Omega seiki: ఎలక్ట్రిక్ వాహనాల కోసం దేశీయ బ్యాటరీల తయారీ.. ఏకంగా 881 మిలియన్ డాలర్లను పెట్టుబడి పెట్టేందుకు సిద్ధమైన సంస్థ.. పూర్తి వివరాలు ఇవి..

అయితే క్రమంగా మన దేశంలో కూడా ఎలక్ట్రిక్ వాహనాలు పెరుగుతున్న నేపథ్యంలో ఇక్కడే బ్యాటరీలు తయారు చేయాలని న్యూ ఢిల్లీకి చెందిన ఓమెగా సీకీ(Omega Seiki) మొబిలిటీ ప్రైవేట్ కంపెనీ భావిస్తోంది. అందుకోసం ఏకంగా ఎనిమిది బిలియన్ల రూపాయలు( 981 మిలియన్ల డాలర్లు) పెట్టుబడి పెట్టేందుకు సిద్ధమైంది.

Omega seiki: ఎలక్ట్రిక్ వాహనాల కోసం దేశీయ బ్యాటరీల తయారీ.. ఏకంగా 881 మిలియన్ డాలర్లను పెట్టుబడి పెట్టేందుకు సిద్ధమైన సంస్థ.. పూర్తి వివరాలు ఇవి..
Omega Seiki Mobility
Follow us

|

Updated on: Jan 30, 2023 | 3:49 PM

పెరుగుతున్న ఇంధన ధరలు.. అధికమవుతున్న వాతావరణ కాలుష్యం.. అందరినీ ప్రత్యామ్నాయం వైపు మళ్లిస్తోంది. దీంతో అందరి దృష్టి ఎలక్ట్రిక్ వాహనాల వైపు వెళ్తోంది. ఫలితంగా మార్కెట్లో వాటికి డిమాండ్ విపరీతంగా పెరుగుతోంది. అందుకనుగుణంగా మార్కెట్లో పెద్ద సంఖ్యలో ఎలక్ట్రిక్ వాహనాలు కొలువుదీరుతున్నాయి. వీటన్నంటికీ బ్యాటరీ చాలా ప్రధానమైనది. ప్రస్తుతం అన్ని కంపెనీలు లిథియం అయాన్ బ్యాటరీలనే వినియోగిస్తున్నాయి. మన భారతదేశంలో కూడా వీటికి డిమాండ్ బాగా పెరిగింది. అయితే మన దగ్గర ఆ డిమాండ్ కు అనుగుణంగా బ్యాటరీ తయారీ లేదు. దీంతో మనం ఇతర దేశాల నుంచి దిగుమతి చేసుకుంటున్నాం. అయితే క్రమంగా మన దేశంలో కూడా ఎలక్ట్రిక్ వాహనాలు పెరుగుతున్న నేపథ్యంలో ఇక్కడే బ్యాటరీలు తయారు చేయాలని న్యూ ఢిల్లీకి చెందిన ఓమెగా సీకీ(Omega Seiki) మొబిలిటీ ప్రైవేట్ కంపెనీ భావిస్తోంది. అందుకోసం ఏకంగా ఎనిమిది బిలియన్ల రూపాయలు( 981 మిలియన్ డాలర్లు) పెట్టుబడి పెట్టనుంది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇవి..

రూ. 8 బిలియన్ల పెట్టుబడి..

న్యూ ఢిల్లీకి చెందిన కంపెనీ Omega Seiki మొబిలిటీ ప్రైవేట్ సంస్థ దక్షిణాసియా దేశంలో బ్యాటరీలను ఉత్పత్తి చేయడానికి న్యూయార్క్‌లోని లిథియం-అయాన్ సెల్స్ తయారు చేసే స్టార్టప్ iM3NYతో ఒప్పందం కుదుర్చుకుంది. అందుకోసం ఏకంగా రూ. 8 బిలియన్ల ను పెట్టుబడి పెట్టేందుకు ప్రణాళిక చేస్తున్నట్లు ప్రకటించింది. 2018లో స్థాపించబడిన ఈ ఒమేగా సంస్థ స్థానికంగా ఎలక్ట్రిక్ వెహికల్ పవర్ ట్రైన్‌లను తయారు చేసేందుకు జే సంగ్ టెక్ కొరియాతో కలిసి ఒక జాయింట్ ను తీసుకొచ్చింది.

మన దేశంలో డిమాండ్ ఇలా..

భారతదేశంలో లిథియం-అయాన్ బ్యాటరీల డిమాండ్ ప్రస్తుతం 3 గిగావాట్ అవర్ ఉంది. ఇది 2030 నాటికి 20 గిగావాట్ అవర్ కు పెరుగుతుందని ఓ అంచనా. ఇది స్థానికంగా సెల్ తయారీ సామర్థ్యాన్నిపెంచడానికి అవకాశాన్ని కల్పిస్తోంది. ప్రస్తుతం మన దేశంలో లిథియం-అయాన్ సెల్ ల ఉత్పత్తి లేకపోవడంతో 70% చైనా,మిగిలినది హాంకాంగ్ నుండి దిగుమతి చేసుకుంటున్నాం.

ఇవి కూడా చదవండి

ఎంత సామర్థ్యంతో అంటే..

పశ్చిమ రాష్ట్రమైన మహారాష్ట్రలో ఒమేగా తన బ్యాటరీల ఉత్పత్తిని ప్రారంభించే అవకాశం ఉంది. తొలుత 0.5 గిగావాట్ల సామర్థ్యంతో దీనిని నిర్మించి.. తర్వాత 2 గిగావాట్ల వరకు పెంచే అవకాశం ఉంది. హరియాణాలోని పవర్ ట్రైన్ ప్లాంట్ 2024లో 10,000 యూనిట్లను, నాల్గవ సంవత్సరం నాటికి 100,000 యూనిట్లను ఉత్పత్తి చేస్తుంది.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం..

సలార్‌లో ప్రభాస్‌ బైక్‌ సొంతం చేసుకునే అవకాశం.. ఎలాగో తెలుసా.?
సలార్‌లో ప్రభాస్‌ బైక్‌ సొంతం చేసుకునే అవకాశం.. ఎలాగో తెలుసా.?
కుట్టుమిషిన్‌తో మొదలైన టైలర్‌ ప్రయాణం.. నేడు వేలకోట్లకు అధిపతి..!
కుట్టుమిషిన్‌తో మొదలైన టైలర్‌ ప్రయాణం.. నేడు వేలకోట్లకు అధిపతి..!
పొలిటికల్ కమాండర్‎లా మారిన సీఎం రేవంత్.. ఢిల్లీ హైకమాండ్ సపోర్ట్‎
పొలిటికల్ కమాండర్‎లా మారిన సీఎం రేవంత్.. ఢిల్లీ హైకమాండ్ సపోర్ట్‎
భారత్‌లో ఎయిర్‌ ట్యాక్సీలు వచ్చేది అప్పుడే.. ఇండిగో ప్రకటన
భారత్‌లో ఎయిర్‌ ట్యాక్సీలు వచ్చేది అప్పుడే.. ఇండిగో ప్రకటన
24 గంటల్లో 120 పబ్బుల్లో తాగేశాడు- గిన్నిస్ రికార్డ్ కొట్టేశాడు..
24 గంటల్లో 120 పబ్బుల్లో తాగేశాడు- గిన్నిస్ రికార్డ్ కొట్టేశాడు..
ఏపీలో అభ్యర్థుల ఆస్తి, అప్పుల చిట్టా ఇదే.. టాప్‎లో ఉన్నది ఎవరంటే
ఏపీలో అభ్యర్థుల ఆస్తి, అప్పుల చిట్టా ఇదే.. టాప్‎లో ఉన్నది ఎవరంటే
కూటమి నేతల్లో కలవరపెడుతున్న అసమ్మతి కుంపటి.. తెరపైకి రాజకీయ వేడి
కూటమి నేతల్లో కలవరపెడుతున్న అసమ్మతి కుంపటి.. తెరపైకి రాజకీయ వేడి
మళ్లీ పెరిగిన బంగారం ధరలు.. హైదరాబాద్‌లో తులం ఎంతంటే.?
మళ్లీ పెరిగిన బంగారం ధరలు.. హైదరాబాద్‌లో తులం ఎంతంటే.?
దిన ఫలాలు (ఏప్రిల్ 20, 2024): 12 రాశుల వారికి ఇలా..
దిన ఫలాలు (ఏప్రిల్ 20, 2024): 12 రాశుల వారికి ఇలా..
రాహులో రాహులా! లక్నో కెప్టెన్ సూపర్ ఇన్నింగ్స్.. చెన్నై చిత్తు
రాహులో రాహులా! లక్నో కెప్టెన్ సూపర్ ఇన్నింగ్స్.. చెన్నై చిత్తు