AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Bank Holidays: ఈ నెలలో వరుసగా ఆరు రోజులు బ్యాంకులు బంద్.. ఎప్పుడెప్పుడంటే..?

ఎస్బీఐ ఉద్యోగులు రెండు రోజుల పాటు సమ్మెకు దిగనున్నారు. దీంతో బ్యాంకులు వరుసగా ఆరు రోజుల పాటు మూతపడనున్నాయి. మే 23వ తేదీ నుంచి 28వ తేదీ వరకు బ్యాంకులు క్లోజ్ కానున్నాయి. అలాగే సెలవులు కూడా రావడంతో బ్యాంకులు క్లోజ్ చేయనున్నారు.

Bank Holidays: ఈ నెలలో వరుసగా ఆరు రోజులు బ్యాంకులు బంద్.. ఎప్పుడెప్పుడంటే..?
Bank Holiday
Venkatrao Lella
|

Updated on: May 22, 2026 | 2:38 PM

Share

ఎస్బీఐ బ్యాంక్ కస్టమర్లకు బ్యాడ్ న్యూస్. బ్యాంకు సేవలకు ఆరు రోజుల పాటు అంతరాయం కలగనుంది. మే 23 నుంచి 28వ తేదీ వరకు బ్యాంకు సేవలు నిలిచిపోనున్నాయి. వీకెండ్ హాలీడేస్‌తో పాటు ఎస్బీఐ కార్మికుల రెండు రోజుల సమ్మె, ఈద్-ఉల్-అధా సెలవుల కారణంగా ఎస్బీఐ కస్టమర్లు బ్రాంచ్ సేవలను పొందటంలో ఇబ్బందులను ఎదుర్కొనున్నారు. అయితే బ్రాంచ్ కార్యకలాపాలు నిలిచిపోయినా.. నెట్ బ్యాంకింగ్, యూపీఐ, ఏటీఎం, మొబైల్ బ్యాంకింట్ వంటివి యధాతధంగా పనిచేస్తాయి. బ్రాంచులతో పని ఉన్నవారు ముందుగానే వెళ్లి పనుల పూర్తి చేసుకోవడం మంచిది. దీంతో ఆఫ్ లైన్ బ్యాంకింగ్ పనులు ముందుగా ప్లాన్ చేసుకోండి.

ఎందుకు మూసివేస్తున్నారు..?

మే 23వ తేదీన నాల్గో శనివారం బ్యాంకులకు సాధారణ సెలవు కాగా.. మే 24వ తేదీన ఆదివారం బ్యాంకులు ఉండవు. ఇక ఎస్బీఐ స్టాఫ్ ఫెడరేషన్ తమ డిమాండ్లను నెరవేర్చాలంటూ మే 25,26వ తేదీల్లో సమ్మెకు పిలుపునిచ్చింది. నేషనల్ పెన్షన్ సిస్టమ్ ఫండ్ మేనేజర్ల నియామకం, ఎంపిక, అవుట్ సోర్సింగ్ ఉద్యోగాలు, కేరీర్ గ్రోత్, హెచ్‌ఆర్‌ఎంఎస్ వంటి సమస్యలపై సమ్మె చేపడుతున్నారు. దీంతో మే 23వ తేదీ నుంచి మే 26వ తేదీ వరకు వరుసగా నాలుగు రోజుల పాటు బ్యాంకుల మూతపడనున్నాయి.

వరుసగా నాలుగు రోజులు బంద్

ఇక మే 27,28వ తేదీల్లో దేశంలోని కొన్ని ప్రాంతాల్లో ఈద్-ఉల్-అధా లేదా బక్రీద్ పండుగ సెలవులు ఉన్నారు. ఆర్బీఐ క్యాలెండర్ ప్రకారం కొన్ని రాష్ట్రాల్లో ఈ పండుగ సందర్భంగా బ్యాంకులు మూసివేయనున్నారు. జమ్మూకశ్మీర్‌లో రెండు రోజుల పాటు ఈ పండుగను జరుపుకోనున్నారు. దీంతో అక్కడ ఎస్బీఐ బ్యాంకులు వరుసగా 6 రోజుల పాటు బంద్ కానున్నాయి. బ్యాంక్‌కు వెళ్లే ముందు ఒకసారి తనిఖీ చేసుకోవడం మంచిది. పాస్ బుక్ అప్డేట్, చెక్కు పనులు, లాకర్ యాక్సెస్, బ్రాంచులో నగదు డిపాజిట్, లోన్ పత్రాల సమర్ఫణ వంటి పనులు నిలిచిపోనున్నాయి. దీంతో ఆ లోపు ఈ పనులు పూర్తి చేసుకోండి.

Follow Us
సూర్యతో సినిమా చేస్తానన్న త్రివిక్రమ్‌..అంచనాలు పెంచేస్తున్న మూవీ
సూర్యతో సినిమా చేస్తానన్న త్రివిక్రమ్‌..అంచనాలు పెంచేస్తున్న మూవీ
రెండు సీజన్లు ఇద్దరు స్టార్స్‌... డబుల్ క్లాష్‌ పక్కా..
రెండు సీజన్లు ఇద్దరు స్టార్స్‌... డబుల్ క్లాష్‌ పక్కా..
ముద్దు కూడా పెట్టలేదంటున్న రాకీభాయ్...
ముద్దు కూడా పెట్టలేదంటున్న రాకీభాయ్...
‘గంగ్నమ్ స్టైల్ కి 600 కోట్ల వ్యూస్‌,PSYకి ఎన్ని వందల కోట్లంటే?
‘గంగ్నమ్ స్టైల్ కి 600 కోట్ల వ్యూస్‌,PSYకి ఎన్ని వందల కోట్లంటే?
రోడ్డు నిండుగా దూసుకెళ్తున్న వాహనాలు.. లారీ డ్రైవర్ ఏం చేశాడంటే
రోడ్డు నిండుగా దూసుకెళ్తున్న వాహనాలు.. లారీ డ్రైవర్ ఏం చేశాడంటే
బలపడిన వాయుగుండం.. మరో వారం రోజులు వానలే..
బలపడిన వాయుగుండం.. మరో వారం రోజులు వానలే..
భావోద్వేగంతో ట్రోలర్స్‌పై విరుచుకుపడ్డ ఫరియా అబ్దుల్లా
భావోద్వేగంతో ట్రోలర్స్‌పై విరుచుకుపడ్డ ఫరియా అబ్దుల్లా
బురఖాల్లో వచ్చి ముక్కుపుడక చూపించమన్నారు.. ఆ తర్వాత ఏం జరిగిందో మ
బురఖాల్లో వచ్చి ముక్కుపుడక చూపించమన్నారు.. ఆ తర్వాత ఏం జరిగిందో మ
రెండు ఇళ్ల మధ్య వింత శబ్దాలు.. గమనించిన స్థానికుల గుండె గుభేల్‌!
రెండు ఇళ్ల మధ్య వింత శబ్దాలు.. గమనించిన స్థానికుల గుండె గుభేల్‌!
మైండ్ బ్లాక్ చేస్తోన్న బంగారం 1947లో తులం రూ.88.. నేడు లక్షన్నర
మైండ్ బ్లాక్ చేస్తోన్న బంగారం 1947లో తులం రూ.88.. నేడు లక్షన్నర