AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Washing Machine Hacks: మీ బట్టలు తెల్లగా, సువాసనభరితంగా మారాలా? ఖరీదైన లిక్విడ్స్ వద్దు.. కిచెన్‌లోని ఈ వస్తువు చాలు!

ఈ రోజుల్లో ప్రతి ఇంట్లోనూ వాషింగ్ మెషీన్ అనేది నిత్యావసర వస్తువుగా మారిపోయింది. ఎంత ఖరీదైన డిటర్జెంట్ పౌడర్లు, లిక్విడ్‌లు వాడినా కొన్నిసార్లు బట్టలపై జిడ్డు మరకలు, కాలర్ మురికి అలాగే ఉండిపోతుంటాయి. పైగా వర్షాకాలం లేదా ఎండ తీవ్రత సరిగ్గా లేనప్పుడు బట్టల నుంచి ఒక రకమైన ముక్కుడు వాసన (చెడు వాసన) వస్తుంటుంది. అయితే మీ బట్టలు బార్ సోప్ పెట్టి రుద్దినట్లు తెల్లగా మెరవాలన్నా, ఎలాంటి బ్యాక్టీరియా, దుర్వాసన లేకుండా సువాసనలు వెదజల్లాలన్నా వాషింగ్ మెషీన్‌లో డిటర్జెంట్‌తో పాటు మన వంటగదిలో ఉండే ఒకే ఒక్క సీక్రెట్ వస్తువును చేరిస్తే చాలు.

Washing Machine Hacks: మీ బట్టలు తెల్లగా, సువాసనభరితంగా మారాలా? ఖరీదైన లిక్విడ్స్ వద్దు.. కిచెన్‌లోని ఈ వస్తువు చాలు!
Washing Machine Hacks,
Bhavani
|

Updated on: May 22, 2026 | 3:04 PM

Share

బట్టలను శుభ్రం చేయడానికి మరియు వాషింగ్ మెషీన్ లోపల పేరుకుపోయిన స్కేలింగ్‌ను వదిలించడానికి మన కిచెన్ లో ఉండే ‘వెనిగర్’, ‘బేకింగ్ సోడా’ అద్భుతంగా పనిచేస్తాయి. ఇవి బట్టల రంగును పాడుచేయకుండా మురికిని ఎలా వదిలిస్తాయి? ఆ అద్భుతమైన హోమ్ హ్యాక్ ఏంటో ఇప్పుడు చూద్దాం.

1. మొండి మరకలను వదిలిస్తుంది: బట్టలపై టీ మరకలు, కాఫీ మరకలు లేదా కూరగాయల జిడ్డు పడినప్పుడు నేరుగా మెషీన్‌లో వేస్తే అవి వదలవు. అలాంటప్పుడు బట్టలు ఉతికే ముందు వాషింగ్ మెషీన్ డిటర్జెంట్ కంపార్ట్‌మెంట్‌లో అర కప్పు వైట్ వెనిగర్ వేయాలి. వెనిగర్‌లోని ఎసిడిక్ గుణాలు బట్టల నూలుకు నష్టం కలిగించకుండా మొండి మరకలను క్షణాల్లో వదిలిస్తాయి.

2. ముక్కుడు వాసనకు చెక్: చాలా మంది ఎదుర్కొనే ప్రధాన సమస్య బట్టలు ఉతికిన తర్వాత కూడా వాటి నుంచి వచ్చే చెడు వాసన. బట్టలు వేసేటప్పుడు డిటర్జెంట్‌తో పాటు ఒక రెండు చెంచాల బేకింగ్ సోడా వేయడం వల్ల బట్టలలోని చెడు వాసన పూర్తిగా మాయమవుతుంది. బట్టలు ఎంతో ఫ్రెష్‌గా మారతాయి.

3. బట్టల రంగులు మారకుండా.. కొత్త బట్టలు వేసినప్పుడు వాటి రంగులు వేరే బట్టలకు అంటుకుంటాయనే భయం ఉంటుంది. అలాగే తెల్ల బట్టలు కొన్ని రోజులకి పసుపు రంగులోకి మారిపోతుంటాయి. వాషింగ్ మెషీన్ రన్ అవుతున్నప్పుడు కొద్దిగా వెనిగర్ జోడించడం వల్ల తెల్లటి బట్టలు మరింత బ్రైట్‌గా మారుతాయి, రంగు బట్టల కలర్ అస్సలు మసకబారదు.

4. ఫ్యాబ్రిక్ సాఫ్ట్‌నర్ లా పనిచేస్తుంది: మార్కెట్లో దొరికే కాస్ట్లీ ఫ్యాబ్రిక్ కండిషనర్ల కంటే వెనిగర్ ఎంతో మేలైనది. ఇది బట్టలను చాలా మృదువుగా (సాఫ్ట్‌గా) మారుస్తుంది. ముఖ్యంగా పిల్లల బట్టలు, టవల్స్ ఉతికేటప్పుడు వెనిగర్ వాడితే అవి గరుకుగా మారకుండా ఉంటాయి.

5. వాషింగ్ మెషీన్ కూడా క్లీన్ అవుతుంది: ఈ చిట్కా పాటించడం వల్ల బట్టలు శుభ్రపడటమే కాకుండా.. వాషింగ్ మెషీన్ డ్రమ్ లోపల పేరుకుపోయే డిటర్జెంట్ వ్యర్థాలు, హార్డ్ వాటర్ మరకలు (స్కేలింగ్) కూడా క్లీన్ అయిపోతాయి. దీనివల్ల మెషీన్ లైఫ్ కూడా పెరుగుతుంది.

కాబట్టి, ఇకపై వాషింగ్ మెషీన్ వేసేటప్పుడు కిచెన్ లోని ఈ చిన్న చిట్కాను ఫాలో అయిపోండి!

గమనిక : ఇది కేవలం సమాచారం మాత్రమే. పైన పేర్కొన్న చిట్కాలు మరియు గృహోపకరణ హ్యాక్స్ సాధారణ సమాచార ప్రాతిపదికన అందించబడ్డాయి. పట్టు వస్త్రాలు లేదా ప్రత్యేకమైన ఎంబ్రాయిడరీ దుస్తులను ఉతికేటప్పుడు వాటి ట్యాగ్ పై ఉన్న సూచనలను పాటించడం మంచిది. దీనికి సంస్థ ఎలాంటి బాధ్యత వహించదు.

Follow Us
బట్టల మురికి వదలట్లేదా?.. వాషింగ్ మెషీన్‌లో ఇదొక్కటి కలపండి!
బట్టల మురికి వదలట్లేదా?.. వాషింగ్ మెషీన్‌లో ఇదొక్కటి కలపండి!
మీ కెరీర్‌లో గ్రోత్ లేదా?.. మీరు చేసే ఈ చిన్న తప్పే కారణం
మీ కెరీర్‌లో గ్రోత్ లేదా?.. మీరు చేసే ఈ చిన్న తప్పే కారణం
పూజ చేస్తూ మనసు ఇతర విషయాలపైకి వెళ్తే అది పాపమా? ప్రేమానంద్ జీ...
పూజ చేస్తూ మనసు ఇతర విషయాలపైకి వెళ్తే అది పాపమా? ప్రేమానంద్ జీ...
ఒక్క మ్యాచ్ ఆడకుండా ధోనీ ఎంత జీతం తీసుకున్నాడో తెలుసా..?
ఒక్క మ్యాచ్ ఆడకుండా ధోనీ ఎంత జీతం తీసుకున్నాడో తెలుసా..?
కుళాయి నీరు కారుతున్నాయా? మీ ఇంట్లో డబ్బు ఖాళీ అవ్వడం పక్కా
కుళాయి నీరు కారుతున్నాయా? మీ ఇంట్లో డబ్బు ఖాళీ అవ్వడం పక్కా
బ్యాంకులు వరుసగా ఆరు రోజులు బంద్
బ్యాంకులు వరుసగా ఆరు రోజులు బంద్
లక్షలాది ఆధార్ వినియోగదారులకు పెద్ద ఉపశమనం.. గడువు పొడిగింపు..!
లక్షలాది ఆధార్ వినియోగదారులకు పెద్ద ఉపశమనం.. గడువు పొడిగింపు..!
చీప్ రేట్స్ లో దొరికే ఈ 1 గ్రామ్ గోల్డ్ రింగ్స్ పెట్టుకోండి
చీప్ రేట్స్ లో దొరికే ఈ 1 గ్రామ్ గోల్డ్ రింగ్స్ పెట్టుకోండి
మెడలో మంగళ సూత్రం.. కంగనా సీక్రెట్‌గా పెళ్లి చేసుకుందా? వీడియో
మెడలో మంగళ సూత్రం.. కంగనా సీక్రెట్‌గా పెళ్లి చేసుకుందా? వీడియో
భగ భగ మంటున్న సూర్యుడు.. బయటకు వెళ్తే ఈ 5 జాగ్రత్తలు తప్పనిసరి!
భగ భగ మంటున్న సూర్యుడు.. బయటకు వెళ్తే ఈ 5 జాగ్రత్తలు తప్పనిసరి!