Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Gold Price Today: మహిళలకు షాకిచ్చిన బంగారం ధరలు.. తాజా రేట్ల వివరాలు

భారతదేశంలో బంగారం, వెండి ధరలు డాలర్‌తో రూపాయి విలువతో సహా అనేక అంశాలపై ఆధారపడి ఉంటాయి. విలువైన లోహాల రేటు నిర్ణయించడంలో గల కారణాలు గ్లోబల్ డిమాండ్ కూడా కీలక పాత్ర పోషిస్తుంది.గాజాలో జరిగిన ఘోరమైన పేలుడు ప్రాంతీయ సంఘర్షణపై భయాందోళనలకు ఆజ్యం పోసిన తర్వాత బంగారం ధరలు పెరిగిపోతున్నాయి.

Gold Price Today: మహిళలకు షాకిచ్చిన బంగారం ధరలు.. తాజా రేట్ల వివరాలు
Gold Price
Follow us
Subhash Goud

|

Updated on: Oct 20, 2023 | 6:19 AM

మహిళలకు బంగారం ధరలు షాకిస్తున్నాయి. పండగ సీజన్‌లో పరుగులు పెడుతున్నాయి. అయితే బంగారం ధరలు ఎంత పెరిగిన జ్యూలరీ షాపులన్ని బంగారం ధరలతో కిటకిటలాడుతుంటాయి. తాజాగా 22 క్యారెట్ల 10 గ్రాముల ధపై రూ.250 పెరుగగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధరపై రూ.270 వరకు పెరిగింది. ఇక అక్టోబర్‌ 20 దేశంలో బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో చూద్దాం. అయితే ఈ ధరలు ఉదయం 6 గంటలకు నమోదైనవి. రోజులో పెరగవచ్చు.. తగ్గవచ్చు.. లేదా స్థిరంగా ఉండవచ్చు.

  • చెన్నై: 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.55,850 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.60,930 ఉంది.
  • ముంబై: 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.55,700 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.60,760 ఉంది.
  • ఢిల్లీ: 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.55,850 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.60,910 ఉంది.
  • కోల్‌కతా: 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.55,700 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.60,760 ఉంది.
  • హైదరాబాద్‌: 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.55,700 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.60,760 ఉంది.
  • ఇక వెండిపై రూ.500 వరకు తగ్గుముఖం పట్టింది. ప్రస్తుతం కిలో వెండి ధర రూ.74,100

భారతదేశంలో బంగారం, వెండి ధరలు డాలర్‌తో రూపాయి విలువతో సహా అనేక అంశాలపై ఆధారపడి ఉంటాయి. విలువైన లోహాల రేటు నిర్ణయించడంలో గల కారణాలు గ్లోబల్ డిమాండ్ కూడా కీలక పాత్ర పోషిస్తుంది.గాజాలో జరిగిన ఘోరమైన పేలుడు ప్రాంతీయ సంఘర్షణపై భయాందోళనలకు ఆజ్యం పోసిన తర్వాత బంగారం ధరలు పెరిగిపోతున్నాయి. ఇంకా, రాజకీయ అస్థిరత బంగారం ధరలపై గణనీయమైన ప్రభావాన్ని చూపుతుంది.

24 క్యారెట్ల బంగారం:

24 క్యారెట్ల బంగారాన్ని స్వచ్ఛమైనదిగా పరిగణిస్తారు. స్వచ్ఛమైన బంగారం లేదా 24 క్యారెట్ బంగారం 99.9 శాతం స్వచ్ఛతను సూచిస్తుంది మరియు దానిలో కలిపిన ఇతర లోహాలు ఉండవు. 24 క్యారెట్ల బంగారాన్ని బంగారు నాణేలు మరియు కడ్డీల తయారీకి ఉపయోగిస్తారు. బంగారం కోసం ఇతర విభిన్న స్వచ్ఛతలు ఉన్నాయి మరియు వీటిని 24 క్యారెట్‌లతో పోల్చి కొలుస్తారు.

ఇవి కూడా చదవండి

22 క్యారెట్ల బంగారం

ఆభరణాల తయారీకి 22 క్యారెట్ల బంగారం మంచిది. ఇది 22 భాగాలు బంగారం, రెండు భాగాలు వెండి, నికెల్ లేదా ఇతర లోహాలను కలపడం ద్వారా, బంగారం గట్టిపడుతుంది. ఆభరణాలకు అనుకూలంగా ఉంటుంది. 22 క్యారెట్ల బంగారం 91.67 శాతం స్వచ్ఛతను సూచిస్తుంది. కాగా, డిమాండ్, వడ్డీ వసూలు, ఆక్ట్రాయ్ ఛార్జీలు, రాష్ట్ర పన్నులు, బంగారు వ్యాపారులు, బులియన్ అసోసియేషన్లు, రవాణా ఖర్చులు మరియు మేకింగ్ ఛార్జీలు వంటి వివిధ కారణాల వల్ల బంగారం ధరలు నగరాన్ని బట్టి మారవచ్చు.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

ఎన్టీఆర్ సినిమాలో ప్రభాస్ గెస్ట్ రోల్‌లో కనిపించడని మీకు తెలుసా..
ఎన్టీఆర్ సినిమాలో ప్రభాస్ గెస్ట్ రోల్‌లో కనిపించడని మీకు తెలుసా..
ఈ లక్షణాలు కనిపిస్తే లివర్ షెడ్డుకే.. గుండెకు కూడా ప్రమాదమట..
ఈ లక్షణాలు కనిపిస్తే లివర్ షెడ్డుకే.. గుండెకు కూడా ప్రమాదమట..
కసి తీర్చుకున్నారుగా.! దెబ్బకు దెబ్బ అంటే ఇదే కదా
కసి తీర్చుకున్నారుగా.! దెబ్బకు దెబ్బ అంటే ఇదే కదా
ఇండియన్ సినిమాల్లోనే అతిపెద్ద లిప్‌లాక్ ఇదేనట..
ఇండియన్ సినిమాల్లోనే అతిపెద్ద లిప్‌లాక్ ఇదేనట..
డ్రమ్ములో వేసే ముందు భర్త బాడీతో ఏం చేసిందో తెలుసా?
డ్రమ్ములో వేసే ముందు భర్త బాడీతో ఏం చేసిందో తెలుసా?
మెగాస్టార్ చిరంజీవితో చిందులేసిన స్టార్ హీరోల భార్యలు వీరే!
మెగాస్టార్ చిరంజీవితో చిందులేసిన స్టార్ హీరోల భార్యలు వీరే!
CSK ప్రాక్టీస్ వదిలి సైనికుల మధ్యకు చేరుకున్న ధోనీ.. వీడియో వైరల్
CSK ప్రాక్టీస్ వదిలి సైనికుల మధ్యకు చేరుకున్న ధోనీ.. వీడియో వైరల్
చేసింది 5 సినిమాలే.. దెబ్బకు కుర్రాళ్ల డ్రీమ్ గర్ల్ అయ్యింది
చేసింది 5 సినిమాలే.. దెబ్బకు కుర్రాళ్ల డ్రీమ్ గర్ల్ అయ్యింది
పెళ్లైన పది రోజులకే భర్తను..! సమాజం ఎటు పోతుంది?
పెళ్లైన పది రోజులకే భర్తను..! సమాజం ఎటు పోతుంది?
కలలో నెమలి కనిపిస్తుందా.. మంచిదా.. చెడ్డదా తెలుసుకోండి...
కలలో నెమలి కనిపిస్తుందా.. మంచిదా.. చెడ్డదా తెలుసుకోండి...