Unclaimed Deposits: బ్యాంకుల్లో క్లైయిమ్ చేయని డిపాజిట్లను విత్‌డ్రా చేసుకోవడం ఎలా?
క్లెయిమ్ చేయని ఫండ్స్ ఐడెంటిఫై చేసే విధానం ఇప్పుడు అంత కష్టమైనది ఏమీ కాదు. రిజర్వ్ బ్యాంక్ మార్గదర్శకాల ప్రకారం, ప్రతి బ్యాంక్ తమ వెబ్‌సైట్‌లో క్లెయిమ్ చేయని డిపాజిట్ల గురించిన సమాచారాన్ని ప్రచురించడం తప్పనిసరి. ఏదైనా క్లెయిమ్ చేయని ఫండ్‌లను బ్యాంక్ లు కలిగి ఉన్నాయో లేదో తెలుసుకోవడానికి, మీరు బ్యాంక్ వెబ్‌సైట్‌లో అకౌంట్స్ హోల్డర్ పేరు..

ప్రస్తుత పరిస్థితుల్లో 4-5 బ్యాంక్ అకౌంట్స్ కలిగి ఉండటం ఆనవాయితీగా మారింది. అన్ని అకౌంట్స్ ట్రాక్ చేయడం కష్టం అవుతుంది. ఒక్కోసారి ఎన్ని అకౌంట్లు ఓపెన్ చేశారో మర్చిపోయే ఛాన్స్ ఉంది. పాత కప్‌బోర్డ్‌లో డాక్యుమెంట్‌ల కోసం వెతుకుతున్నప్పుడు, మన మునుపటి అకౌంట్స్ పాస్‌బుక్‌లను చూసినప్పుడు మనము అప్పుడెప్పుడో 12-15 సంవత్సరాల క్రితం బ్యాంకు అకౌంట్ ఓపెన్ చేసినట్టు తెలుసుకుంటాము. అదేవిధంగా, కొందరు వ్యక్తులు ఈ లోకంలో లేని కుటుంబ సభ్యుల బ్యాంక్ అకౌంట్స్ ను కనుగొంటారు. అటువంటి అకౌంట్స్ లో లక్షల రూపాయలు అలానే ఉండిపోయాయని గుర్తించే అవకాశం ఉంది. అటువంటప్పుడు ఒక అనుమానం వస్తుంది. ఈ డబ్బును తిరిగి పొందడం సాధ్యం అవుతుందా? అయితే ఎలా.. ఎక్కడ నుంచి తిరిగి పొందవచ్చు? అయితే ముందుగా, ఈ నిధులు ఏమిటి అలాగే ఎంత డబ్బు షేర్ లో ఉందో అర్థం చేసుకుందాం?
10 సంవత్సరాల పాటు ఎటువంటి ట్రాన్సాక్షన్స్ చేయని బ్యాంకుల్లోని సేవింగ్స్ లేదా కరెంట్ అకౌంట్స్ లేదా మెచ్యూరిటీ తేదీ నుంచి 10 సంవత్సరాలలోపు ఎటువంటి క్లెయిమ్‌లు చేయని ఫిక్స్‌డ్ డిపాజిట్లు- రికరింగ్ డిపాజిట్లు ఇటువంటి అకౌంట్స్ అన్నీ ‘’క్లెయిమ్ చేయని డిపాజిట్స్’ కేటగిరీ కిందకు వస్తాయి. 10 సంవత్సరాలు లేదా అంతకంటే ఎక్కువ కాలం పాటు నిష్క్రియంగా ఉన్న ఈ ఖాతాల నుంచి డబ్బు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) డిపాజిటర్ ఎడ్యుకేషన్ అండ్ అవేర్‌నెస్ (DEA) ఫండ్‌కు బదిలీ అవుతుంది.
ఇటీవలి ప్రభుత్వ డేటా ప్రకారం, ఫిబ్రవరి 2023 నాటికి పబ్లిక్ సెక్టార్ లేదా ప్రభుత్వ బ్యాంకులు దాదాపు 35,000 కోట్ల రూపాయల క్లెయిమ్ చేయని డిపాజిట్‌లను రిజర్వ్ బ్యాంక్‌కి ట్రాన్స్ ఫర్ చేశాయి. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అత్యధికంగా 8,086 కోట్ల రూపాయల క్లెయిమ్ చేయని డిపాజిట్‌లను కలిగి ఉంది. తర్వాత పంజాబ్ నేషనల్ బ్యాంక్ 5,340 కోటి రూపాయలు, కెనరా బ్యాంక్ 4,558 కోట్ల రూపాయలు, బ్యాంక్ ఆఫ్ బరోడా 3,904 కోట్ల రూపాయలతో ఉన్నాయి.
క్లెయిమ్ చేయని ఫండ్స్ ఐడెంటిఫై చేసే విధానం ఇప్పుడు అంత కష్టమైనది ఏమీ కాదు. రిజర్వ్ బ్యాంక్ మార్గదర్శకాల ప్రకారం, ప్రతి బ్యాంక్ తమ వెబ్‌సైట్‌లో క్లెయిమ్ చేయని డిపాజిట్ల గురించిన సమాచారాన్ని ప్రచురించడం తప్పనిసరి. ఏదైనా క్లెయిమ్ చేయని ఫండ్‌లను బ్యాంక్ లు కలిగి ఉన్నాయో లేదో తెలుసుకోవడానికి, మీరు బ్యాంక్ వెబ్‌సైట్‌లో అకౌంట్స్ హోల్డర్ పేరు – అడ్రస్ – పిన్ కోడ్ లేదా ఫోన్ నంబర్ వంటి ఇతర వివరాలను నమోదు చేయాలి. ఇది మీ క్లెయిమ్ చేయని డిపాజిట్ గురించిన సమాచారాన్ని మీకు అందిస్తుంది.
అటువంటి అకౌంట్స్ హోల్డర్స్ కోసం రిజర్వ్ బ్యాంక్ ఇటీవల ‘UDGAM’ పోర్టల్ అనే కేంద్ర వ్యవస్థను ప్రారంభించింది. దీని సహాయంతో, మీరు అనేక బ్యాంకుల్లో మీ క్లెయిమ్ చేయని డిపాజిట్ అకౌంట్స్ గుర్తించవచ్చు. దీన్ని చేయడానికి, మీరు ఫోన్ నంబర్ – అకౌంట్స్ హోల్డర్ పేరు వంటి వివరాలను అందించడం ద్వారా పోర్టల్‌లో నమోదు చేసుకోవాలి. ఇప్పటివరకు, 30 బ్యాంకులు UDGAM పోర్టల్‌కు అనుసంధానం అయ్యాయి. వాటిలో ఎస్‌బీఐ, పీఎన్‌బీ, బ్యాంక్ ఆఫ్ బరోడా వంటి ప్రభుత్వ బ్యాంకులు, హెచ్‌డీఎఫ్‌సీ, ఐసీఐసీఐ, యాక్సిస్ బ్యాంక్ వంటి ప్రైవేట్ బ్యాంకులు అలాగే సిటీ బ్యాంక్, స్టాండర్డ్ చార్టర్డ్ – హెచ్‌ఎస్‌బీసీ వంటి విదేశీ బ్యాంకులు ఉన్నాయి.
క్లెయిమ్ చేయని అకౌంట్స్ లిస్ట్ లో మీ పేరు ఉన్నట్లయితే, మీరు హోమ్ బ్రాంచ్‌ని సంప్రదించి క్లెయిమ్ ఫారమ్‌ను పూరించాలి. దీనితో పాటు, మీరు మీ కేవైసీకి సంబంధించిన డిపాజిట్ స్లిప్, డాక్యుమెంట్‌లను సబ్మిట్ చేయాలి. తరువాత అకౌంట్స్ హోల్డర్ అకౌంట్స్ ని మళ్ళీ యాక్టివేట్ చేయవచ్చు లేదా క్లెయిమ్ మొత్తాన్ని ఉపసంహరించుకోవడం ద్వారా అకౌంట్స్ ను క్లోజ్ చేయవచ్చు. అకౌంట్స్ హోల్డర్ మరణించిన సందర్భంలో, చట్టపరమైన వారసులు లేదా నామినీలు ఇతర పత్రాలతో పాటు అకౌంట్స్ హోల్డర్ డెత్ సర్టిఫికెట్ సమర్పించాలి. పేమెంట్ చేయడానికి ముందు క్లెయిమ్ ప్రామాణికతను బ్యాంక్ ధృవీకరిస్తుంది. క్లెయిమ్ విజయవంతంగా ధృవీకరించబడిన తర్వాత, మీరు డబ్బును అందుకుంటారు.
మీకు పాత బ్యాంక్ అకౌంట్స్ లో ఫండ్స్ ఉంటె, మీ డబ్బు క్లెయిమ్ చేయని డిపాజిట్ అవునా.. కాదా అని మీరు బ్యాంక్ వెబ్‌సైట్ లేదా UDGAM పోర్టల్‌లో చెక్ చేయవచ్చు. ఇది క్లెయిమ్ చేయని డిపాజిట్‌కు అర్హత పొందకపోతే, మీరు నేరుగా బ్యాంక్‌ని సంప్రదించి అకౌంట్స్ క్లోజ్ చేయవచ్చు. అలాగే అందులోని డబ్బును విత్‌డ్రా చేసుకోవచ్చు లేదా అకౌంట్స్ ను తిరిగి యాక్టివేట్ చేయవచ్చు.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి