AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Asian Games: మరింత దిగజారిన పాకిస్థాన్! మీ ఖర్చులు మీరే పెట్టుకోవాలంటూ.. చేతకాని మాటలు

పాకిస్థాన్ టేబుల్ టెన్నిస్ ఆటగాళ్లకు ఆసియా గేమ్స్‌లో పాల్గొనడానికి స్వయంగా ఖర్చులను భరించాలని PTTF షాక్ ఇచ్చింది. ఆర్థిక సహాయం లేకపోవడమే దీనికి కారణమని ఫెడరేషన్ చెబుతోంది. ఈ నిర్ణయం క్రీడాకారులను తీవ్ర నిరాశకు గురిచేసింది, ఇప్పటికే ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న పాక్ టేబుల్ టెన్నిస్ భవిష్యత్తుపై దీని ప్రభావం పడే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు.

Asian Games: మరింత దిగజారిన పాకిస్థాన్! మీ ఖర్చులు మీరే పెట్టుకోవాలంటూ.. చేతకాని మాటలు
Pakistan
SN Pasha
|

Updated on: Jun 14, 2026 | 2:57 PM

Share

ఈ ఏడాది చివర్లో ఆసియా గేమ్స్‌లో పాల్గొనాలని ఆశిస్తున్న పాకిస్థాన్ టేబుల్ టెన్నిస్ క్రీడాకారులకు ఊహించని ఎదురుదెబ్బ తగిలింది. పాకిస్థాన్ టేబుల్ టెన్నిస్ ఫెడరేషన్(PTTF) తీసుకున్న తాజా నిర్ణయం ప్రకారం.. ఆసియా క్రీడలకు ఎంపికయ్యే ఆటగాళ్లు తమ ప్రయాణం, వసతి, ఇతర ఖర్చులను స్వయంగా భరించాల్సి ఉంటుంది. లాహోర్‌లో జరుగుతున్న జాతీయ ట్రయల్స్ సందర్భంగా తమ రోజువారీ భత్యాలు, ప్రయాణ ఖర్చుల గురించి కొందరు క్రీడాకారులు ఫెడరేషన్ అధికారులను సంప్రదించగా ఈ విషయం వెలుగులోకి వచ్చింది.

ట్రయల్స్‌లో పాల్గొన్నందుకు ఎలాంటి చెల్లింపులు ఉండవని, అంతేకాక ఆసియా క్రీడలకు ఎంపికైన వారు విమాన టికెట్లు, అలాగే పోటీల సమయంలో రోజుకు 50 డాలర్ల చొప్పున అయ్యే ఖర్చులను కూడా స్వయంగా సమకూర్చుకోవాలని వారికి తెలియజేశారు. ఈ నిర్ణయంపై క్రీడాకారులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. పాకిస్థాన్ స్పోర్ట్స్ బోర్డు నుంచి ఫెడరేషన్‌కు ఎలాంటి గ్రాంట్లు లేదా ఆర్థిక సహాయం అందడం లేదని, అలాంటి పరిస్థితుల్లో ట్రయల్స్ నిర్వహించడమే పెద్ద విషయమని ఒక సీనియర్ PTTF అధికారి చెప్పినట్లు క్రీడాకారులు వెల్లడించారు.

ఒక మహిళా క్రీడాకారిణి మాట్లాడుతూ.. “ఆసియా క్రీడల వంటి ప్రతిష్ఠాత్మక టోర్నీలో దేశానికి ప్రాతినిధ్యం వహించాలంటే కూడా సొంత డబ్బుతో వెళ్లాలని చెప్పడం ఆశ్చర్యకరం. క్రీడలను ప్రోత్సహించే విధానం ఇదేనా?” అంటూ ఆవేదన వ్యక్తం చేసింది. పాకిస్థాన్ టేబుల్ టెన్నిస్ క్రీడ ఇప్పటికే ఆర్థిక ఇబ్బందులతో పోరాడుతోంది. అంతర్జాతీయ స్థాయిలో పోటీపడేందుకు సరైన మౌలిక సదుపాయాలు, శిక్షణ, ఆర్థిక మద్దతు అవసరమైన సమయంలో ఈ నిర్ణయం క్రీడాకారులపై అదనపు భారం మోపిందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఆసియా స్థాయిలో టేబుల్ టెన్నిస్‌లో చైనా, సౌత్ కొరియా, ఇండియా, మలేషియా వంటి దేశాలు ఆధిపత్యం చెలాయిస్తున్నాయి. ఈ నేపథ్యంలో పాకిస్థాన్ ఇప్పటివరకు ఆసియా క్రీడలు లేదా ఆసియా టేబుల్ టెన్నిస్ ఛాంపియన్‌షిప్‌లలో ఒక్క పతకం కూడా సాధించలేదు. తాజా ఆర్థిక సంక్షోభం నేపథ్యంలో భవిష్యత్తులో అంతర్జాతీయ వేదికపై పాకిస్థాన్ క్రీడాకారుల ప్రదర్శనపై ప్రభావం పడే అవకాశాలు కనిపిస్తున్నాయి.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Follow Us