AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

చిరంజీవి, మహేష్ బాబుతో బ్లాక్ బస్టర్ సినిమాలు.. కట్ చేస్తే.. అండర్‌వరల్డ్ భయంతో పత్తాలేకుండా పోయింది..

ఒకప్పుడు తెలుగులో స్టార్ హీరోయిన్లలో ఆమె ఒకరు. అందం, సహజ నటనతోపాటు గ్లామరస్ లుక్స్ తోనూ కట్టిపడేసింది. మెగాస్టార్ చిరంజీవి, రాజశేఖర్, మహేష్ బాబు వంటి స్టార్ హీరోలతో కలిసి సినిమాలు చేసింది. కానీ అండర్‌వరల్డ్ భయానక పరిస్థితుల వల్ల రాత్రికి రాత్రే కనిపించకుండా పోయింది. ఇంతకీ ఆమె ఎవరో ఎవరో గుర్తుందా.

చిరంజీవి, మహేష్ బాబుతో బ్లాక్ బస్టర్ సినిమాలు.. కట్ చేస్తే.. అండర్‌వరల్డ్ భయంతో పత్తాలేకుండా పోయింది..
Sakshi Shivanand
Rajitha Chanti
|

Updated on: May 22, 2026 | 3:27 PM

Share

90వ దశకంలో సౌత్ ఇండస్ట్రీని చాలా మంది హీరోయిన్లు ఏలేశారు. ఎలాంటి బ్యాగ్రౌండ్ సపోర్ట్ లేకుండానే సినీరంగంలోకి అడుగుపెట్టి అందం, అభినయంతో వెండితెరపై సంచలనం సృష్టించారు. అందులో ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్న సాక్షి శివానంద్ ఒకరు. తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం భాషలలో పలు చిత్రాల్లో నటించి మెప్పించింది. మెగాస్టార్ చిరంజీవి సరసన ఇద్దరు మిత్రులు, మహేష్ బాబు జోడిగా యువరాజు, రాజశేఖర్ నటించిన సింహారాశి చిత్రాలతో ఎక్కువగా పాపులర్ అయ్యింది. ఇదిలా ఉంటే.. అప్పట్లో బాలీవుడ్ అండర్‌వరల్డ్ భీభత్సంలో ఉండేది. బాలీవుడ్‌లో పెద్ద పెద్ద నిర్ణయాలు అండర్‌వరల్డ్ భయంతోనే తీసుకునేవారు. అంతేకాదు, ఇది ఎంతో మంది నటీమణుల జీవితాలను కూడా నాశనం చేసింది. అందులో సాక్షి శివానంద్ కెరీర్ సైతం పూర్తిగా మారిపోయింది.

ఎక్కువ మంది చదివినవి : Rajamouli : ఆ హీరో చాలా గొప్పోడు.. సినిమా కోసం తన జీవితాన్నే ఇచ్చేశాడు.. రాజమౌళి కామెంట్స్..

ఆమె నటించిన చిత్రాలు బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని అందుకున్నాయి. ఇప్పటకీ ఆమె రూపం ప్రేక్షకుల హృదయాలలో నిలిచిపోయింది. 1993లో వచ్చిన అన్న వదిన సినిమాతో తెలుగు తెరకు పరిచయమైంది. ఆ తర్వాత ఆమె వెనుదిరిగి చూడలేదు. 1997లో మాస్టారు, యువరాజు, రాజహంస, కలెక్టర్ గారు, యమజాతకుడు, హోమం వంటి చిత్రాలతో తెలుగులో టాప్ హీరోయిన్ అయ్యింది. కెరీర్ మంచి పీక్స్ లో ఉండగానే ఆమెకు అండర్‌వరల్డ్ నుండి ఫోన్ కాల్స్ రావడం మొదలయ్యాయి. ఆ తర్వాత, తాను నటిస్తున్న సినిమా నిర్మాతకు అండర్‌వరల్డ్‌తో సంబంధాలు ఉన్నాయని తెలియడంతో ఆమె సినిమాల నుంచి తప్పుకుంది.

ఎక్కువ మంది చదివినవి : Tollywood : ఆ వాన పాట వల్లే హీరోయిన్‏గా సినిమాలు చేయడం మానేశా.. అసలు విషయం చెప్పిన టాలీవుడ్ నటి.

2013లో ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో సాక్షి మాట్లాడుతూ, ‘ఆ సినిమా నిర్మాత అండర్‌వరల్డ్‌కు చెందినవాడని తెలిసినప్పుడు నేను చాలా భయపడ్డాను. నేను బాలీవుడ్‌ను విడిచిపెట్టి తెలుగు, కన్నడ చిత్రాలలో నటించడం మొదలుపెట్టాను. నేను అందరితో సంబంధాలు తెంచుకున్నాను. బాలీవుడ్‌లో నా కెరీర్ నాశనమైందని అప్పుడే నాకు తెలిసింది. కానీ అప్పుడు నేను భయపడకపోయి ఉంటే, ఇప్పటికీ బాలీవుడ్‌లో చురుకుగా ఉండేదాన్ని. కానీ నేను బాలీవుడ్ వదిలి పారిపోయాను. ‘టూమ్’ సినిమా నిర్మాత నాకు నిరంతరం ఫోన్ చేసేవాడు… అందుకే నేను నా నంబర్ మార్చుకోవాల్సి వచ్చింది… నేను ఎక్కడున్నానో ఎవరికీ తెలియదు… దీనికి నేను పెద్ద మూల్యం చెల్లించాల్సి వచ్చింది. నా కెరీర్‌ను కోల్పోవాల్సి వచ్చింది…’ అని అన్నారు. ప్రస్తుతం సినిమాలకు దూరంగా ఉన్న ఆమె అటు సోషల్ మీడియాలోనూ అంతగా యాక్టివ్ గా లేదు.

ఎక్కువ మంది చదివినవి : Gunashekar: ఆ హీరో చిన్నప్పుడు కూచిపూడి డ్యాన్స్ చేస్తే.. రవింద్రభారతిలో విజిల్స్ మారుమోగాయి.. డైరెక్టర్ గుణశేఖర్..

ఎక్కువ మంది చదివినవి :  Surya S/o Krishnan: హార్ట్ టచింగ్.. కుర్రాళ్ల మనసును కదిలించే సాంగ్.. ‘చంచల’ పాట వెనుక ఇంత స్టోరీ ఉందా..

Follow Us