Best EV Scooters : భారత్‌లో వినియోగదారులను అందుబాటులో ఉన్న టాప్ ఎలక్ట్రిక్ స్కూటర్లు ఇవే.. మీరూ ఓ లుక్కేయ్యండి
భారతదేశంలోని ఈ అగ్రశ్రేణి ఎలక్ట్రిక్ స్కూటర్లు వాటి అధిక సామర్థ్యం, తక్కువ ఉద్గారాలతో జీరో మెయింటెనెన్స్ కావడం వల్ల వీటిని ఎక్కువ కొనుగోలు చేయడానికి ఇష్టపడుతున్నారు. ఇప్పుడు కొత్తగా ఎలక్ట్రిక్ స్కూటర్లు కొనుగోలు చేయాలనుకునేవారు చాలా ఇబ్బందిని ఎదుర్కొంటున్నారు.

భారతదేశంలో ఇటీవల కాలంలో పర్యావరణ అనుకూల ఎలక్ట్రిక్ స్కూటర్లు మార్కెట్‌లో భారీ వృద్ధిని సాధించాయి. ఎలక్ట్రిక్ స్కూటర్ సంప్రదాయ పెట్రోల్ బైక్‌ల కంటే అనేక ప్రయోజనాలను అందిస్తుంది. భారతదేశంలోని ఈ అగ్రశ్రేణి ఎలక్ట్రిక్ స్కూటర్లు వాటి అధిక సామర్థ్యం, తక్కువ ఉద్గారాలతో జీరో మెయింటెనెన్స్ కావడం వల్ల వీటిని ఎక్కువ కొనుగోలు చేయడానికి ఇష్టపడుతున్నారు. ఇప్పుడు కొత్తగా ఎలక్ట్రిక్ స్కూటర్లు కొనుగోలు చేయాలనుకునేవారు చాలా ఇబ్బందిని ఎదుర్కొంటున్నారు. ఎందుకంటే ఎక్కువ రకాల స్కూటర్ల ప్రస్తుతం అందుబాటులో ఉండడంతో కంపెనీ, నిర్వహణ, పనితీరు అంశాలను విశ్లేషించుకోవడంలో చాలా ఇబ్బంది పడుతున్నారు. ఈ కామర్స్ సైట్లు కూడా ఈ ఎలక్ట్రిక్ వాహనాల డెలివరీని ప్రారంభించడంతో వినియోగదారులకు వెసులుబాటు ఎక్కువగా ఉంటుంది. ముఖ్యంగా అమెజాన్ సైట్‌లో కొన్ని ఈవీ వెహికల్స్ అందుబాటులో ఉన్నాయి. సో ప్రస్తుతం ధర, ఫీచర్లను దృష్టిలో పెట్టుకుని సూపర్ ఎలక్ట్రిక్ స్కూటర్లను షార్ట్ లిస్ట్ చేశాం. అవేంటో మీరూ ఓ లుక్కేయ్యండి.
యుగ బైక్ ఎలక్ట్రిక్ స్కూటర్
ఈ స్కూటర్ రిమోట్, యాంటీ-థెఫ్ట్ అలారం సిస్టమ్‌తో అదనపు భద్రతా లక్షణాలతో కూడిన ఫైవ్ స్టార్ రేటింగ్ పొందింది. ఈ స్కూటర్ నడపడానికి డ్రైవింగ్ లైసెన్స్ అవసరం లేదు. ఈ స్కూటర్‌లో అద్భుతమైన బ్రేకింగ్ సిస్టమ్‌ను ఉంటుంది. ఫ్రంట్ డిస్క్ బ్రేక్‌తో వచ్చే ఈ స్కూటర్ ఓ సారి చార్జ్ చేస్తే 50 నుంచి 60 కిమీ మైలేజీని అందిస్తుంది. అలాగే ఈ స్కూటర్‌ను చార్జి చేయడానికి 3-4 గంటల సమయం పడుతుంది. ఈ స్కూటర్ ధర రూ.87,000గా ఉంది.
లార్డ్స్ జూమ్ ఎలక్ట్రిక్ స్కూటర్
ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ అండర్-సీట్ స్టోరేజ్‌తో పాటు లాకింగ్ సేఫ్టీతో వస్తుంది. ఇది భారతదేశంలోని అత్యుత్తమ ఎలక్ట్రిక్ స్కూటర్‌లలో ఒకటిగా నిలిచింది. ఇది మరింత ఆకర్షణీయంగా ఉండే ఎల్ఈడీ లైట్ ఫీచర్లతో పాటు ఫ్రంట్ డిస్క్ బ్రేక్‌లను కలిగి ఉంది.ఈ లార్డ్స్ జూమ్ ఎలక్ట్రిక్ స్కూటర్ 5 కంటే ఎక్కువ రంగులలో అందుబాటులో ఉంటుంది. డిజిటల్ డాష్‌బోర్డ్, రిమోట్ కీ తో పాటు 160 ఎంఎం గ్రౌండ్ క్లియరెన్స్‌తో వినియోగదారులను ఆకట్టుకుంటుంది. ఈ స్కూటర్ ధర రూ.75999గా కంపెనీ నిర్ణయించింది.



ఒకయా ఫ్రీడమ్ స్కూటర్
భారతదేశంలో తమ సొంత ఎలక్ట్రిక్ స్కూటర్‌ను ప్రారంభించిన ప్రముఖ బ్యాటరీ బ్రాండ్‌లలో ఒకయా ఒకటి. ఫ్రీడమ్ ఎలక్ట్రిక్ స్కూటర్ ఫ్రంట్ బ్రేక్, యాంటీ-థెఫ్ట్ అలారం, అధిక గ్రౌండ్ క్లియరెన్స్ వంటి అప్‌గ్రేడ్ భద్రతా ఫీచర్లతో వస్తుంది. ఇది ట్యూబ్‌లెస్ టైర్లు, తేలికైన రిమూవబుల్ బ్యాటరీతో వచ్చే అత్యుత్తమ ఎలక్ట్రిక్ స్కూటర్లలో ఒకటి. ఫోన్ ఛార్జింగ్ కోసం యూఎస్భీ పోర్ట్‌తో పాటు ఎల్ఈడీ లైట్లు, డిజిటల్ డిస్‌ప్లే, స్టీర్ రిమ్స్ వంటి స్టైలిష్ ఫీచర్‌లతో వినియోగదారులను ఆకట్టుకుంటుంది. ఈ స్కూటర్ ధర రూ.74,899.
రియో ఈవీ ఫ్యూచర్ ఎలక్ట్రిక్ స్కూటర్
రియో ఎలక్ట్రిక్ స్కూటర్ అనేది రిజిస్ట్రిషన్ అవసరం లేని స్కూటర్. అలాగే డ్రైవింగ్ చేయడానికి ఎలాంటి లైసెన్స్ అవసరం లేదు. ఒక్కసారి ఛార్జ్ చేస్తే 70-80 కి.మీ మైలేజ్ వస్తుంది. ఈ టాప్ ఎలక్ట్రిక్ స్కూటర్ 6 రంగులలో అందుబాటులో ఉంది. ఈ స్కూటర్‌ను వాణిజ్య వినియోగంలో కూడా ఉపయోగించవచ్చు. ఇది 180 కేజీల లోడింగ్ కెపాసిటీని కలిగి ఉంది. అలాగే ట్యూబ్‌లెస్ టైర్‌లతో వచ్చే ఈ స్కూటర్ ధర రూ.77,999గా కంపెనీ నిర్ణయించింది.
కైనటిక్ గ్రీన్ ఎలక్ట్రిక్ స్కూటర్
ఇది భారతదేశంలోని అత్యుత్తమ ఎలక్ట్రిక్ స్కూటర్లలో ఒకటి. ఈ స్కూటర్ రిమూవబుల్ బ్యాటరీతో రావడంతో ఇంట్లో ఛార్జ్ చేయడం సులభంగా ఉంటుంది. ఇది ఒక్కసారి ఛార్జింగ్‌తో 80 కిమీలు మైలేజ్ ఇస్తుంది. దీన్ని రైడ్ చేయడానికి లైసెన్స్ కూడా అవసరం లేదు. ఈ కైనెటిక్ గ్రీన్ ఎలక్ట్రిక్ స్కూటర్ బహుళ-ఫంక్షనల్ రిమోట్ కీతో వస్తుంది, ఇది రైడ్‌లను మరింత సులభతరం చేస్తుంది. దీని ధర రూ.రూ.1,07,500.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం..




