రోజూ వంటల్లో వాడే చింతపండులో ఇన్ని ఔషధ గుణాలా?

14 June 2026

TV9 Telugu

TV9 Telugu

మనం తీసుకున్న ఆహారంలోని ఖనిజాల్ని శరీరం సులభంగా గ్రహించేందుకు.. శరీరంలోని విష పదార్థాలను తొలగించేందుకు చింతపండు సహకరిస్తుంది

TV9 Telugu

ఇక అజీర్తి వల్ల కలిగే అసౌకర్యానికి చెక్‌ పెట్టడంతో పాటు శరీరంలోని కొలెస్ట్రాల్‌ని తగ్గించడంలో దీని పాత్ర కీలకం. దీన్ని వివిధ సౌందర్య ఉత్పత్తుల్లోనూ వాడుతుంటారు

TV9 Telugu

జీర్ణవ్యవస్థను ఆరోగ్యంగా ఉంచడంలో.. ఆహారం సులభంగా జీర్ణం కావడానికి ఇది సహాయపడుతుంది. మలబద్ధకం, అసిడిటీ వంటి సమస్యల నుంచి ఉపశమనం కల్పిస్తుంది

TV9 Telugu

దీనితో పాటు, చింతపండులో ఉండే ఫైబర్ జీర్ణవ్యవస్థను ఆరోగ్యంగా ఉంచుతుంది. ఇందులోని పొటాషియం రక్తపోటును నియంత్రించడంలో సహాయపడుతుంది

TV9 Telugu

అంతేకాకుండా, ఇందులో ఉండే యాంటీఆక్సిడెంట్లు గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గిస్తాయి. దీనిలో ఉండే ఫ్లేవనాయిడ్లు చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గించడంలో సహాయపడతాయి

TV9 Telugu

ఇది గుండెను ఆరోగ్యంగా ఉంచుతుంది. చింతపండులో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది. ఇది రోగనిరోధక శక్తిని పరిచి ఇన్ఫెక్షన్లతో పోరాడటానికి సహాయ పడుతుంది

TV9 Telugu

చింతపండులో ఫైబర్ కూడా అధికంగా ఉంటుంది. ఇది కడుపుని ఎక్కువసేపు నిండుగా ఉంచి, ఆకలిని తగ్గిస్తుంది. దీనిలో కేలరీలు కూడా తక్కువగా ఉంటాయి

TV9 Telugu

దీనిలోని యాంటీఆక్సిడెంట్లు, విటమిన్ సి మొటిమలు, మచ్చలు, ఇతర చర్మ సమస్యలను తొలగించడంలో ప్రభావవంతంగా పనిచేస్తుంది