AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Gold Purity: పండగ సీజన్‌లో బంగారం కొంటున్నారా..? గోల్డ్‌ స్వచ్ఛతను చెక్‌ చేసుకోండిలా!

ప్రజలు పెద్ద మొత్తంలో బంగారాన్ని కొనుగోలు చేస్తారు. ఇలాంటి పరిస్థితుల్లో మోసగాళ్లు నకిలీ బంగారాన్ని అంటగట్టే అవకాశం ఉంది. అందుకే జాగ్రత్తగా ఉండటం చాలా ముఖ్యం. మోసాన్ని నివారించడానికి మీరు మీ బంగారం స్వచ్ఛతను మీరే చెక్ చేసుకోవచ్చు. బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్-బిఐఎస్ ప్రజల బంగారాన్ని తనిఖీ చేయడానికి బిఐఎస్ కేర్ యాప్‌ను ప్రారంభించింది..

Gold Purity: పండగ సీజన్‌లో బంగారం కొంటున్నారా..? గోల్డ్‌ స్వచ్ఛతను చెక్‌ చేసుకోండిలా!
Gold
Subhash Goud
|

Updated on: Oct 20, 2023 | 12:12 PM

Share

మీరు పండుగ సీజన్‌లో బంగారం కొనాలనుకుంటే ఈ వార్త మీకు ఉపయోగకరంగా ఉండవచ్చు. దీపావళి, ధనత్రయోదశి సమయంలో ప్రజలు పెద్ద మొత్తంలో బంగారాన్ని కొనుగోలు చేస్తారు. ఇలాంటి పరిస్థితుల్లో మోసగాళ్లు నకిలీ బంగారాన్ని అంటగట్టే అవకాశం ఉంది. అందుకే జాగ్రత్తగా ఉండటం చాలా ముఖ్యం. మోసాన్ని నివారించడానికి మీరు మీ బంగారం స్వచ్ఛతను మీరే చెక్ చేసుకోవచ్చు. బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్-బిఐఎస్ ప్రజల బంగారాన్ని తనిఖీ చేయడానికి బిఐఎస్ కేర్ యాప్‌ను ప్రారంభించింది. యాప్‌తో బంగారం స్వచ్ఛతను ఎలా చెక్ చేయాలో తెలుసుకుందాం.

ఈ విధంగా స్వచ్ఛతను తనిఖీ చేయండి:

  • ముందుగా మీరు ప్లే స్టోర్ నుంచి అప్లికేషన్‌ను డౌన్‌లోడ్ చేసుకోవాలి.
  • దీని సహాయంతో ఏదైనా హాల్‌మార్కింగ్ ఆభరణాలను నిమిషాల్లో ఇంట్లోనే చెక్ చేసుకోవచ్చు.
  • డౌన్‌లోడ్ చేసిన తర్వాత మీరు దాన్ని ఓపెన్‌ చేయాలి. ఆ తర్వాత అందులో మీ పేరు, ఫోన్ నంబర్, ఈమెయిల్ ఐడీని నమోదు చేయాలి.
  • ఆ తర్వాత, మీ మొబైల్ నంబర్, ఇమెయిల్ ఐడిని OTT ద్వారా ధృవీకరించాల్సి ఉంటుంది.
  • ధృవీకరణ తర్వాత మీరు తనిఖీ చేయాలనుకుంటున్న ఆభరణాల HUID నంబర్‌ను నమోదు చేయండి. మీరు దాని వివరాలన్నింటినీ పొందుతారు.

ప్రభుత్వం హాల్‌మార్కింగ్‌ను మార్చింది:

గతేడాది జూలై 1 నుంచి బంగారు ఆభరణాల హాల్‌మార్క్‌ల సంఖ్యను ప్రభుత్వం మూడుకు మార్చింది. మొదటి గుర్తు BIS హాల్‌మార్క్. రెండవ చిహ్నం ప్రామాణికత గురించి చెబుతుంది. మూడవ చిహ్నం హాల్‌మార్క్ యూనిక్ ఐడెంటిఫికేషన్ (HUID) నంబర్ అని పిలువబడే ఆరు-అంకెల ఆల్ఫాన్యూమరిక్ కోడ్. HUID అంటే హాల్‌మార్క్ యూనిక్ ఐడెంటిఫికేషన్ నంబర్. ఈ ఆరు అంకెల కోడ్ అక్షరాలు, సంఖ్యలను కలిగి ఉంటుంది. హాల్‌మార్కింగ్ సమయంలో ప్రతి ఆభరణానికి హాల్‌ మార్క్‌ యూనిక్‌ ఐడెంటిఫికేషన్‌ నంబర్ కేటాయించబడుతుంది. ఈ సంఖ్య ప్రత్యేకమైనది. అంటే ఏ రెండు ఆభరణాలు ఒకే HUID సంఖ్యను కలిగి ఉండకూడదు.

ఈ యాప్ సహాయంతో, కస్టమర్‌లు ఏదైనా వస్తువు హాల్‌మార్కింగ్ లేదా ISI గుర్తును సులభంగా తనిఖీ చేయవచ్చు. ఇది మాత్రమే కాదు వినియోగదారులకు వస్తువుల నాణ్యత లేదా విశ్వసనీయతకు సంబంధించి ఏవైనా సందేహాలు లేదా ఆందోళనలు ఉంటే వారు యాప్ ద్వారా కూడా ఫిర్యాదు చేయవచ్చు. ప్రస్తుతం 24 క్యారెట్ల బంగారం ధర నిన్నటి తో పోలిస్తే రూ.100 తగ్గి క్రితం రోజుతో పోలిస్తే 10 గ్రాములకు రూ.59700 వద్ద ముగిసింది.

ఇవి కూడా చదవండి

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి