పొగలుకక్కే వేడివేడి టీ తాగితే క్యాన్సర్ రిస్క్.. సంచలన హెచ్చరిక!
14 June 2026
TV9 Telugu
TV9 Telugu
ప్రస్తుతం బరువు తగ్గించే టీలు, శరీరాన్ని డీటాక్స్ చేసే టీలు.. అంటూ ఎన్నో రకాలు మార్కెట్లోకొస్తున్నాయి. కానీ వీటి తయారీలో వాడే పదార్థాలు శరీరంపై తీవ్ర ప్రభావం చూపుతాయి
TV9 Telugu
వీటిని ఎక్కువగా తీసుకోవడం వల్ల డీహైడ్రేషన్, ఎలక్ట్రోలైట్ అసమతుల్యత, పొట్ట ఆరోగ్యం దెబ్బతినడం.. వంటి సమస్యలొస్తాయట
TV9 Telugu
అందుకే వీటిని వాడే ముందు డాక్టర్ సలహా తీసుకోవడం మంచిదంటున్నారు. వేడివేడిగా పొగలు కక్కే టీ తాగడమే చాలామందికి ఇష్టం
TV9 Telugu
కానీ 65 డిగ్రీల సెల్సియస్ కంటే ఎక్కువ వేడి ఉన్న టీ తాగడం వల్ల అన్నవాహిక క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఉందని, కాబట్టి కాస్త చల్లారాక తీసుకోవడమే మేలంటున్నారు నిపుణులు
TV9 Telugu
రాత్రుళ్లు హాయిగా నిద్రపోయినప్పుడే శరీరం తనను తాను రిపేర్ చేసుకోగలుగుతుంది. సంపూర్ణ ఆరోగ్యానికి ఈ దశ కీలకం
TV9 Telugu
అయితే కొంతమంది నైట్‌షిఫ్టులని, ఎక్కువసేపు మెలకువగా ఉండాలని రాత్రి పూట టీ తాగుతుంటారు. దీనివల్ల నిద్రకు ఆటంకం కలిగి లేనిపోని అనారోగ్యాలకు దారితీస్తుంది
TV9 Telugu
వెరైటీగా ప్రయత్నించాలని కొంతమంది బబుల్ టీ రుచి చూస్తుంటారు. నిజానికి దీనిలో క్యాలరీలు, చక్కెరలు మోతాదుకు మించి ఉండటంతో ఆరోగ్య సమస్యలు వస్తాయట
TV9 Telugu
కాబట్టి టీ తాగే విషయంలో మితంగా తీసుకోవడం, శరీరానికి పడకపోతే పక్కన పెట్టేయడం, అవసరమైతే నిపుణుల సలహాలు పాటించడం వంటివన్నీ పాటించాలి