IRCTC-Zomato: రైల్వే ప్రయాణికులకు జొమాటో ఫుడ్.. ఐఆర్‌సీటీసీతో ఒప్పందం..
ఇందుకోసం ఐఆర్‌సీటీసీ జొమాటాతో ఒప్పందం చేసుకుంది. ప్రయాణికులు ముందుగా ఆర్డర్ చేసుకున్న ఫుడ్‌ను నేరుగా సీటు వద్దకు తెప్పించుకునే వెసులుబాటు కల్పించనున్నారు. ఇందుకోసం జొమాటోతా భాగస్వామ్యం కుదుర్చుకుంది. ప్రస్తుతం ఈ సేవలను ఎంపిక చేసిన 5 స్టేషన్స్‌లో అందుబాటులోకి తీసుకొస్తున్నారు. తర్వలోనే దేశంలోని అన్ని రైల్వే స్టేషన్లకు జొమాటో సేవలను విస్తరించాలని చూస్తున్నారు...
రైల్వే ప్రయాణికులకు సౌకర్యవంతమైన ప్రయాణాన్ని అందించే క్రమంలో ఐఆర్‌సీటీసీ చర్యలు చేపడుతోంది. ఇప్పటికే ఎన్నో రకాల సేవలను అందిస్తున్న ఐఆర్‌సీటీసీ ప్రయాణికులకు తాజాగా మరో కొత్త సేవను పరిచయం చేయనుంది. ఇకపై రైల్వే ప్రయాణికులు జొమాటో యాప్ ద్వారా ఫుడ్‌ను ఆర్డర్ చేసుకునే అవకాశం కల్పిస్తోంది.
ఇందుకోసం ఐఆర్‌సీటీసీ జొమాటాతో ఒప్పందం చేసుకుంది. ప్రయాణికులు ముందుగా ఆర్డర్ చేసుకున్న ఫుడ్‌ను నేరుగా సీటు వద్దకు తెప్పించుకునే వెసులుబాటు కల్పించనున్నారు. ఇందుకోసం జొమాటోతా భాగస్వామ్యం కుదుర్చుకుంది. ప్రస్తుతం ఈ సేవలను ఎంపిక చేసిన 5 స్టేషన్స్‌లో అందుబాటులోకి తీసుకొస్తున్నారు. తర్వలోనే దేశంలోని అన్ని రైల్వే స్టేషన్లకు జొమాటో సేవలను విస్తరించాలని చూస్తున్నారు. ఈ-క్యాటరింగ్ సేవల కింద ప్రయాణికులకు ఫుడ్ ఆర్డర్ చేసుకునే వెసులుబాటు కల్పిస్తున్న ఐఆర్‌టీసీ, ఇప్పుడు జొమాటోతో చేయి కలపడంతో ఈ దిశగా మరో ముందడుగు వేసిందని చెప్పాలి.
ప్రూఫ్ ఆఫ్ కాన్సెప్ట్ కింద ప్రస్తుతం న్యూఢిల్లీ, ప్రయాగ్‌రాజ్, కాన్పూర్, లఖ్‌నవూ, వారణాసి రైల్వే స్టేషన్లలో సేవలను అందుబాటులోకి తీసుకొస్తున్నారు. అనంతరం ప్రయాణికుల నుంచి వచ్చిన స్పందన మేరకు ఈ సేవలను ఇతర స్టేషన్‌లకు విస్తరించనున్నారు. ఇదిలా ఉంటే ఐఆర్‌సీటీసీ ఇప్పటికే పండగ సీజన్ నేపథ్యంలో ప్రత్యేక ఆఫర్లను తీసుకొచ్చింది. నవరాత్రి సందర్భంగా ఉపవాసం చేసే వారి కోసం ప్రత్యేక థాలీని అందిస్తోంది.
ఇదిలా ఉంటే ఐఆర్‌సీటీసీతో ఒప్పందం కుదుర్చుకున్న తర్వాత జొమాటో షేర్‌లో మార్పులు కనిపించాయి. బుధవారం దేశీయ స్టాక్ మార్కెట్‌లో జొమాటో షేర్ రూ. 115 వద్ద 52 వారాల గరిష్ట స్థాయికి చేరుకుంది. అయితే అమ్మకాల సెగ తాకడంతో వెంటనే నష్టాల్లోకి పడిపోవడం గమనార్హం. ఇక ట్రేడ్ ముగిసే సమయానికి జొమాటో షేర్ రూ. 113.20 వద్ద ముగిసింది. ఇక ఐఆర్‌సీటీసీ స్టాక్ రెండు శాతం నష్టాలతో రూ. 700 వద్ద ట్రేడయి, ట్రేడింగ్ ముగిసే సమయానికి 1.48 శాతం నష్టంతో రూ. 704 వద్ద స్థిర పడింది.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం క్లిక్ చేయండి..