కన్ఫ్యూజ్ చేస్తున్న సెకండాఫ్ క్యాలెండర్..రిలీజ్ డేట్స్ విషయంలో ఏంటీ సస్పెన్స్?
టాలీవుడ్లో రాబోయే సినిమా విడుదల తేదీలపై తీవ్ర గందరగోళం నెలకొంది. స్టార్ హీరోల ప్రాజెక్టుల ఆలస్యం వలన యువ హీరోలు తమ సినిమాలకు సరైన తేదీని ఎంపిక చేసుకోలేకపోతున్నారు. విజయ్ దేవరకొండ, వరుణ్ తేజ్, రష్మిక మందన్న వంటి నటుల సినిమాల విడుదల తేదీలు ఇంకా స్పష్టంగా లేకపోవడం ఈ అనిశ్చితికి మరింత ఆజ్యం పోస్తోంది.
స్టార్ హీరోల సినిమాల విడుదల తేదీల విషయంలో నెలకొన్న గందరగోళం ఇప్పుడు ఆడియన్స్‌తో పాటు యువ హీరోలను కూడా కలవరపెడుతోంది. భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్న మోస్ట్ అవైటెడ్ ప్రాజెక్ట్‌లు ఎప్పుడు విడుదల అవుతాయనే దానిపై స్పష్టత లేకపోవడంతో, తమ సినిమాలకు సరైన తేదీలను ఎంచుకోవడానికి యువ హీరోలు సందిగ్ధంలో పడ్డారు. ఏ తేదీకి రావాలనేది నిర్ణయించుకోలేకపోతున్నారు. ఉదాహరణకు, విజయ్ దేవరకొండ ఈ ఏడాది రెండు సినిమాలను ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని నిర్ణయించుకున్నారు. “రణబాలి” సినిమాను సెప్టెంబర్ 11న విడుదల చేస్తున్నట్లుగా మేకర్స్ ప్రకటించారు. అయితే, “రౌడీ జనార్ధన్” విషయంలో మాత్రం ఇంకా స్పష్టత లేదు. డిసెంబర్ రిలీజ్ అని చెబుతున్నప్పటికీ, ఆ సమయంలో ఉన్న పోటీని బట్టి తుది నిర్ణయం తీసుకోవాలని భావిస్తున్నారు.
మరిన్ని వీడియోల కోసం :
సౌత్ టాలెంట్ మీద ఆశలు.. బాలీవుడ్లో నయా ట్రెండ్
అద్దె ఇల్లు కావాలని వచ్చి.. అడ్డంగా దోచేశారు!
4,218 కిలోమీటర్లు ఆటో రిక్షాలో ప్రయాణించి బ్రిటన్ జంట.. చివరికి!
దీపావళిని 5 రోజులు ఎందుకు జరుపుకుంటారు?
ఐటీ ఉద్యోగుల నయా ట్రెండ్.. వర్క్ ఫ్రమ్ పార్క్
ప్యాసింజర్ లగేజ్ చెక్ చేసిన పోలీసులకు దిమ్మతిరిగిపోయే ట్విస్ట్
మానవత్వాన్ని చాటిన కానిస్టేబుల్.. ఏం చేశాడంటే?
హాస్టల్ గదుల్లో నాగుపాములు, తేళ్లు..విద్యార్థినులను కరిచిన ఎలుకలు

