Best EV Scooters: వినియోగదారులను ఆకట్టుకుంటున్న టాప్ ఎలక్ట్రిక్ స్కూటర్స్ ఇవే.. ఫీచర్స్ చూశారంటే వావ్ అంటారంతే..!

ముఖ్యంగా స్కూటర్ కొనాలనుకునే వారిలో దాదాపు యాభై శాతం మంది ఎలక్ట్రిక్ స్కూటర్లను కొనుగోలు చేస్తున్నారు. పెరుగుతున్న ఇందన ధరలకు ప్రత్యామ్నాయంగా ఎక్కువ మంది వీటిని కొనుగోలుకు ఉత్సాహం చూపుతున్నారు. అయితే ఎలక్ట్రిక్ స్కూటర్లలో కొన్ని మాత్రమే వినియోగదారులను ఆకట్టుకుంటున్నాయి.

Best EV Scooters: వినియోగదారులను ఆకట్టుకుంటున్న టాప్ ఎలక్ట్రిక్ స్కూటర్స్ ఇవే.. ఫీచర్స్ చూశారంటే వావ్ అంటారంతే..!
Electric Scooters 1
Follow us

|

Updated on: Mar 10, 2023 | 2:00 PM

భారత్ ఈవీ వెహికల్స్ వాడకం విస్తృతంగా పెరుగుతుంది. పల్లెలు, పట్టణాలు అనే తేడా లేకుండా కచ్చితంగా అంతా ఇప్పుడు ఈవీ వెహికల్స్ కొనుగోలు మొగ్గు చూపుతున్నారు. టూ వీలర్స్ కొనుగోలు చేయాలనుకునే వారు ప్రస్తుతం ఎలక్ట్రిక్ వాహనాల వైపు కూడా ఓ లుక్కేస్తున్నారు. ముఖ్యంగా స్కూటర్ కొనాలనుకునే వారిలో దాదాపు యాభై శాతం మంది ఎలక్ట్రిక్ స్కూటర్లను కొనుగోలు చేస్తున్నారు. పెరుగుతున్న ఇందన ధరలకు ప్రత్యామ్నాయంగా ఎక్కువ మంది వీటిని కొనుగోలుకు ఉత్సాహం చూపుతున్నారు. అయితే ఎలక్ట్రిక్ స్కూటర్లలో కొన్ని మాత్రమే వినియోగదారులను ఆకట్టుకుంటున్నాయి. భారతదేశంలో 2023కి సంబంధించి టాప్ 3 అత్యుత్తమ ఎలక్ట్రిక్ స్కూటర్ల గురించి ఓ సారి తెలుసుకుందాం. ఎలక్ట్రిక్ స్కూటర్లు పట్ణణాల్లో ప్రయాణించడానికి అనువుగా ఉంటాయి. అలాగే పెట్రో వాహనాలకు ఏ మాత్రం తీసిపోకుండా డ్రైవింగ్ అనుభవాన్ని పొందవచ్చు. మీరు ఎలక్ట్రిక్ స్కూటర్ కొనుగోలు చేయాలనుకుంటే మార్కెట్‌లో ఉన్న ఉత్తమమైన స్కూటర్లపై ఓ లుక్కేద్దాం.

ఓలా ఎస్ 1 ప్రో

ఈ స్కూటర్ ఎక్కువగా వినియోగదారులను ఆకట్టుకుంటుంది. ఎస్1 ప్రో 4 కేడబ్ల్యూహెచ్ బ్యాటరీ ప్యాక్‌తో వస్తుంది. 8.5 కేడబ్ల్యూ ఎలక్ట్రిక్ మోటార్‌తో 58 ఎన్ఎం టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఈ స్కూటర్ ఓ సారి ఛార్జ్‌ చేస్తే 170 కిలోమీటర్ల మైలేజ్‌ను అందిస్తుంది. అలాగే గరిష్టంగా గంటకు 116 కిలో మీటర్ల వేగంతో వెళ్తుంది. ఈ స్కూటర్‌లో వివిధ డ్రైవ్ మోడ్‌లు ఉన్నాయి. ఎస్1 ప్రోని ఛార్జ్ చేయడానికి దాదాపు 6 గంటల 30 నిమిషాలు పడుతుంది. అన్ని సబ్సిడీల తర్వాత ఈ స్కూటర్ ధర రూ. 1.33 లక్షలు (ఎక్స్ షోరూమ్)గా ఉంటుంది. 

ఎథర్ 450 ఎక్స్

ఓలా ఎస్1 ప్రో తర్వాత ఎథర్ 450 ఎక్స్ వినియోగదారుల మనస్సును గెలుచుకుంటుంది. ఎస్1 తర్వాత అధికంగా విక్రయిస్తున్న బెస్ట్ స్కూటర్ ఇది. 6.2 కేడబ్ల్యూ, 26 ఎన్ఎంతో గరిష్ట శక్తి, టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. 3.7 కేడబ్ల్యూహెచ్ బ్యాటరీతో వచ్చే ఈ స్కూటర్‌ను 5 గంటల 40 నిమిషాల్లో ఛార్జ్ చేయవచ్చు. అలాగే ఓ సారి ఒక్కసారి ఛార్జ్ చేస్తే 105 కిలో మీటర్ల మైలేజ్ ఇస్తుంది. గరిష్టంగా గంటకు 90 కిలో మీటర్ల వేగంతో దూసుకుపోతుంది. వివిధ డ్రైవింగ్ మోడ్‌లతో పాటు హిల్-హోల్డ్ అసిస్ట్ ఫీచర్, రివర్స్ మోడ్‌ ఫీచర్లతో ఈ స్కూటర్ అందరినీ ఆకట్టుకుంటుంది. ఏథర్ 450 ఎక్స్ జెన్ 3 ఎక్స్-షోరూమ్ ధర సుమారు రూ. 1.31 లక్షలుగా ఉంది.

ఇవి కూడా చదవండి

టీవీఎస్ ఐ క్యూబ్

ఎలక్ట్రిక్ స్కూటర్ల వాహన శ్రేణిలో టీవీఎస్ కూడా తన మార్క్‌ను చూపిస్తుంది. ఈ కంపెనీ రిలీజ్ చేసిన ఐ క్యూబ్ ప్రస్తుతం అధిక సంఖ్యలో అమ్ముడవుతున్న స్కూటర్ల సరసన నిలుస్తుంది. ప్రస్తుతం మార్కెట్‌లో అందుబాటులో ఉన్న ఐక్యూబ్ ఎస్ వేరియంట్ స్కూటర్ 3.04 కేడబ్ల్యూహెచ్ బ్యాటరీ ప్యాక్‌తో వస్తుంది. అలాగే 4.4 కేడబ్ల్యూ, 140 ఎన్ఎం పవర్, టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఈ బ్యాటరీ ప్యాక్‌ను దాదాపు 5 గంటల్లో ఛార్జ్ చేయవచ్చు. ఎకో మోడ్‌లో ఒక్కసారి ఛార్జ్ చేస్తే 100 కిమీల రేంజ్‌ వస్తుంది. అలాగే గరిష్ట వేగం గంటకు 78 కిలో మీటర్లుగా ఉంటుంది. ఇది రివర్స్ మోడ్‌తో పాటు వివిధ డ్రైవ్ మోడ్‌లను కలిగి ఉంది. ఐ క్యూబ్ ఎస్ ధర రూ.1.04 లక్షలు (ఎక్స్-షోరూమ్)గా ఉంది.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం..