AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Indian Railways: ట్రైన్ మిస్సయితే అదే టికెట్‌పై వేరే రైలులో ప్రయాణించవచ్చా..? రైల్వేశాఖ రూల్స్ తెలిస్తే..

మీరు ముందుగానే టికెట్ బుక్ చేసుకున్నారు. అయితే స్టేషన్‌కు ముందే చేరుకోలేక ట్రైన్ మిస్సయ్యారు. ఇలాంటి సమయంలో అదే టికెట్‌పై అదే రూట్లో వెళ్లే వేరే ట్రైన్‌లో ప్రయాణించవచ్చని చాలామంది అనుకుంటుంటారు. ఇందుకు సంబంధించి రైల్వేశాఖ కఠిన నిబంధనలు అమలు చేస్తోంది. వీటి గురించి తెలుసుకోవడం చాలా ముఖ్యం.

Indian Railways: ట్రైన్ మిస్సయితే అదే టికెట్‌పై వేరే రైలులో ప్రయాణించవచ్చా..? రైల్వేశాఖ రూల్స్ తెలిస్తే..
Indian Railways
Venkatrao Lella
|

Updated on: May 22, 2026 | 3:30 PM

Share

మీరు రైల్లో ప్రయాణించేందుకు టికెట్ బుక్ చేసుకున్నారు. అయితే మీరు ట్రైన్ బయల్దేరే సమయానికి రైల్వే స్టేషన్‌కు చేరుకోలేక రైలు మిస్సయ్యారు. ఇలాంటి సమయంలో రిజర్వ్ చేసుకున్న టిక్కెట్ ఏమి చేయాలి? మీరు ఆ టిక్కెట్టుతో మరో రైలులో ప్రయాణించవచ్చా? లేదా రీఫండ్ పొందవచ్చా..? అనే విషయాలపై చాలామందికి అవగాహన ఉండదు. వీటి గురించి రైల్వేశాఖ నిబంధనలు ఎలా ఉన్నాయో ఒకసారి చూద్దాం.

రైలు మిస్సయితే..?

ప్రతి టిక్కెట్టు ఒక నిర్దిష్ట రైలు, తేదీ, తరగతి ప్రయాణానికి మాత్రమే చెల్లుబాటు అవుతుంది. మీరు బుక్ చేసుకున్న రైలు మిస్ అయితే.. సాధారణంగా అదే టిక్కెట్టుపై మరో రైలులో ప్రయాణించడానికి అనుమతి లేదు. రిజర్వుడ్ టిక్కెట్ హోల్డర్లకు ఈ నియమం కఠినంగా అమలు చేస్తారు. మీరు ఎక్స్‌ప్రెస్ రైలులో స్లీపర్ లేదా ఏసీ టిక్కెట్ బుక్ చేసుకున్నారనుకుందాం. ఆ రైలు మిస్ అయితే.. అదే టిక్కెట్టుపై మరో ఎక్స్‌ప్రెస్ రైలులో వెళ్లడం కుదరదు. టిక్కెట్టు ఉంది కదా అని ఏ రైలులోనైనా వెళ్లవచ్చని చాలామంది భావిస్తుంటారు. కానీ రైల్వేశాఖ నిబంధనలు అందుకు అనమతించవు

సాధారణ టిక్కెట్ కొంటే ఏమవుతుంది?

ఇక జనరల్ టిక్కెట్ల విషయంలో రూల్స్ మరోలా ఉన్నాయి. ముందుగా రిజర్వు చేసుకోకుండా రైల్వే స్టేషన్ కౌంటర్ లేదా రైల్ వన్ యాప్ ద్వారా అన్‌రిజర్వుడు జనరల్ టిక్కెట్ తీసుకుంటే అదే మార్గంలో ఇతర రైళ్లలో లేదా జనరల్ కోచ్‌లు ఉన్న రైళ్లలో ప్రయాణించే అవకాశం ఉంది. కానీ అది కూడా టిక్కెట్‌పై ఉన్న తేదీ, గమ్యస్థానంపై ఆధారపడి ఉంటుంది. ఒక జనరల్ టిక్కెట్ సుమారు 3 గంటలు మాత్రమే చెల్లుబాటు అవుతుంది. అందువల్ల మీరు అదే రోజున లేదా అనుమతించబడిన సమయంలోపు మరో రైలు ఎక్కితే ఎలాంటి సమస్య ఉండదు. కొన్ని ప్రత్యేక పరిస్థితులలో కనెక్టింగ్ రైలు ఆలస్యం కారణంగా తదుపరి రైలును మిస్సయితే.. మీరు స్టేషన్ అధికారులను సంప్రదించవచ్చు. అదే PNR నంబర్‌పై కనెక్టింగ్ ప్రయాణం ఉన్నట్లయితే లేదా ఆలస్యం రైల్వేల కారణంగా జరిగినట్లయితే అధికారులు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసే అవకాశముంటుంది.

 ఈ జాగ్రత్తలు తీసుకోండి..

రైలు మిస్సవ్వకుండా ఉండేందుకు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. ప్రయాణానికి కనీసం 30 నుండి 45 నిమిషాల ముందుగా రైల్వే స్టేషన్‌కు చేరుకోవాలి. ముందుగానే ప్లాట్‌ఫాం నంబర్‌ను చూసుకోవడం లేదా యాప్‌ల ద్వారా రైలు స్టేటస్ పర్యవేక్షించడం ద్వారా ఇటువంటి సమస్యలను నివారించవచ్చు.

Follow Us
ట్రైన్ మిస్సయ్యారా..? అదే టికెట్‌పై వేరే రైలులో ప్రయాణించవచ్చా..?
ట్రైన్ మిస్సయ్యారా..? అదే టికెట్‌పై వేరే రైలులో ప్రయాణించవచ్చా..?
ఉడుము గురించి మీకు తెలియని ఆసక్తికర విషయాలు..
ఉడుము గురించి మీకు తెలియని ఆసక్తికర విషయాలు..
ఇండస్ట్రీలో క్రేజీ హీరోయిన్.. రాత్రికి రాత్రే కనిపించకుండా..
ఇండస్ట్రీలో క్రేజీ హీరోయిన్.. రాత్రికి రాత్రే కనిపించకుండా..
మనుషులుగా మారే పాములు ఉన్నాయా?..స్నేక్ ఎక్స్‌పర్ట్ ఏమంటున్నారంటే
మనుషులుగా మారే పాములు ఉన్నాయా?..స్నేక్ ఎక్స్‌పర్ట్ ఏమంటున్నారంటే
IPL 2027: ధోనీతో పాటు మరో ఇద్దరు ఆటగాళ్లకు చెన్నై గుడ్ బై..?
IPL 2027: ధోనీతో పాటు మరో ఇద్దరు ఆటగాళ్లకు చెన్నై గుడ్ బై..?
ముంచుకొస్తున్న నైరుతి రుతుపవనాలు.. తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు..
ముంచుకొస్తున్న నైరుతి రుతుపవనాలు.. తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు..
ఒంటికి చలువ చేసే అదిరిపోయే ఈవెనింగ్ స్నాక్స్.. తోటకూర పకోడీ..
ఒంటికి చలువ చేసే అదిరిపోయే ఈవెనింగ్ స్నాక్స్.. తోటకూర పకోడీ..
మీకో సవాల్.. ఈ చిత్రంలో ఉన్న నెంబర్‌ను కనిపెడితే.. మీరే తోపులు!
మీకో సవాల్.. ఈ చిత్రంలో ఉన్న నెంబర్‌ను కనిపెడితే.. మీరే తోపులు!
బట్టల మురికి వదలట్లేదా?.. వాషింగ్ మెషీన్‌లో ఇదొక్కటి కలపండి!
బట్టల మురికి వదలట్లేదా?.. వాషింగ్ మెషీన్‌లో ఇదొక్కటి కలపండి!
మీ కెరీర్‌లో గ్రోత్ లేదా?.. మీరు చేసే ఈ చిన్న తప్పే కారణం
మీ కెరీర్‌లో గ్రోత్ లేదా?.. మీరు చేసే ఈ చిన్న తప్పే కారణం