Indian railways: దక్షిణ మధ్య రైల్వే కీలక నిర్ణయం.. దసరా, దీపావళి రద్దీ నేపథ్యంలో..
దసరా, దీపావళి నేపథ్యంలో ప్రజలు సొంతుళ్లకు బయలుదేరి వెళుతున్నారు. దీంతో ప్రయాణికుల రద్దీ భారీగా పెరిగింది. దీనిని దృష్టిలో పెట్టుకొని దక్షిణ మధ్య రైల్వే కీలక నిర్ణయం తీసుకుంది. పలు స్టేషన్ల మధ్య ప్రత్యేక రైళ్లను నడపనున్నట్లు అధికారులు ప్రకటించారు. సికింద్రాబాద్, కాకినాడ, విశాఖపట్నం, కర్నూలు పట్టణాలను కవర్ చేస్తూ ఈ ప్రత్యేక రైళ్లు నడవనున్నట్లు దక్షిణ మధ్య రైల్వే గురువారం ప్రకటన విడుదల చేసింది...
ప్రస్తుతం దేశవ్యాప్తంగా పండుగల సీజన్ నడుస్తోంది. దసరా, దీపావళి నేపథ్యంలో ప్రజలు సొంతుళ్లకు బయలుదేరి వెళుతున్నారు. దీంతో ప్రయాణికుల రద్దీ భారీగా పెరిగింది. దీనిని దృష్టిలో పెట్టుకొని దక్షిణ మధ్య రైల్వే కీలక నిర్ణయం తీసుకుంది. పలు స్టేషన్ల మధ్య ప్రత్యేక రైళ్లను నడపనున్నట్లు అధికారులు ప్రకటించారు. సికింద్రాబాద్, కాకినాడ, విశాఖపట్నం, కర్నూలు పట్టణాలను కవర్ చేస్తూ ఈ ప్రత్యేక రైళ్లు నడవనున్నట్లు దక్షిణ మధ్య రైల్వే గురువారం ప్రకటన విడుదల చేసింది.
* సికింద్రాబాద్- సంత్రగాచిల మధ్య 07645 నెంబర్ రైలు 20-10-2023వ తేదీన ఉదయం 08.40 గంటలకు బయలుదేరీ తర్వాతి రోజు ఉదయం 10.40 గంటలకు గమ్యాన్ని చేరుకుంటుంది.
* ఇక 07646 నెంబర్ ట్రైన్ సంత్రగాచి-సికింద్రాబాద్‌ల మధ్య నడిచే రైలు, సంత్రగాచి నుంచి 21-10-2023 తేదీన మధ్యాహ్నం 12.20 గంటలకు బయలు దేరీ తర్వాతి రోజు మధ్యాహ్నం 3 గంటలకు సికింద్రాబాద్‌కు చేరుకుంటుంది.
* నాందేడ్ నుంచి కాకినాడ వెళ్లే 07055 నెంబర్ ట్రైన్ 21-10-2023 తేదీన 15.25 గంటలకు బయలు దేరీ తర్వాతి రోజు 07.30 గంటలకు కాకినాడ చేరుకుంటుంది.
* ఇక కాకినాడ-నాందేడ్‌ల మధ్య నడిచే 07056 నెంబర్ రైలు 22-10-2023 తేదీన 21.00 గంటలకు కాకినాడ నుంచి బయలుదేరీ, మరుసటి రోజు 13.50 గంటలకు నాందేడ్ చేరుకుంటుంది
* సికింద్రాబాద్, నర్సాపూర్‌ల మధ్య నడిచే 07062 నెంబర్ ట్రైన్ 22-10-2023 తేదీన సికింద్రాబాద్ నుంచి 22.05 గంటలకు బయలుదేరీ, మరుసటి రోజు 07.10 గంటలకు నర్సాపూర్ చేరుకుంటుంది.
* విశాఖపట్నం-కర్నూలు సిటీల మధ్య నడిచే 08585 నెంబర్ ట్రైన్ విశాఖ నుంచి 17.35 గంటలకు బయలుదేరీ, మరుసటి రోజు 13.25 గంటలకు కర్నూలు చేరుకుంటుంది. ఈ రైలు అక్టోబర్ 24, 31 నవంబర్ 7, 14 తేదీల్లో ప్రయణిస్తుంది.
* కర్నూలు సిటీ-విశాఖపట్నం మధ్య 08586 నెంబర్ ట్రైన్ కర్నూలు నుంచి 15.30 గంటలకు బయలుదేరీ, మరుసటి రోజు 09.50 గంటలకు విశాఖపట్నం చేరుకుంటుంది. ఈ రైలు అక్టోబర్ 25తో పాటు నవంబర్ నెలలో 1, 8, 15 తేదీల్లో నడుస్తుంది.
ఏయే స్టేషన్స్‌లో ఆగుతాయంటే..
* సికింద్రాబాద్-సంత్రగాచిల మధ్య నడిచే ఈ స్పెషల్ ట్రైన్ నల్లగొండ, మిర్యాలగూడ, నదికుడే, గుంటూరు, విజయవాడ, తాడేపల్లిగూడెం, రాజమండ్రి, సామలకోట్, దువ్వాడ, సింహాచలం, పెందుర్తి, కొత్తవలస, విజయనగరం, శ్రీకాకుళం, పలాస, బెరమ్‌పూర్, ఖుద్రా రోడ్, భువనేశ్వర్, కటక్, భద్రక్, బాలాసోర్, ఖరగ్పూర్ స్టేషన్స్‌లో ఆగుతుంది.
* నాందేడ్-కాకినాడ స్పెషల్ ట్రైన్ ముద్ఖేడ్, ధర్మాబాద్, బాసర, నిజామాబాద్, కామారెడ్డి, మేడ్చల్, సికింద్రాబాద్, కాజిపేట్, వరంగల్, మహబూబాబాద్, ఖమ్మం, రయనపాడు, ఏలూరు, రాజమండ్రితో పాటు సామలకోట్ స్టేషన్స్‌లో ఈ రైలు ఆగుతుంది.
* సికింద్రాబాద్-నర్సాపూర్ స్పెషల్ ట్రైన్ జనగాం, కాజిపేట, వరంగల్, మహబూబాద్, ఖమ్మం, మధిరా, రాయన్‌పడు, రామవరప్పడు, గుడివాడ, కైకలూరు, ఆకివీడు, భీమవరం టౌన్, భీమవరం జంక్షన్, పాలకొల్లు స్టేషన్స్‌లో రైలు ఆగుతుంది.
* విశాఖపట్నం-కర్నూలు మధ్య నడిచే ప్రత్యేక రైలు.. దువ్వాడ, అన్నవరం, సామల్‌కోట్, ఏలూరు, విజయవాడ, గుంటూరు, సత్తెనపల్లి, మిర్యాలగూడ, నల్లగొండ, మల్కాజ్‌గిరి, ఉమ్దానగర్, షాద్ నగర్, జడ్చర్ల, మహబూబ్ నగర్, వనపర్తి రోడ్, గద్వాల్ స్టేషన్స్‌లో ఆగుతుంది.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం క్లిక్ చేయండి..