Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Honda CB 300R: యువతే టార్గెట్‌గా హోండా కొత్త బైక్.. స్పోర్టీ లుక్‌.. అత్యాధునిక టెక్నాలజీ.. ధర ఎంతంటే..

హోండా మోటార్ సైకిల్ అండ్ స్కూటర్ ఇండియా మన దేశీయ మార్కెట్లోకి కొత్త బైక్ ను విడుదల చేసింది. నిర్ధేశిత బీఎస్6 ఓబీడీ2 ఉద్ఘార ప్రమాణాలకు అనుగుణంగా ఈ కొత్త బైక్ ను లాంచ్ చేసింది. ఈ కొత్త బైక్ పేరు హోండా సీబీ 300ఆర్. ఈ 2023 ఎడిషన్ బైక్ అత్యాధునిక సాంకేతికతతో పాటు రెట్రో ఇన్ స్పైర్ డిజైన్ తో వస్తోంది. దీని ధర రూ. 2.40లక్షలు(ఎక్స్ షోరూం, ఢిల్లీ)గా ఉంది. కంపెనీ ఇప్పటికే ప్రీ బుకింగ్స్ ప్రారంభించింది.

Honda CB 300R: యువతే టార్గెట్‌గా హోండా కొత్త బైక్.. స్పోర్టీ లుక్‌.. అత్యాధునిక టెక్నాలజీ.. ధర ఎంతంటే..
Honda Cb300r
Follow us
Madhu

| Edited By: Ram Naramaneni

Updated on: Oct 19, 2023 | 10:21 PM

హోండా బ్రాండ్ నేమ్‌కు మన దేశంలో చాలా క్రేజ్ ఉంది. ఈ కంపెనీ టూ వీలర్లకు వినియోగదారుల నుంచి డిమాండ్ కూడా అధికంగానే ఉంటుంది. ఈ కంపెనీ నుంచి ఏ ఉత్పత్తి లాంచ్ అయిన అందరిలోనూ అమితాసక్తి ఉంటుంది. అది తీసుకొచ్చే ఉత్పత్తులు కూడా కస్టమర్ల అంచనాలకు అనుగుణంగానే ఉంటాయి. ఇదే క్రమంలో హోండా మోటార్ సైకిల్ అండ్ స్కూటర్ ఇండియా మన దేశీయ మార్కెట్లోకి కొత్త బైక్ ను విడుదల చేసింది. నిర్ధేశిత బీఎస్6 ఓబీడీ2 ఉద్ఘార ప్రమాణాలకు అనుగుణంగా ఈ కొత్త బైక్ ను లాంచ్ చేసింది. ఈ కొత్త బైక్ పేరు హోండా సీబీ 300ఆర్. ఈ 2023 ఎడిషన్ బైక్ అత్యాధునిక సాంకేతికతతో పాటు రెట్రో ఇన్ స్పైర్ డిజైన్ తో వస్తోంది. దీని ధర రూ. 2.40లక్షలు(ఎక్స్ షోరూం, ఢిల్లీ)గా ఉంది. కంపెనీ ఇప్పటికే ప్రీ బుకింగ్స్ ప్రారంభించింది. బిగ్ వింగ్ డీలర్ షిప్ ద్వారా ఈ కొత్త బైక్ ను కొనుగోలు చేయచ్చు. ఈ కొత్త హోండా సీబీ300ఆర్ బైక్ కు సంబంధించిన స్పెసిఫికేషన్లు, ఫీచర్లు ఇప్పుడు చూద్దాం..

హోండా సీబీ300ఆర్ డిజైన్ అండ్ లుక్..

కొత్త హోండా సీబీ300ఆర్ 2023 ఎడిషన్ బైక్ ఇప్పటికే ఉన్న సీబీ100ఆర్ లీటర్ క్లాస్ రోడ్ స్టర్ మాదిరిగానే ఉంటుంది. అయితే డిజైన్ లో కొన్ని అప్ గ్రేడేషన్స్ చేశారు. ఇది నియో స్పోర్ట్స్ కేఫ్ డిజైన్ రిఫ్లెక్షన్ తో పెద్ద ఫ్యూయల్ ట్యాంక్, అప్ స్వేప్ట్ ఎగ్జాస్ట్ తో వస్తుంది. ఆల్ ఎల్ఈడీ లైటింగ్ వ్యవస్థ ఉంటుంది. వృత్తాకరా ఎల్ఈడీ హెడ్ ల్యాంప్, ఎల్ఈడీ టర్న్ సిగ్నల్స్, ఎల్ఈడీ టెయిల్ ల్యాంప్ ఉంటుంది. బైక్ లుక్ కాస్త డిఫరెంట్ గా ఉంటుంది. స్పోర్టీ లుక్ లో కనిపిస్తుంది.

హోండా సీబీ300ఆర్ స్పెసిఫికేషన్లు..

ఇవి కూడా చదవండి

కొత్త మోటార్ సైకిల్ పూర్తి డిజిటల్ ఇన్ స్ట్రుమెంట్ క్లస్టర్ తో వస్తుంది. అత్యవసర స్టాప్ సిగ్నల్, హజార్ట్ లైట్ స్విచ్ వంటి ఫీచర్లు ఉంటాయి. ముందు, వెనుక డిస్క్ బ్రేక్లు ఉంటాయి. ఇవి డ్యూయల్ చానల్ ఏబీఎస్ సిస్టమ్ తో వస్తాయి. ముందు వైపు యూఎస్డీ ఫ్రంట్ ఫోర్క్స్, వెనుకవైపు మోనో షాక్ అబ్జార్బర్ ఉంటాయి. ఈ కొత్త బైక్ రెండు కలర్ ఆప్షన్లలో అందుబాటులో ఉంది. స్పార్టన్ రెడ్, మ్యాట్ మాసివ్ గ్రే మెటాలిక్ వేరియంట్లలో అందుబాటులో ఉంది. ఈ కొత్త బైక్ లో 286.1సీసీ 4 స్ట్రోక్ సింగిల్ సిలెండర్ బీఎస్6 పీజీఎం ఎఫ్ఐ ఇంజిన్ ఉంటుంది. ఇది 22.9కేడబ్ల్యూ పవర్‌ను, 27.5 ఎన్ఎం టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఈ బైక్ 6-స్పీడ్ గేర్‌బాక్స్‌తో వస్తుంది.

హోండా సీబీ300ఆర్ ధర, లభ్యత..

మన దేశ మార్కెట్లో ఈ బైక్ ధర రూ. 2.40లక్షలు(ఎక్స్ షోరూం, ఢిల్లీ)గా ఉంది. దీనిలో ఉన్న ఫీచర్లు, స్పెసిఫికేషన్ల బట్టి కేటీఎం 390 డ్యూక్, ట్రయంఫ్ స్పీడ్ 400, బీఎండబ్ల్యూ జీ 310ఆర్, టీవీఎస్ అపాచీ ఆర్టీఆర్ 310 వంటి మోడళ్లకు పోటీ ఇచ్చే అవకాశం ఉంది. హోండా సీబీ300ఆర్ బైక్ లాంచింగ్ సందర్భంగా హోండా మోటార్ సైకిల్ అండ్ స్కూటర్ ఇండియా ఎండీ, ప్రెసిడెంట్ అండ్ సీఈఓ సుత్సుము మాట్లాడుతూ తమ ఇంజినీరింగ్ నైపుణ్యం, డిజైన్ ఫిలాసఫీ, ప్రీమియం డిజైన్ యువతను ఆకర్షిస్తుందన్నారు.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..