AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Revolt Motors: రివోల్ట్‌ నుంచి నయా ఈవీ బైక్‌.. క్రికెట్‌ ప్రియులను ఆకట్టుకునేలా ప్రత్యేక ఎడిషన్‌ రిలీజ్‌..!

ప్రస్తుతం భారత ఆటోమొబైల్‌ రంగంలో ఎలక్ట్రిక్‌ వాహనాల హవా నడుస్తుంది. కార్లతో పోల్చుకుంటే బైక్‌లు, స్కూటర్ల కొనుగోలుకు ప్రజలు ఎక్కువగా ముందుకు వస్తున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా ఎలక్ట్రిక్ మోటార్‌సైకిల్ కంపెనీ రివోల్ట్ మోటార్స్ ఇటీవల ఆర్‌వీ 400 ఇండియా బ్లూ - క్రికెట్ స్పెషల్ ఎడిషన్ ఎలక్ట్రిక్ బైక్ పేరుతో కొత్త ఈ-బైక్‌ను విడుదల చేసింది. ప్రత్యేకంగా ప్రస్తుతం జరుగుతున్న ఐసీసీ వరల్డ్‌ కప్‌ -2023ను దృష్టిలో పెట్టుకుని ఈ నయా ఎడిషన్‌ లాంచ్‌ చేసింది.

Revolt Motors: రివోల్ట్‌ నుంచి నయా ఈవీ బైక్‌.. క్రికెట్‌ ప్రియులను ఆకట్టుకునేలా ప్రత్యేక ఎడిషన్‌ రిలీజ్‌..!
Revolt Rv 400
Nikhil
|

Updated on: Oct 20, 2023 | 4:30 PM

Share

భారతదేశంలో క్రికెట్‌ క్రేజ్‌ ఏ స్థాయిలో ఉంటుందో అందరికీ తెలిసిందే. అయితే ఈ క్రేజ్‌ విషయంలో వరల్డ్‌ కప్‌కు ఉన్న క్రేజ్‌ మరో ఎత్తు. కోట్లాది మంది క్రికెట్‌ అభిమానులు ఈ వరల్డ్‌ కప్‌ కోసం ఎదురుచూస్తూ ఉంటారు. కంపెనీలు కూడా ఈ క్రేజ్‌ను దృష్టిలో ఉంచుకుని వివిధ ఆఫర్లు పెడుతూ ఉంటారు. అంతేకాకుండా ఈ వరల్డ్‌ కప్‌ స్పాన్సర్స్‌గా కూడా చాలా కంపెనీలు ముందుకు వస్తాయి. అయితే ప్రస్తుతం భారత ఆటోమొబైల్‌ రంగంలో ఎలక్ట్రిక్‌ వాహనాల హవా నడుస్తుంది. కార్లతో పోల్చుకుంటే బైక్‌లు, స్కూటర్ల కొనుగోలుకు ప్రజలు ఎక్కువగా ముందుకు వస్తున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా ఎలక్ట్రిక్ మోటార్‌సైకిల్ కంపెనీ రివోల్ట్ మోటార్స్ ఇటీవల ఆర్‌వీ 400 ఇండియా బ్లూ – క్రికెట్ స్పెషల్ ఎడిషన్ ఎలక్ట్రిక్ బైక్ పేరుతో కొత్త ఈ-బైక్‌ను విడుదల చేసింది. ప్రత్యేకంగా ప్రస్తుతం జరుగుతున్న ఐసీసీ వరల్డ్‌ కప్‌ -2023ను దృష్టిలో పెట్టుకుని ఈ నయా ఎడిషన్‌ లాంచ్‌ చేసింది. రివోల్ట్‌ కంపెనీకు చెందిన ఆర్‌వీ 400 క్రికెట్‌ స్పెషల్‌ ఎడిషన్‌ గురించి మరిన్ని వివరాలను తెలుసుకుందాం.

నిగినిగలీఆడే బ్లూ ఫినిషింగ్‌తో వచ్చే ఆర్‌వీ 400 బైక్‌ ప్రీమియం లుక్‌తో అదరగొడుతుంది. ముఖ్యంగా భారతీయ క్రికెట్‌ ఔత్సాహికుల అభిరుచి, గర్వాన్ని ప్రతిబింబించేలా ఈ బైక్‌ను లాంచ్‌ చేశారు. రివోల్ట్ ఆర్‌వీ 400 అసాధారణమైన ఫీచర్లతో పాటు ఆవిష్కరణ, శైలి, స్థిరత్వాన్ని సజావుగా మిళితం చేస్తుందని కంపెనీ ప్రతినిధులు పేర్కొంటున్నారు. 2023 ప్రపంచ కప్‌లో భారత క్రికెట్ జట్టుకు మా అచంచలమైన మద్దతుకు చిహ్నంగా ఆర్‌వీ 400 ఇండియా బ్లూను పరిచయం చేయడం మాకు ఆనందంగా ఉందని వివరిస్తున్నారు. ముఖ్యంగా పర్యావరణ అనుకూలమైన ప్రీమియం రైడింగ్ అనుభవాన్ని అందించడానికి సాంకేతికత, శైలిని మిళితం చేయాలనే మా దృష్టిని ఈ ఎడిషన్ సంపూర్ణంగా సంగ్రహిస్తుందని రివోల్ట్‌ బిజినెస్ చైర్‌పర్సన్ అంజలి రత్తన్ పేర్కొంటున్నారు. ఇండియా బ్లూ కలర్ అనేది కేవలం ఒక రంగు మాత్రమే కాదు..ఇది మా రివోల్ట్ ఆర్‌వీ 400 లైనప్‌కు చక్కదనం, గర్వాన్ని జోడిస్తుందని తెలలిపారు. 

ఇండియా బ్లూ ప్రత్యేక ఎడిషన్‌లో క్లీన్, సస్టైనబుల్ కమ్యూటింగ్‌ని పొందుపరిచారు. ఈ బైక్‌ క్రికెట్‌తో పాటు బైక్‌ రైడింగ్‌ను అనువుగా ఉంటుందని నిపుణులు వివరిస్తున్నారు. ఈ పరిమిత సంఖ్యలోనే రూపొందించిన క్రికెట్ స్పెషల్ ఎడిషన్ కాబట్టి ఇండియా బ్లూ ఫస్ట్ కమ్స్ ఫస్ట్ సర్వ్ ప్రాతిపదికన అందుబాటులో ఉంటుందని కంపెనీ తెలిపింది. అయితే ఈ నయా ఎడిషన్‌ ధర ఇంకా కంపెనీ వెల్లడించలేదు. 2017లో స్థాపించిన రివోల్ట్‌ ఇంటెల్లికార్ప్‌ భారతదేశంలో ఈవీ బైక్‌ రంగంలో అగ్రగామిగా ఉంది. వినూత్న సాంకేతికతలపై దృష్టి సారించి ఈ కంపెనీ ఈ స్థాయిలో ఉంది. 

ఇవి కూడా చదవండి

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

రుచితోపాటు అమోఘమైన పోషకాలు దాగి ఉన్న ఈ పండు గురించి తెలుసా?
రుచితోపాటు అమోఘమైన పోషకాలు దాగి ఉన్న ఈ పండు గురించి తెలుసా?
రాగి బాటిల్ vs గ్లాస్ బాటిల్.. మంచి నీళ్లు తాగడానికి ఏది బెస్ట్?
రాగి బాటిల్ vs గ్లాస్ బాటిల్.. మంచి నీళ్లు తాగడానికి ఏది బెస్ట్?
భుజంపై తాబేలుతో పోజులిచ్చిన బిగ్‌బాస్ బ్యూటీ.. ఫొటోస్ ఇదిగో
భుజంపై తాబేలుతో పోజులిచ్చిన బిగ్‌బాస్ బ్యూటీ.. ఫొటోస్ ఇదిగో
పెట్రోల్‌, డీజిల్‌ కారు ఉన్నవారికి ఫ్రీగా రూ.50 వేలు!
పెట్రోల్‌, డీజిల్‌ కారు ఉన్నవారికి ఫ్రీగా రూ.50 వేలు!
తెల్లటి బియ్యాన్ని దానం చేయడం వల్ల కలిగే ఈ 5 అద్భుత ప్రయోజనాలు
తెల్లటి బియ్యాన్ని దానం చేయడం వల్ల కలిగే ఈ 5 అద్భుత ప్రయోజనాలు
చలికాలంలో ఒంటి నొప్పులు ఎక్కువగా ఉంటున్నాయా?.. ఇదే కారణం..
చలికాలంలో ఒంటి నొప్పులు ఎక్కువగా ఉంటున్నాయా?.. ఇదే కారణం..
ఈ కంపెనీ అద్భుతాలు చేసింది.. ఇక మొత్తం కంప్యూటర్‌ కీబోర్డ్‌లోనే..
ఈ కంపెనీ అద్భుతాలు చేసింది.. ఇక మొత్తం కంప్యూటర్‌ కీబోర్డ్‌లోనే..
OTTలో ఒళ్లు గగుర్పొడిచే హారర్ థ్రిల్లర్.. ధైర్యముంటేనే చూడండి
OTTలో ఒళ్లు గగుర్పొడిచే హారర్ థ్రిల్లర్.. ధైర్యముంటేనే చూడండి
కోనసీమ.. చమురు బావుల కింద కుంగాల్సిందేనా?
కోనసీమ.. చమురు బావుల కింద కుంగాల్సిందేనా?
నేపాల్‌లో మత ఘర్షణలు.. సోషల్ మీడియా చిచ్చుతో బిర్గుంజ్‌లో కర్ఫ్యూ
నేపాల్‌లో మత ఘర్షణలు.. సోషల్ మీడియా చిచ్చుతో బిర్గుంజ్‌లో కర్ఫ్యూ