AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఏపీలో నవంబర్ 3న సెలవు.. వరుసగా మూడు రోజులు హాలిడేస్!

AP Local Body Elections Holiday: ఆంధ్రప్రదేశ్‌లో ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల నేపథ్యంలో నవంబర్ 3న పోలింగ్ జరిగే ప్రాంతాల్లో ఉద్యోగులు, కార్మికులకు సెలవు కల్పించనున్నారు. నవంబర్ 2న కొన్ని ప్రభుత్వ కార్యాలయాలు, విద్యాసంస్థలకు స్థానిక సెలవు ప్రకటించనున్నారు. నవంబర్ 1 ఆదివారం కావడంతో కొందరికి వరుసగా మూడు రోజుల సెలవులు వచ్చే అవకాశం ఉంది.

ఏపీలో నవంబర్ 3న సెలవు.. వరుసగా మూడు రోజులు హాలిడేస్!
Ap Local Body Elections Holiday
Rajinikanth Vellalacheruvu
| Edited By: |

Updated on: Oct 21, 2026 | 9:44 AM

Share

ఆంధ్రప్రదేశ్‌లో స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో ఉద్యోగులు, కార్మికులకు సెలవులపై ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు జరిగే ప్రాంతాల్లో నవంబర్ 3న పోలింగ్ సందర్భంగా ప్రభుత్వ, ప్రైవేట్ సంస్థల్లో పనిచేసే ఉద్యోగులు, దుకాణాల కార్మికులకు సెలవు కల్పించనున్నారు. ఈ మేరకు అవసరమైన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సాయిప్రసాద్ అధికారులను ఆదేశించారు.

ఎన్నికల నిర్వహణకు సంబంధించిన ప్రభుత్వ కార్యాలయాలు, విద్యాసంస్థలకు నవంబర్ 2న స్థానిక సెలవు ప్రకటించనున్నారు. నవంబర్ 1 ఆదివారం కావడంతో కొన్ని వర్గాల ఉద్యోగులకు వరుసగా మూడు రోజుల సెలవులు వచ్చే అవకాశం ఉంది. అయితే, సెలవులు ఆయా ప్రాంతాలు, సంస్థలకు వర్తించే అధికారిక ఉత్తర్వులపై ఆధారపడి ఉంటాయి.

మరోవైపు, స్థానిక సంస్థల ఎన్నికల విధుల నుంచి 60 ఏళ్లు పైబడిన ఉపాధ్యాయులకు మినహాయింపు ఇవ్వాలని మాజీ ఎమ్మెల్సీ ఏఎస్ రామకృష్ణ ప్రభుత్వాన్ని కోరారు. ఎన్నికల శిక్షణకు హాజరుకాని 23 మంది ఉపాధ్యాయులపై విధించిన సస్పెన్షన్‌ను ఎత్తివేయాలని విజ్ఞప్తి చేశారు.

ఇదిలా ఉండగా, మున్సిపల్ కార్పొరేషన్లు, మున్సిపాలిటీలు, నగర పంచాయతీల ఎన్నికల పోలింగ్ జరిగే ప్రాంతాల్లో అక్టోబర్ 28న స్థానిక సెలవు ప్రకటించే అధికారాన్ని ప్రభుత్వం జిల్లా కలెక్టర్లకు ఇచ్చింది. ఆయా ప్రాంతాల్లో ప్రభుత్వ, ప్రైవేట్ సంస్థల ఉద్యోగులకు ఈ సెలవు వర్తించనుంది.

కాగా, రాష్ట్ర ఎన్నికల సంఘం 9,829 ఎంపీటీసీ, 659 జెడ్పీటీసీ స్థానాలకు నోటిఫికేషన్ విడుదల చేసింది. అక్టోబర్ 21 నుంచి నామినేషన్ల ప్రక్రియ ప్రారంభం కాగా, నవంబర్ 3న పోలింగ్, నవంబర్ 5న ఓట్ల లెక్కింపు జరగనున్నాయి. అదే రోజు ఫలితాలు ప్రకటించనున్నారు. నామినేషన్ల స్వీకరణ కేంద్రాల్లో వెబ్‌కాస్టింగ్ ఏర్పాట్లు చేయాలని అధికారులు ప్రణాళిక రూపొందించారు.

శ్రీకాకుళం జిల్లాలో..

జిల్లాలో ZPTC, MPTC ఎన్నికలకు సంబంధించి నేటి నుంచి అభ్యర్థుల నుంచి నామినేషన్ల స్వీకరించనున్నారు. జిల్లాలో 30 ZPTC స్థానాలు,542 MPTC స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. ఇచ్చాపురం, పలాస మున్సిపాలిటిల ఎన్నికలకు సంబంధించి నామినేషన్ల విత్ డ్రాకి అభ్యర్థులకు నేడు అవకాశం ఇచ్చారు.

Follow Us