New Electric Scooter: అతి తక్కువ ధరలో డిస్క్ బ్రేక్‌తో ఎలక్ట్రిక్ స్కూటర్.. ఫ్లిప్ కార్ట్‌లోనే కొనుగోలు చేయొచ్చు.
ప్రముఖ ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహన తయారీ సంస్థ ఒడిస్సే తన కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్ ఒడిస్సే ఈ2గో(E2GO) గ్రాఫేన్‌ను విడుదల చేసింది. ఈ స్కూటర్‌ను ఒకసారి పూర్తిగా చార్జ్ చేస్తే 100 కిలోమీటర్ల వరకు నడుస్తుంది. ఇది హై ఎండ్ స్కూటర్, ఇందులో పెద్ద సైజ్ టైర్లు అందుబాటులో ఉంటాయి. ఈ లో స్పీ స్కూటర్ ఆన్ లైన్లో కూడా కొనుగోలు చేయొచ్చు.

మన దేశంలో ఎలక్ట్రిక్ స్కూటర్లకు డిమాండ్ నిరంతరం పేరుగుతూనే ఉంది. ముఖ్యంగా అర్బన్ ప్రాంతాల్లో వీటి వినియోగం అధికంగా ఉంది. దీంతో అన్ని టాప్ కంపెనీలతో పాటు చిన్ని చిన్న స్టార్టప్ లు కూడా తమ ఉత్పత్తులను భారతీయ మార్కెట్లోకి లాంచ్ చేస్తున్నాయి. ఇదే క్రమంలో ప్రముఖ ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహన తయారీ సంస్థ ఒడిస్సే తన కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్ ఒడిస్సే ఈ2గో(E2GO) గ్రాఫేన్‌ను విడుదల చేసింది. ఈ స్కూటర్‌ను ఒకసారి పూర్తిగా చార్జ్ చేస్తే 100 కిలోమీటర్ల వరకు నడుస్తుంది. ఇది హై ఎండ్ స్కూటర్, ఇందులో పెద్ద సైజ్ టైర్లు అందుబాటులో ఉంటాయి. ఈ లో స్పీ స్కూటర్ ఆన్ లైన్లో కూడా కొనుగోలు చేయొచ్చు. తక్కువ ధరలోనే ఎలక్ట్రిక్ స్కూటర్ కొనుగోలు చేయొచ్చు.
ఆరు ఆకర్షణీయమైన రంగుల్లో..
ఒడిస్సే ఎలక్ట్రిక్ ముంబైలో అత్యుత్తమ ఎలక్ట్రిక్ వెహికల్ స్టార్టప్ కంపెనీల్లో ఒకటి. ఈ ఈవీ స్కూటర్‌లో యూఎస్బీ చార్జింగ్ పోర్ట్, యాంటీ థెఫ్ట్ లాక్, కీలెస్ యాక్సెస్, డిజిటల్ స్పీడోమీటర్ వంటి అధునాతన ఫీచర్లు ఉన్నాయి. స్కూటర్‌కు అల్లాయ్ వీల్స్ ఇచ్చారు. ఇది భారీ సస్పెన్షన్‌ను కలిగి ఉంది. స్కూటర్‌లో డిస్క్ బ్రేక్‌లు ఇచ్చారు. ఈ కొత్త స్కూటర్ రూ.63,650 వేలకు మార్కెట్లో లభ్యమవుతోంది. ఇది ఆరు ఆకర్షణీయమైన కలర్ ఆప్షన్లలో అందుబాటులో ఉంది. ఒడిస్సే ఈ2గో గ్రాఫేన్ ఎనిమిది గంటల్లో పూర్తిగా ఛార్జ్ చేయబడుతుంది. దీన్ని నడపడానికి డ్రైవింగ్ లైసెన్స్ అవసరం లేదు. మీరు దీన్ని ఆన్‌లైన్ ఈ-కామర్స్ సైట్ ఫ్లిప్‌కార్ట్‌లో కొనుగోలు చేయవచ్చు. ఈ స్కూటర్‌లో పెద్ద హెడ్‌లైట్ ఉంది.
60 కిలోమీటర్ల రేంజ్..
భద్రత కోసం, స్కూటర్ ముందు భాగంలో డిస్క్ బ్రేక్, వెనుక భాగంలో డ్రమ్ బ్రేక్ అందించారు. ఈ స్కూటర్ ఒక్కసారి చార్జింగ్ చేస్తే 60 కిలోమీటర్ల రేంజ్ ఇస్తుంది. ఇది గంటకు గరిష్టంగా 25 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తుంది. ఈ స్కూటర్ 8 గంటల్లో పూర్తిగా చార్జ్ అవుతుంది. సౌకర్యవంతమైన ప్రయాణానికి టెలిస్కోపిక్ ఫోర్క్స్, మోనోషాక్ సస్పెన్షన్ ఉన్నాయి. ఇందులో ఎల్ఈడీ హెడ్‌ల్యాంప్‌లు, డిజిటల్ కన్సోల్ అందించారు. ఇందులో త్రీ-ఇన్-వన్ లాక్ సిస్టమ్, కీలెస్ స్టార్ట్, రివర్స్ మోడ్, మొబైల్ చార్జింగ్ సాకెట్ వంటి ఫీచర్లు ఉన్నాయి.
ఇది లో స్పీడ్ స్కూటర్ కాబట్టి సిటీ పరిధిలో బాగా ఉపయోగపడుతుంది. పైగా ఇంటిల్లిపాది వినియోగించుకునే వీలుంటుంది. ముఖ్యంగా మహిళలకు చాలా సౌలభ్యంగా ఉంటుంది. ఇంటి అవసరాలకు ఇది బెస్ట్ ఎంపికగా నిలుస్తుందనడంలో ఎలాంటి సందేహం. లేదు. పైగా తక్కువ ధరకే లభ్యమవుతుండటంతో అందరూ అందుబాటులో ఉంటుంది.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..