AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Ration Card: రేషన్‌ కార్డు ఉన్నవారికి అదిరిపోయే గుడ్‌న్యూస్.. చక్కెర, గోధుమ పిండి, కందిపప్పు కూడా పంపిణీ.. పండుగ చేస్కోండి..

రేషన్ కార్డు ఉన్నవారికి ఏపీ ప్రభుత్వం శుభవార్త అందించింది. రేషన్ షాపుల ద్వారా తక్కువ ధరకు షుగర్, కందిపప్పు, గోధుమ పిండి, పామాయిల్ వంటివి అందించనుంది. ఈ మేరకు మంత్రి నాదెండ్ల మనోహర్ ప్రకటించారు. ఇటీవల ఎల్‌నివో ప్రభావంతో మార్కెట్లో నిత్యావస సరుకుల ధరలు పెరిగాయి.

Ration Card: రేషన్‌ కార్డు ఉన్నవారికి అదిరిపోయే గుడ్‌న్యూస్.. చక్కెర, గోధుమ పిండి, కందిపప్పు కూడా పంపిణీ.. పండుగ చేస్కోండి..
Ration Shop
Venkatrao Lella
|

Updated on: Oct 01, 2026 | 3:56 PM

Share

ఏపీ ప్రజలకు కూటమి ప్రభుత్వం మరో గుడ్ న్యూస్ తెలిపింది. ఇప్పటికే రేషన్ షాపుల ద్వారా సబ్సిడీపై బియ్యం పంపిణీ చేస్తుండగా.. ఇక మినీ మార్టుల ద్వారా చౌక ధరకే నిత్యావసర సరుకులు అందిస్తోంది. ఈ క్రమంలో ఏపీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. కందిపప్పు, చక్కెర, గోధు పిండి, పామాయిల్ రాయితీ ధరపై పంపిణీ చేయాలని నిర్ణయం తీసుకుంది. ఉల్లి ధరలు పెరగడంతో రైతు బజార్లు ద్వారా వాటిని కిలో రూ.35కే ప్రభుత్వం విక్రయిస్తోంది. ఇప్పుడు అదే తరహాలో నిత్యావసర సరుకులైన గోధుమపిండి, కందిపప్పు, చక్కెర, పామాయిల్‌ను అతి తక్కువ ధరకే అందించనుంది. ఈ విషయాన్ని మంత్రి నాదెండ్ల మనోహర్ అధికారికంగా ప్రకటించారు. బహిరంగ మార్కెట్లో నిత్యావసర వస్తువుల ధరలు ఇటీవల భారీగా పెరిగాయి. ఎల్‌నివో ప్రభావంతో ధరలు చుక్కలు చూపిస్తుండటంతో సామాన్యులు బెంబేలెత్తిపోతున్నారు.

సామాన్యులకు ధరల భారం తగ్గించేందుకు ఏపీ ప్రభుత్వం చౌక ధరకే నిత్యావసర సరుకులను అందించనుంది. రేషన్ షాపుల ద్వారా కందిపప్పు, గోధుమపిండి, చక్కెర, పామాయిల్ తక్కువ ధరకు అందించనున్నారు. ఏపీకి కేంద్రం 1.20 లక్షల కందిపప్పును అందించేందుకు ముందుకొచ్చింది. వీటిని చౌక దుకాణాల ద్వారా పేదలకు తక్కువ ధరకు అందించనున్నారు. ఎల్‌నివో ప్రభావం వల్ల దేశవ్యాప్తంగా నిత్యావసర సరుకుల ధరలు భారీగా పెరిగాయి. పప్పు ధాన్యాలు, వంటనూనె, పంచదార ధరలు పెరగడంతో సామాన్యులకు నెలవారీ ఖర్చు పెరుగుతోంది. అటు ఉల్లిపాయల ధరలు కిలో రూ.60 నుంచి రూ.70కి చేరుకున్నాయి. దీంతో రైతు బజార్ల ద్వారా కిలో రూ.35కే ప్రభుత్వం అందిస్తోంది. ఆధార్ కార్డు లేదా రేషన్ కార్డును చూపించి ఉల్లిపాయలను కొనుగోలు చేయవచ్చు.

ప్రతీ కుటుంబానికి నెలకు 2 కిలోల చొప్పున సబ్సిడీపై ఉల్లిపాయలు అందించనున్నారు. రాష్ట్రవ్యాప్తంగా 130 రైతుబజార్లలో ప్రత్యేక కేంద్రాల ద్వారా ఉల్లిపాయలను సబ్సిడీ ధరలపై అందిస్తున్నారు. దీంతో ప్రజలు తమ ఆధార్, రేషన్ కార్డును చూపించి ఉల్లిపాయలను తక్కువ ధరకు తీసుకెళ్తున్నారు. కేంద్రం నుంచి త్వరలో 1.20 లక్షల టన్నుల కందిపప్పు రానుండగా.. వీటిని రేషన్ షాపుల ద్వారా పేదలకు అందించనున్నారు. ఇక కందిపప్పుతో పాటు గోధుమపిండి, చక్కెర, పామాయిల్ కూడా తక్కువ ధరకు పంపిణీ చేయనున్నారు. దీని వల్ల సామాన్యులకు నిత్యావసర సరుకుల భారం తగ్గుతుంది. గతంలో రేషన్ షాపుల ద్వారా చక్కెర, కందిపప్పు పంపిణీ చేయగా.. ఆ తర్వాత నిలిపివేశారు. ఇప్పుడు మళ్లీ ప్రారంభించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. త్వరలోనే రాష్ట్రవ్యాప్తంగా రేషన్ షాపుల్లో ఇవి అందుబాటులోకి వచ్చే అవకాశముంది.

Follow Us