Bigg Boss 10 Telugu : రెండు రోజులకే 15 లక్షలు తీసుకున్నా.. తర్వాత బిగ్ బాస్ టీం నాతో చెప్పిన మాట ఇదే..
బిగ్ బాస్ తెలుగు 10 నుండి మిథిలేష్ రెడ్డి 15 లక్షల ప్రైజ్‌మనీతో బయటికి రావడం సోషల్ మీడియాతోపాటు బుల్లితెర ప్రపంచంలోనూ హాట్ టాపిక్ అయిన సంగతి తెలిసింది. కేవలం రెండు రోజులకే దాదాపు రూ.15 లక్షలు సూట్ కేస్ తీసుకుని బయటకు వచ్చి అందరినీ ఆశ్చర్యపరిచాడు. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో మిథిలేష్ మాట్లాడుతూ.. వైల్డ్ కార్డ్‌గా టైటిల్ గెలవడం అసాధ్యమని, చరిత్ర సృష్టించడమే లక్ష్యంగా ఈ నిర్ణయం తీసుకున్నానని స్పష్టం చేశారు. ఈ కదలిక కుటుంబానికి ఆనందం కలిగించిందని అన్నారు.

బిగ్ బాస్ తెలుగు 10 నుండి మిథిలేష్ రెడ్డి 15 లక్షల ప్రైజ్‌మనీతో బయటికి రావడం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అయిన సంగతి తెలిసిందే. కేవలం రెండు రోజులకే మిథిలేష్ ఈ నిర్ణయం తీసుకోవడం పై నెటిజన్స్, ప్రేక్షకులు అతడికి మద్దతు తెలిపారు. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో మిథిలేష్ మాట్లాడుతూ.. బిగ్ బాస్ హౌస్‌లోకి వైల్డ్ కార్డ్‌గా అడుగుపెట్టిన ఆయన, విజేతగా నిలవడం దాదాపు అసాధ్యమని ముందుగానే అంచనా వేసినట్లు తెలిపారు.. ఈ సీజన్‌లో త్రిగుణ్, ముఖేష్, రోహిత్ వంటివారు టాప్ 3 స్థానాలకు గట్టి పోటీనిస్తున్నారని, ఈ స్థానాలు ఇప్పటికే నిర్ణయించబడినట్లు తనకు అనిపించిందని మిథిలేష్ పేర్కొన్నారు. తన నిర్ణయం పట్ల తల్లిదండ్రులు అత్యంత సంతోషంగా ఉన్నారని, ఇది “అరుదైన ఘనత” అని, ఎక్కడా పునరావృతం కాని “మోస్ట్ మెమరబుల్ మూమెంట్స్”లో ఒకటిగా నిలిచిపోతుందని మిథిలేష్ అన్నారు. భవిష్యత్తులో ఏదైనా పెద్ద ప్రాజెక్టులు చేపట్టాలనుకున్నా, ఈ “బిగ్ బాస్ కంటెస్టెంట్” అనే ముద్ర తనను పరిమితం చేయదని, చాలా తక్కువ మంది చూశారు కాబట్టి తాను ఇప్పటికీ పరిశ్రమకు ఒక మిస్టరీలానే ఉన్నానని అన్నారు. తనకు ఎటువంటి విచారం లేదని, ఈ నిర్ణయం జీరో రిగ్రెట్స్ అని చెప్పారు.
అగ్నిపరీక్ష టాస్క్‌లో తన ప్రదర్శనను గుర్తు చేసుకుంటూ, తాను డు ఆర్ డై అన్నట్టు ఆడానని, తనను తాను నిరూపించుకోవాలనే కసి ఉండేదని చెప్పారు. తనకు 15 లక్షల ఆఫర్ రాకపోయి ఉంటే, “వాట్ ఎవర్ ఇట్ టేక్స్” అంటూ టాప్ 5 కోసం చివరి వరకు పోరాడి ఉండేవాడినని తెలిపారు. ఒకవేళ ఆ డబ్బు తీసుకోకుండా హౌస్‌లో కొనసాగి ఉంటే, తను బయటికి వెళ్లాలనుకున్నాడనే నెగెటివ్ నరేటివ్ తనపై నడిచేదని, అది 14 వర్సెస్ 1 పరిస్థితికి దారితీసి ఉండేదని వివరించారు. బయటికి వచ్చిన తర్వాత 95% సానుకూల స్పందన వచ్చిందని, “ఈజీ మనీ” అంటూ వచ్చిన ట్రోల్స్ కేవలం 5% మాత్రమేనని మిథిలేష్ అన్నారు. అగ్నిపరీక్షను అధిగమించి, ప్రజల మద్దతు పొంది, వైల్డ్ కార్డ్‌గా హౌస్‌లోకి ప్రవేశించి, ఈ నిర్ణయం తీసుకోవడం సులభమైనది కాదని ఆయన స్పష్టం చేశారు. అగ్నిపరీక్ష సమయంలో రెమ్యూనరేషన్ ఉండదని, కేవలం కాస్ట్యూమ్స్ కోసం 50,000 మాత్రమే ఇచ్చారని చెప్పారు. బిగ్ బాస్ బృందం కూడా తాను “చరిత్ర సృష్టించానని” చెప్పిందని, ఇది తన నిర్ణయం ఎంత ముఖ్యమైనదో తెలియజేసిందని అన్నారు.
తన నిష్క్రమణకు కీలక పాత్ర పోషించిన అమన్ గురించి మాట్లాడుతూ, అమన్‌కు తాను స్టేజ్‌పైనే తగిన సలహా ఇచ్చానని, తన వీటో ఓటుకు ప్రతీకారం తీర్చుకున్నానని చెప్పారు. కేవలం రెండు రోజుల్లోనే తాను బిగ్ బాస్ హౌస్ అనుభవాన్ని పూర్తిగా పొందానని, టాస్క్‌లు, భోజనం, లాండ్రీ, సరదా కార్యక్రమాలు అన్నీ చేశానని, కాబట్టి హౌస్‌ను మిస్ అవుతున్నట్లు అనిపించడం లేదని వెల్లడించారు. త్రిగుణ్ తన నిర్ణయాన్ని ఆపడానికి ప్రయత్నించడం సరైనదేనని, అయితే ఉపయోగించిన పదాలు మరింత మెరుగ్గా ఉండేవని మిథిలేష్ అన్నారు. ముఖేష్ తనపై వ్యక్తిగతంగా వ్యాఖ్యానించాడని, అది ఆటగా కాకుండా వ్యక్తిగత దాడిగా అనిపించిందని మిథిలేష్ పేర్కొన్నారు. తాను బిగ్ బాస్ హౌస్‌లో చూసిన మిథిలేష్‌గా, అగ్నిపరీక్షలో చూసిన మిథిలేష్‌గా, ఇప్పుడు చూస్తున్న మిథిలేష్‌గా ఎటువంటి మార్పు లేదని వివరించారు. సందీప్ రెడ్డి గారి సినిమాలో లీడ్ రోల్ ఆఫర్ వచ్చినా, బిగ్ బాస్ టైటిల్ గెలుచుకోవడం ముఖ్యమా అంటే తాను సినిమానే ఎంచుకుంటానని గతంలోనే చెప్పినట్లు గుర్తు చేశారు. వైల్డ్ కార్డ్‌గా టైటిల్ గెలవడం అద్భుతమని, కానీ అది అరుదుగా జరిగే విషయమని, అలాంటప్పుడు ఖాళీ చేతులతో తిరిగి రావడం కంటే చరిత్ర సృష్టించడం మంచిదని చెప్పుకొచ్చారు. 5 లక్షలు లేదా 10 లక్షలు అయితే అంగీకరించి ఉండేవాడిని కాదని, 15 లక్షలు (మొత్తం ప్రైజ్‌మనీలో 30%) అనేది ముఖ్యమైన మొత్తమని, ఇది మూడో స్థానానికి సమానమని, అందుకే ఆ మొత్తానికి అంగీకరించానని మిథిలేష్ అన్నారు.
ఎక్కువ మంది చదివినవి : Megastar Chiranjeevi: చిరంజీవి, అనుష్క కాంబోలో మిస్సైన సినిమా.. కట్ చేస్తే.. ఆ హీరోయిన్‌తో బాస్ బ్లాక్ బస్టర్ హిట్..




