AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Jr.NTR: సర్జరీ తర్వాత మొదటిసారి ఫ్యాన్స్ ముందుకు ఎన్టీఆర్.. డ్రాగన్ సినిమా పై క్రేజీ అప్డేట్ ఇచ్చిన తారక్..

మలయాళ వర్సటైల్ నటుడు ఫహద్ ఫాజిల్ కథానాయకుడిగా నటిస్తున్న చిత్రం ‘డోంట్ ట్రబుల్ ది ట్రబుల్’. ఈ చిత్ర ప్రీ-రిలీజ్ వేడుకకు మ్యాన్ ఆఫ్ మాసెస్ జూనియర్ ఎన్టీఆర్ ముఖ్య అతిథిగా హాజరై సందడి చేశారు. ఇటీవలే చేతికి సర్జరీ పూర్తయి కోలుకున్న ఎన్టీఆర్, త్వరలోనే తన తదుపరి చిత్రం ‘డ్రాగన్’ షూటింగ్‌లో పాల్గొంటానని స్పష్టం చేశారు.

Jr.NTR: సర్జరీ తర్వాత మొదటిసారి ఫ్యాన్స్ ముందుకు ఎన్టీఆర్.. డ్రాగన్ సినిమా పై క్రేజీ అప్డేట్ ఇచ్చిన తారక్..
Jr.ntr
Rajitha Chanti
|

Updated on: Sep 29, 2026 | 10:18 PM

Share

మ్యాన్ ఆఫ్ మాసెస్ జూనియర్ ఎన్టీఆర్ చాలా రోజుల విరామం తర్వాత మళ్లీ పబ్లిక్ ఈవెంట్‌లో కనిపించి అభిమానుల్లో సరికొత్త ఉత్సాహాన్ని నింపారు. మలయాళ వర్సటైల్ నటుడు ఫహాద్ ఫాజిల్ కథానాయకుడిగా నటిస్తున్న ‘డోంట్ ట్రబుల్ ది ట్రబుల్’ చిత్ర ప్రీ-రిలీజ్ వేడుక హైదరాబాద్‌లోని JRC కన్వెన్షన్‌లో ఘనంగా జరిగింది. ఈ ఈవెంట్‌కు ముఖ్య అతిథిగా హాజరైన తారక్, తన ఎనర్జిటిక్ స్పీచ్‌తో సభను హోరెత్తించారు. వేదికపై ఎన్టీఆర్ మాట్లాడుతూ.. నటుడిగా తాను ఎంతో ఇష్టపడే , అభిమానించే అతికొద్ది మంది కళాకారుల్లో ఫహద్ ఫాజిల్ ప్రథముడని అన్నారు. “కోవిడ్ సమయంలో ఫహద్ నటించిన చిత్రాలు ఎంతోమందికి ఉపశమనాన్నిచ్చాయి. ‘బెంగళూర్ డేస్’ సినిమా నుంచి ఆయన నటనా వైవిధ్యాన్ని గమనిస్తున్నాను. భారతీయ చిత్రసీమ గర్వించదగ్గ నటుల్లో ఆయన ఒకరు. ఈ సినిమాతో లీడ్ నటుడిగా తెలుగులో ఆయనకి అద్భుతమైన విజయం అందాలని కోరుకుంటున్నాను” అని అన్నారు.

తన సినీ ప్రస్థానాన్ని గుర్తుచేసుకుంటూ ఎన్టీఆర్ ఎమోషనల్ అయ్యారు. 2000 నవంబర్‌లో ‘నిన్ను చూడాలని’ సినిమా ప్రారంభోత్సవానికి ఒక్కడినే వెళ్లిన క్షణాన్ని గుర్తు చేసుకున్నారు. “ఆ రోజు నా పక్కన కుటుంబ సభ్యులెవరూ లేరనే చిన్న బాధ ఉండేది. కానీ ఆ తర్వాత ప్రేక్షకులు, అభిమానులే నా వెన్నుముకగా నిలిచారు. అలాగే రాజమౌళి (జక్కన్న), కీరవాణి గార్ల కుటుంబం నాకు దేవుడిచ్చిన సొంత కుటుంబంగా మారింది. ‘స్టూడెంట్ నెంబర్ 1’ విడుదలై 25 ఏళ్లు పూర్తయిన సందర్భంలో, అదే వేదికపై రాజమౌళితో కలిసి నిలబడటం ఎంతో ఆనందంగా ఉంది” అని తెలిపారు.

ఈ చిత్రంతో నిర్మాతగా మారుతున్న ఎస్‌ఎస్ రాజమౌళి కుమారుడు ఎస్‌ఎస్ కార్తికేయను ఎన్టీఆర్ తన స్వంత తమ్ముడిలా భావిస్తానని చెప్పారు. “బాహుబలి, ఆర్‌ఆర్‌ఆర్ సినిమాల సమయంలో కార్తికేయ వహించిన బాధ్యత, అందించిన సహకారం మరువలేనిది. నా కష్టసుఖాల్లో తోడుగా నిలిచిన తమ్ముడు కార్తికేయ ప్రొడ్యూసర్‌గా విజయం సాధించాలి” అని కోరారు. అలాగే దర్శకుడు శశాంక్ పట్టుదలను ప్రశంసిస్తూ, ఈ సినిమా అందరికీ మంచి పేరు తేవాలని కోరుకున్నారు. చివరగా, “ఎవరినీ ట్రబుల్ చేయకండి.. డోంట్ ట్రబుల్ ది ట్రబుల్, ఇఫ్ యు ట్రబుల్ ది ట్రబుల్, ది ట్రబుల్ విల్ ట్రబుల్ యు” అంటూ తనదైన శైలిలో డైలాగ్ చెప్పి అభిమానులను ఉర్రూతలూగించారు.

Follow Us