలెన్స్ క్యాపిటల్ గెయిన్స్, అంటే రూ. 10 కోట్ల కంటే ఎక్కువ, ఇప్పుడు 20 శాతం ఫ్లాట్ రేట్ (ఇండెక్సేషన్‌తో) పన్ను విధించబడుతుంది. మూలధన లాభాల నుంచి వచ్చే ఆదాయంపై వర్తించే గరిష్ట సర్‌ఛార్జ్ 15 శాతానికి పరిమితం మైంది.

సెక్షన్ 54 ప్రకారం పన్ను చెల్లింపుదారు తన నివాస గృహాన్ని విక్రయించి, అమ్మకం ద్వారా వచ్చిన ఆదాయం నుండి మరొక నివాస గృహాన్ని పొందేవారికి పన్ను ప్రయోజనం ఇవ్వబడుతుంది. సెక్షన్ 54F కింద ఇంటి ఆస్తి కాకుండా ఇతర మూలధన ఆస్తిని విక్రయించడం ద్వారా పొందిన దీర్ఘకాలిక మూలధన లాభాలపై పన్ను ప్రయోజనాలు ఇవ్వబడతాయి.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..