AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

రోజూ పచ్చ గడ్డిపై చెప్పులు లేకుండా నడిస్తే ఎన్ని ఆరోగ్య లాభలో తెలుసా?

నేటి ఆధునిక జీవనశైలిలో చాలామంది ఉదయం లేచిన దగ్గరి నుంచి రాత్రి పడుకునే వరకు ఇళ్లలో, ఆఫీసుల్లో ఎల్లప్పుడూ చెప్పులు లేదా షూస్ ధరించే ఉంటున్నారు. అయితే, పాదాలకు ఎలాంటి రక్షణ లేకుండా కేవలం నేలపై లేదా పచ్చని గడ్డిపై నడవడం వల్ల శరీరానికి కలిగే ఆరోగ్య ప్రయోజనాలు మాత్రం చాలా తక్కువ మందికి మాత్రమే తెలుసు. దీనినే ఇంగ్లీషులో బేర్‌ఫుట్ వాకింగ్ లేదా గ్రౌండింగ్ అంటారు. ప్రతిరోజూ కేవలం 15 నుంచి 30 నిమిషాలు పచ్చగడ్డిపై చెప్పులు లేకుండా నడవడం వల్ల శారీరకంగా, మానసికంగా ఎన్నో అద్భుతమైన మార్పులు సంభవిస్తాయని ఆరోగ్య నిపుణులు వెల్లడిస్తున్నారు.

Jyothi Gadda
|

Updated on: Oct 21, 2026 | 2:11 PM

Share
ఉదయాన్నే పార్కులు లేదా ఖాళీ ప్రదేశాల్లోని పచ్చటి గడ్డిపై చెప్పులు లేదా బూట్లు లేకుండా నడవడం ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుందని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. దీన్ని ఎర్తింగ్ లేదా గ్రౌండింగ్ అని పిలుస్తారు. రోజూ కనీసం 15 నుంచి 30 నిమిషాల పాటు పచ్చగడ్డిపై నడవడం వల్ల ఒత్తిడి, ఆందోళనలను తగ్గించే కార్టిసాల్ హార్మోన్ అదుపులోకి వస్తుంది. ఈ చిన్న అలవాటు అద్భుతంగా సహాయపడుతుంది.

1 / 5
ఒత్తిడి దూరం - మానసిక ప్రశాంతత: నేటి బిజీ లైఫ్‌లో టెన్షన్లు, ఆందోళనలు సర్వసాధారణం అయిపోయాయి. పచ్చని గడ్డిపై చెప్పులు లేకుండా నడవడం వల్ల ప్రకృతితో అనుబంధం ఏర్పడి మనసు ప్రశాంతంగా మారుతుంది. శరీరం నేరుగా భూమిని తాకడం వల్ల నాడీ వ్యవస్థ శాంతిస్తుంది. ఇది ఒత్తిడిని కలిగించే కార్టిసాల్ హార్మోన్ స్థాయిలను తగ్గించి, మెదడును రిలాక్స్ చేస్తుంది.

2 / 5
రక్త ప్రసరణ మెరుగుదల - గుండె ఆరోగ్యం: పాదాల చర్మం నేలతో లేదా గడ్డితో ప్రత్యక్ష సంబంధంలోకి వచ్చినప్పుడు, అరికాళ్లలో ఉండే నరాల ప్రెజర్ పాయింట్లు ఉత్తేజితమవుతాయి. దీనివల్ల శరీరంలోని అన్ని భాగాలకు రక్తం సరఫరా మెరుగుపడుతుంది. రక్తపోటు (BP) అదుపులో ఉండటానికి, గుండె పనితీరు సజావుగా సాగడానికి ఈ చిన్న అలవాటు ఎంతో దోహదపడుతుంది.

3 / 5
నిద్రలేమికి చెక్: చాలా మందిని వేధించే ప్రధాన సమస్య నిద్రలేమి. రోజూ గడ్డిపై చెప్పులు లేకుండా నడవడం వల్ల భూమి నుంచి వచ్చే సహజ ఎలక్ట్రాన్లు శరీరంలోకి ప్రవేశిస్తాయి. ఇవి నిద్రను నియంత్రించే మెలటానిన్ హార్మోన్ ఉత్పత్తిపై సానుకూల ప్రభావం చూపుతాయి. ఫలితంగా రాత్రిళ్లు చక్కటి, గాఢమైన నిద్ర పడుతుంది.

4 / 5
పాదాల బలం - రోగనిరోధక శక్తి: గడ్డి మెత్తటి ఉపరితలం కావడం వల్ల పాదాల కండరాలు, లిగమెంట్స్, చీలమండల కదలికలు మెరుగవుతాయి. అరికాళ్ల నొప్పులు తగ్గుతాయి. అలాగే శరీరంలో వాపులను తగ్గించి, రోగనిరోధక శక్తిని పెంపొందించడంలోనూ ఇది సహజమైన ఔషధంలా పనిచేస్తుంది. మధుమేహం ఉన్నవారు కూడా తగిన జాగ్రత్తలు తీసుకుంటూ గడ్డిపై నడవడం మంచిదని నిపుణులు సూచిస్తున్నారు. కనుక, మీ దినచర్యలో కాస్త సమయం కేటాయించి పచ్చగడ్డిపై నడకను అలవాటు చేసుకోండి.

5 / 5
Follow Us